మీ ఫ్రెండ్ ఆన్‌లైన్ లోన్ తీసుకుంటే.. త్వరలో మీరు ఇబ్బంది పడతారు.. ఎలాగంటే..

ఆన్‌లైన్లో లోన్ తీసుకుని తిరిగి కట్టలేక అనేకమంది ఇబ్బందులకు గురవుతున్నారు. అధిక మొత్తంలో వడ్డీలు వేయడంతో తీసుకున్న లోన్ క్లోజ్ అవ్వడానికి నానా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. ఈ తరుణంలో చాలామంది బ్యాంకుల నుండి వస్తున్న కాల్స్‎ను లిఫ్ట్ చేయకుండా వదిలేస్తూ ఉంటారు.

మీ ఫ్రెండ్ ఆన్‌లైన్ లోన్ తీసుకుంటే.. త్వరలో మీరు ఇబ్బంది పడతారు.. ఎలాగంటే..
Loan App
Follow us

| Edited By: Srikar T

Updated on: Jul 16, 2024 | 4:36 PM

ఆన్‌లైన్లో లోన్ తీసుకుని తిరిగి కట్టలేక అనేకమంది ఇబ్బందులకు గురవుతున్నారు. అధిక మొత్తంలో వడ్డీలు వేయడంతో తీసుకున్న లోన్ క్లోజ్ అవ్వడానికి నానా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. ఈ తరుణంలో చాలామంది బ్యాంకుల నుండి వస్తున్న కాల్స్‎ను లిఫ్ట్ చేయకుండా వదిలేస్తూ ఉంటారు. ఇలాంటి వారికి చెక్ పెట్టేందుకు చైనీస్ లోన్ సంస్థలు కొత్త తరహా విధానాన్ని అమలు చేస్తున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ప్రతి పది నిమిషాలకు ఒక కాలు వచ్చేలా రూపకల్పన చేస్తున్నారు.

తీసుకున్న లోన్ అమౌంటు సరైన సమయానికి కట్టని పక్షంలో ఈతరహా విధానాన్ని అమలు చేయబోతున్నారు. దీని ద్వారా లోన్ తీసుకునే సమయంలోనే మన ఫోన్లో ఉన్న కాంటాక్ట్స్‎పై పూర్తిగా అనుమతి ఇస్తాము. లోన్ వస్తుంది అనే ఆశలో నిబంధనలు పూర్తిగా చదవకుండానే అన్నిటికీ అనుమతి ఇస్తుంటాము. చివరికి అదే మన కొంప ముంచేలా చేస్తుంది. మన కాంటాక్ట్స్‎పై ఫైనాన్స్ సంస్థలకు పూర్తిగా అనుమతి ఇవ్వడంతో అసలు సమస్య మొదలవుతుంది. సరైన టైంలో లోన్ కట్టని తరుణంలో కాంటాక్ట్స్‎లో ఉన్న అందరికీ కాల్స్ చేసి మీ గురించి చెప్పి వారి నుండి డబ్బులు వాసులు చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి.

ఇటీవల కరీంనగర్‎లో ఓ ఘటన ద్వారా ఈ విషయం బయటపడింది. ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ (AI) ద్వారా సరైన టైంలో లోన్ కట్టని వారికి ప్రతి పది నిమిషాలకు ఒక కాల్ వెళ్లేలా రూపకల్పన చేశారు. దీంతోపాటు వీరి కాంటాక్ట్స్‎లో ఉన్న మిగతా సభ్యులకు సైతం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ప్రతి గంటకు కాల్స్ చేస్తూ వేధిస్తున్నారు. అలా కాల్స్ వస్తున్న వారిలో వివిధ హోదాలో ఉన్న పెద్దలు సైతం ఉండటం విశేషం. పోలీసులు రాజకీయ నేతలు, డాక్టర్, లాయర్లు‎కు ఈ తరహా కాల్స్ వెళ్తున్నాయి. మొన్నటి వరకు టెలీకాలర్స్ ద్వారా ఈతతంగాన్ని నడిపేవారు. అయితే ఇప్పుడు AI వచ్చిన తర్వాత వారి పని మరింత సులువుగా మారింది. ఇలాంటి కాల్స్ వచ్చిన పలువురు ఇప్పటికే సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు. లోన్ తీసుకున్న వ్యక్తి సరైన టైంలో డబ్బులు కట్టని పక్షంలో అతని కాంటాక్ట్ లిస్టును యాక్సిస్ చేస్తున్న AI.. వారికి కాల్స్ చేసి లోన్ అమౌంట్ కట్టాలని వేధింపులకు గురి చేస్తున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..