BRS: ఓ వైపు ఫిరాయింపులు.. మరోవైపు ప్రొటోకాల్ రగడ.. స్పీకర్‌కు ఫిర్యాదు చేసిన బీఆర్ఎస్..

ఓ వైపు ఫిరాయింపులు.. మరోవైపు ప్రొటోకాల్ రగడ.. ఈ రెండు విషయాలపై బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పై మండిపడుతోంది.. ఈ క్రమంలోనే.. పార్టీ మారిన పది మంది ఎమ్మెల్యేలపై బీఆర్‌ఎస్ స్పీకర్‌ గడ్డం ప్రసాద్ కు ఫిర్యాదు చేసింది.. పిటిషన్ల మీద నిర్ణయం తీసుకునే అధికారం స్పీకర్‌కే ఉందని.. వెంటనే చర్యలు తీసుకోవాలని మాజీ మంత్రి కేటీఆర్ స్పీకర్‌ని కోరారు.

BRS: ఓ వైపు ఫిరాయింపులు.. మరోవైపు ప్రొటోకాల్ రగడ.. స్పీకర్‌కు ఫిర్యాదు చేసిన బీఆర్ఎస్..
BRS complains to Speaker
Follow us

|

Updated on: Jul 16, 2024 | 3:17 PM

ఓ వైపు ఫిరాయింపులు.. మరోవైపు ప్రొటోకాల్ రగడ.. ఈ రెండు విషయాలపై బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పై మండిపడుతోంది.. ఈ క్రమంలోనే.. పార్టీ మారిన పది మంది ఎమ్మెల్యేలపై బీఆర్‌ఎస్ స్పీకర్‌ గడ్డం ప్రసాద్ కు ఫిర్యాదు చేసింది.. పిటిషన్ల మీద నిర్ణయం తీసుకునే అధికారం స్పీకర్‌కే ఉందని.. వెంటనే చర్యలు తీసుకోవాలని మాజీ మంత్రి కేటీఆర్ స్పీకర్‌ని కోరారు.. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై 3 నెలల్లో చర్యలు తీసుకోవాలని కోర్టులు చెప్తున్నాయి. అలా జరగని పక్షంలో కోర్టులు జోక్యం చేసుకుంటాయి. అంతవరకూ తెచ్చుకోవద్దంటూ స్పీకర్‌కి విన్నవించుకున్నట్లు కేటీఆర్ తెలిపారు. సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చే వరకు స్పీకర్ తెచ్చుకోవద్దంటూ సూచించారు. తమ ఎమ్మెల్యేలను తీసుకుని కాంగ్రెస్ మురిసిపోతోందని.. కాంగ్రెస్ ఎంపీలు వెళ్లిపోతే ఆ పార్టీని ఎవరు కాపాడుతారు? అంటూ కేటీఆర్ ప్రశ్నించారు. పార్టీ మారిన వాళ్లను రాళ్లతో కొట్టాలని గతంలో రేవంత్ అన్నారు.. ఇప్పుడు మా పార్టీ నుంచి వచ్చిన వాళ్లను ఏ రాయితో కొట్టాలంటూ పేర్కొన్నారు. ఈ సందర్భంగా విద్యుత్‌ కమిషన్‌ చైర్మన్‌ తీరుపైనా కేటీఆర్ విమర్శలు చేశారు. కరెంట్‌పై కమిషన్ వేసి కాంగ్రెస్ తన గొయ్యి తానే తవ్వుకుంటోందని.. విచారణ కోసం ఏర్పాటైన కమిషన్ ముందే తీర్పు చెప్తే ఎలా ? నరసింహారెడ్డి పక్షపాతంగా వ్యవహరించినందుకే సుప్రీంకోర్టు చివాట్లు పెట్టిందంటూ కేటీఆర్ పేర్కొన్నారు.

ఇదిలాఉంటే.. ప్రోటోకాల్ ఉల్లంఘనపై కూడా బీఆర్‌ఎస్ నేతలు స్పీకర్‌కు ఫిర్యాదు చేశారు. ప్రతిపక్ష ఎమ్మెల్యేలను పక్కనబెట్టి ఓడిపోయిన నేతలతో కార్యక్రమాలు చేయిస్తున్నారంటూ స్పీకర్‌కి విన్నవించారు. ఇన్‌ఛార్జ్‌లతో కార్యక్రమం చేయించే ప్రోటోకాల్ ఎక్కడుందంటూ ప్రశ్నిస్తున్నారు. అధికారులు సైతం తమ పార్టీ ఎమ్మెల్యేలను పట్టించుకోవడం లేదంటున్న బీఆర్‌ఎస్..ప్రతిపక్ష ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో ప్రోటోకాల్ ఉల్లంఘన జరుగుతోందన్నారు. తమ హక్కులను కాపాడాలంటూ స్పీకర్‌కు వినతిపత్రం సమర్పించారు. కాంగ్రెస్ పార్టీ ఇన్‌ఛార్జ్‌లతో కార్యక్రమం చేయించే ప్రోటోకాల్ ఎక్కడుంది? అధికారులు సైతం తమ పార్టీ ఎమ్మెల్యేలను పట్టించుకోవడం లేదని బీఆర్‌ఎస్ నేతలు ఫిర్యాదు చేశారు.

వీడియో చూడండి..

ప్రతిపక్ష ఎమ్మెల్యేలు గెలిచిన చోట ఓడిన అభ్యర్థులతో కార్యక్రమాలు చేయిస్తున్నారు.. ఇదేం ప్రజాపాలన అంటూ మాజీ మంత్రి సబిత ఇంద్రారెడ్డి ప్రశ్నించారు. కాంగ్రెస్ గెలిచిన చోట కూడా ఓడిన అభ్యర్థులతో కార్యక్రమాలు చేయిస్తారా? అంటూ నిలదీశారు. ఓడిపోయిన నేతలతో ప్రభుత్వ కార్యక్రమాలు చేయిస్తున్నారని.. ఇక అసెంబ్లీకి కూడా వాళ్లనే పిలవండి అంటూ ఎమ్మెల్యే పద్మారావు గౌడ్ తన అసంతృప్తిని వ్యక్తం చేశారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..