Asaduddin Owaisi: బీఆర్‌ఎస్‌ను బీజేపీలో విలీనం చేస్తారా..? బయటినుంచి మద్దతిస్తారా..? అసదుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు

ఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్‌ ఓవైసీ కీలక వ్యాఖ్యలు చేశారు. బీఆర్‌ఎస్‌ను బీజేపీలో విలీనం చేస్తారని, లేదంటే బీజేపీకి బీఆర్‌ఎస్‌ బయటనుంచి మద్దతిస్తుందని ప్రముఖ మీడియాలో వార్తలు వస్తున్నాయని అన్నారు. ఈ వార్తలపై బీఆర్‌ఎస్‌ నాయకత్వం స్పందించాలని డిమాండ్‌ చేశారు.

Follow us
Shaik Madar Saheb

|

Updated on: Jul 16, 2024 | 4:16 PM

ఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్‌ ఓవైసీ కీలక వ్యాఖ్యలు చేశారు. బీఆర్‌ఎస్‌ను బీజేపీలో విలీనం చేస్తారని, లేదంటే బీజేపీకి బీఆర్‌ఎస్‌ బయటనుంచి మద్దతిస్తుందని ప్రముఖ మీడియాలో వార్తలు వస్తున్నాయని అన్నారు. ఈ వార్తలపై బీఆర్‌ఎస్‌ నాయకత్వం స్పందించాలని డిమాండ్‌ చేశారు. రాజకీయాల్లో ఏదైనా సాధ్యమేనని మాజీ ఎంపీ వినోద్‌ చేసిన వ్యాఖ్యలపై కూడా స్పష్టత ఇవ్వాలని పేర్కొన్నారు.

‘‘తెలంగాణ వచ్చింది.. తెలంగాణ అభివృద్ధి చెందింది.. ఇంకా చాలా సమస్యలు ఉన్నాయి.. కానీ, ప్రశ్న ఏమిటంటే.. బీఆర్ఎస్ బీజేపీలో విలీనం అవుతుందా..? లేదా మద్దతిస్తుందా..? అనేది నాకు తెలియదు.. కానీ కొన్ని ప్రముఖ పత్రికలు వార్తా కథనాలను ప్రచురించాయి.. దానిలో మాజీ ఎంపీ వినోద్ వ్యాఖ్యలు కూడా ఉన్నాయి..’’ అంటూ అసదుద్దీన్ ఓవైసీ పేర్కొన్నారు. ఈ విషయంలో తనను ఎప్పుడైనా విమర్శించొచ్చన్న అసదుద్దీన్ ఓవైసీ.. మీడియాలో వస్తున్నవార్తలపై బీఆర్‌ఎస్‌ స్పందించాలని డిమాండ్ చేశారు..

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..