Autism: చిన్నారులను వెంటాడుతున్న ‘ఆటిజం’ .. ఆస్తులు ఒక్కటే కాదు.. మంచి ఆరోగ్యమూ ఇవ్వాలి..
Autism Awareness program: ఆధునిక కాలంలో ఆటిజం కేసులు పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. ముఖ్యంగా బుద్ధిమాంద్యం కేసులు ఎక్కువగా చిన్నారుల్లో గుర్తిస్తారు. అయితే, వయస్సుకు తగ్గట్లు పిల్లల్లో రావాల్సిన మానసిక పరమైన ఎదుగుదల రాకుండా ఉండే పరిస్థితినే ఆటిజం అంటారు. ఈ సమస్య పిల్లల్లో బాల్యంలోనే ప్రారంభమయ్యే జీవితకాల నాడీ సంబంధిత రుగ్మతగా (న్యూరోలాజికల్ డిజార్డర్) వైద్యులు పేర్కొంటారు. ఆటిజంను వాడుక భాషలో మందబుద్ది అని కూడా పిలుస్తుంటారు.

Autism Awareness program: ఆధునిక కాలంలో ఆటిజం కేసులు పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. ముఖ్యంగా బుద్ధిమాంద్యం కేసులు ఎక్కువగా చిన్నారుల్లో గుర్తిస్తారు. అయితే, వయస్సుకు తగ్గట్లు పిల్లల్లో రావాల్సిన మానసిక పరమైన ఎదుగుదల రాకుండా ఉండే పరిస్థితినే ఆటిజం అంటారు. ఈ సమస్య పిల్లల్లో బాల్యంలోనే ప్రారంభమయ్యే జీవితకాల నాడీ సంబంధిత రుగ్మతగా (న్యూరోలాజికల్ డిజార్డర్) వైద్యులు పేర్కొంటారు. ఆటిజంను వాడుక భాషలో మందబుద్ది అని కూడా పిలుస్తుంటారు. అయితే, ఆధునిక వైద్య సదుపాయాలు ఎక్కువగా ఉన్నప్పటికీ ఇలాంటి కేసులు వెలుగులోకి రావడం ఆందోళన కలిగిస్తోంది.
ఈ క్రమంలో నవంబర్ 14వ తేదీన బాలల దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ లోని ప్రముఖ డాక్టర్ ఎ.ఎం రెడ్డి ఆటిజం సెంటర్.. పిల్లల ఆరోగ్యం పట్ల తల్లిదండ్రలుకు అవగాహన సదస్సు నిర్వహించింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సినీ నటి బిగ్ బాస్ ఫేమ్ హిమజ హాజరయ్యారు. నవంబర్ 14వ తేదీన బాలల దినోత్సవం సందర్భంగా డాక్టర్ ఎ.ఎం రెడ్డి ఆటిజం సెంటర్ వారు పిల్లల ఆరోగ్యం పట్ల తల్లిదండ్రలుకు అవగాహన సదస్సును ఏర్పాటు చేయడం అభినందనీయం అన్నారు.
ఈ సందర్భంగా హిమజ మాట్లాడుతూ.. మారుతున్న కాలంలో ప్రస్తుత పరిస్థితుల్లో పిల్లల్లో ఆటిజం సమస్య విపరీతంగా వ్యాప్తిస్తుందని ఆందోళన వ్యక్తంచేశారు. ఇది పిల్లల ఎదుగుదలకు మానసికంగా చాలా ఇబ్బందికి గురిచేస్తుందన్నారు. తల్లిదండ్రుల ప్రస్తుత జీవనశైలి కూడా పిల్లల్లో ఆటిజం సమస్యకు ఒక ముఖ్య కారణమన్నారు. ఆటజంను అరికట్టడానికి డాక్టర్ ఎ.ఎం రెడ్డి ఆటిజం సెంటర్ వారు ఇలాంటి అవగాహన కార్యక్రమాలు చేపట్టడం అభినందనీయమని.. ఈ సదస్సులు ఎంతో చేయూతనిస్తాయని.. డాక్టర్ ఎ.ఎం రెడ్డిని కొనియాడారు.
వీడియో చూడండి..
ఈ సందర్భంగా డాక్టర్ ఎ.ఎం రెడ్డి మాట్లాడుతూ.. పిల్లలకు వ్యాక్సిన్లు, యాంటి బయోటిక్ మందులు వాడటం వలన వారి మెంటల్, ఫిజికల్ హెల్త్ సమస్యలు వస్తాయని పేర్కొన్నారు. ప్రస్తుత కాలంలో పిల్లల ఆరోగ్యం పట్ల తల్లిదండ్రులు శ్రద్ధ వహించాలని సూచించారు. పిల్లలకు తల్లిదండ్రులు ఆస్తులు ఒక్కటే కాకుండా మంచి ఆరోగ్యం ఇవ్వాలని తెలిపారు. ఆటిజాన్ని అరికట్టి పిల్లల భవిష్యత్తుని ఆనందకరంగా, ఆరోగ్యంగా తీర్చిదిద్దడమే తమ లక్ష్యమంటూ స్పష్టంచేశారు. హోమియోపతిలో ఏలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఆటిజం ను నిర్మూలించవచ్చని.. మొదట్లోనే గుర్తిస్తే ఈ వ్యాధిని నియంత్రించవచ్చని పేర్కొన్నారు. ఆటిజం (బుద్ధిమాంద్యం)తో బాధపడే చిన్నారులు ఎదుర్కొనే సమస్యలను, వారికి అందించాల్సిన చికిత్సల గురించి ఎఎం రెడ్డి వివరించారు.
మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..