గోవా నుంచి లిక్కర్ బాటిళ్లు తెచ్చాడు.. ఇన్‌స్టా రీల్‌లో హీరోలా పోజులు కొట్టాడు.. సీన్ కట్ చేస్తే

ప్రస్తుతం సోషల్ మీడియా ట్రెండ్ నడుస్తోంది. ప్రపంచం నలుమూలల ఏం జరిగినా.. క్షణాల్లో ఇంటర్నెట్‌లో దర్శనమిస్తోంది. అలాగే చాలామంది ఇన్‌ఫ్ల్యూయెన్సర్లు తెగ ప్రాయాసలకు పోయి.. లైకులు, ఫాలోవర్స్ కోసం.. ఇన్‌స్టా రీల్స్‌లో ప్రతీది పబ్లిక్ చేసేస్తున్నారు. ఫేమస్ అవ్వాలన్న

గోవా నుంచి లిక్కర్ బాటిళ్లు తెచ్చాడు.. ఇన్‌స్టా రీల్‌లో హీరోలా పోజులు కొట్టాడు.. సీన్ కట్ చేస్తే
Viral
Follow us

|

Updated on: Jul 16, 2024 | 3:14 PM

ప్రస్తుతం సోషల్ మీడియా ట్రెండ్ నడుస్తోంది. ప్రపంచం నలుమూలల ఏం జరిగినా.. క్షణాల్లో ఇంటర్నెట్‌లో దర్శనమిస్తోంది. అలాగే చాలామంది ఇన్‌ఫ్ల్యూయెన్సర్లు తెగ ప్రాయాసలకు పోయి.. లైకులు, ఫాలోవర్స్ కోసం.. ఇన్‌స్టా రీల్స్‌లో ప్రతీది పబ్లిక్ చేసేస్తున్నారు. ఫేమస్ అవ్వాలన్న ఆత్రుతతో కొన్ని రహస్యంగా ఉంచాల్సిన విషయాలను కూడా బహిర్గతం చేసి చిక్కుల్లో పడుతున్నారు. సరిగ్గా ఇక్కడొక వ్యక్తికి కూడా అదే జరిగింది. గోవా నుంచి తాను ఎలా మద్యం బాటిళ్లు తెచ్చుకున్నానో చెబుతూ.. ఓ ఇన్‌స్టా రీల్ చేశాడు. కట్ చేస్తే.. ఆ రీల్ ఎక్సైజ్ శాఖ దాకా చేరింది. అతడికి ఊహించని షాక్ ఇచ్చింది.

ఇది చదవండి: మొబైల్ పట్టుకునే స్టైల్ బట్టి.. మీరు ఎలాంటివారో చెప్పొచ్చు.. ఎలాగో తెల్సా

వివరాల్లోకెళ్తే.. హైదరాబాద్‌కు చెందిన బోరిగర్ల ఆనందపాల్ ఈ మధ్యే తన ఫ్రెండ్స్‌తో కలిసి గోవాకు వెళ్లి.. అక్కడ నుంచి మందు బాటిళ్లు తన వెంట తెచ్చుకున్నాడు. అయితే ఇక్కడొక విషయం మీరు గమనించాల్సి ఉంది.. గోవా నుంచి మద్యం బాటిళ్లు తీసుకొచ్చేందుకు కొన్ని రూల్స్ ఉన్నాయి. పరిమితికి మించి మద్యం రాష్ట్ర సరిహద్దు దాటిస్తే.. చెక్ పోస్టులో ఉన్న పోలీసులు అడ్డుకుని.. వాటిని పగలగొట్టేస్తారు. అయితే గోవాకు వెళ్లిన ఈ ఆనందపాల్.. ఫ్రెండ్స్‌తో కలిసి తిరిగి వచ్చేటప్పుడు ఏకంగా 15 మద్యం బాటిళ్ళను తన వెంట తెచ్చుకున్నాడు. అది కూడా పోలీసులకు తెలియకుండా రహస్యంగా తీసుకొచ్చాడు. ఇక ఈ విషయం రహస్యంగా ఉంచాల్సిందిపోయి.. ఇన్‌స్టా రీల్ చేసి మరీ బయటపెట్టాడు.

ఇవి కూడా చదవండి

ఇది చదవండి: చిమ్మచీకట్లో నల్లటి ఆకారాలు.. ఏంటని దగ్గరకెళ్లి చూడగా.. గుండె ఆగినంత పనైంది

తాను గోవాలో ఎన్ని మద్యం బాటిళ్లు కొన్నది.? ఎంత తక్కువ ధరకు కొన్నది.? ప్యాకింగ్ చేయించిన వివరాలు.. పోలీసులకు తెలియకుండా ట్రైన్, ఫ్లైట్‌ ద్వారా ఎలా తెచ్చుకోవాలి లాంటివి వివరిస్తూ.. ఇన్‌స్టా రీల్ చేశాడు సదరు వ్యక్తి. ఇక అది కాస్తా వైరల్ అయ్యి.. ఎక్సైజ్ పోలీసుల వరకు చేరింది. ఈ వీడియోను సుమోటోగా తీసుకుని పోలీసులు కేసు నమోదు చేశారు. సదరు వ్యక్తి ఇంటికి వెళ్లి 10 మద్యం బాటిళ్లు స్వాధీనం చేసుకోవడమే కాకుండా.. 1968 ఎక్సైజ్ యాక్ట్ ప్రకారం నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ తీసుకురావడం నేరంగా పేర్కొంటూ అతడిపై కేసు బుక్కు చేశారు. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

ఇది చదవండి: ఆ స్కూలంతా కుప్పలు తెప్పలుగా పాములే పాములు.. ధైర్యమున్నోడు కూడా దడుసుకోవాల్సిందే

మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి..