AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: వామ్మో ఇలా ఉన్నారేంట్రా..తెల్లారేసరికి బస్టాండ్ బస్టాండే హుష్ కాకీ..

హైదరాబాద్లోని హబ్సిగూడ ఎంజీఆర్ఐ మెట్రో స్టేషన్ పక్కనే ఉన్న బస్టాండ్ రాత్రికి రాత్రే మాయమైపోయింది. ఏకంగా బస్టాండ్ బస్టాండనే కొందరు దుండగులు మాయం చేశారు. ఆదివారం రాత్రి బస్ స్టాప్‌ను గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. సోమవారం ఉదయం బస్సు కోసం బస్ స్టాప్‌కు వచ్చిన ప్రయాణికులు స్టాప్ కనిపించకపోవడంతో అవాక్కయ్యారు.

Telangana: వామ్మో ఇలా ఉన్నారేంట్రా..తెల్లారేసరికి బస్టాండ్ బస్టాండే హుష్ కాకీ..
Bus Stand Vandalized In Hyderabad
Vijay Saatha
| Edited By: Velpula Bharath Rao|

Updated on: Nov 12, 2024 | 7:34 PM

Share

హైదరాబాద్లో ఒక వింత ఘటన చోటు చేసుకుంది. ఏకంగా బస్ స్టాపునే కొందరు దుండగులు మాయం చేశారు. ఆదివారం రోజు రాత్రి  బస్ స్టాప్‌ను గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. సోమవారం ఉదయం బస్సు కోసం బస్ స్టాప్‌కు వచ్చిన ప్రయాణికులు స్టాప్ కనిపించకపోవడంతో అవాక్కయ్యారు. బస్సు స్టాప్ ఆనవాళ్ళు కనిపించకుండా పూర్తిగా ధ్వంసం చేశారు. దీంతో చేసేది ఏమి లేక  ప్రయాణికులు బస్ స్టాప్‌కు పక్కనే ఎండలోనే నిల్చున్నారు.

ఈ ఘటన హబ్సిగూడ నాచారం మధ్యలో ఉన్న రోడ్డులో చోటుచేసుకుంది. హబ్సిగూడ ఎంజీఆర్ఐ మెట్రో స్టేషన్ పక్కనే ఉన్న బస్సు స్టాప్ రాత్రికి రాత్రే  మాయమైపోయింది.. ఈ బస్ స్టాప్‌కు పక్కనే ఒక నర్సరీ దుకాణం ఉంది. నర్సరీ నిర్వాహకులను సైతం ప్రజలు బస్ స్టాప్ గురించి అడిగారు. తమకు తెలియదు అని సమాధానం చెప్పడంతో అక్కడ ఉన్న పలువురు జిహెచ్ఎంసీ అధికారులకు ఫిర్యాదు చేశారు.

జీహెచ్ఎంసీ అధికారులు నుండి వివరణ కోరగా తాము ఈ ఘటనపై ఎంక్వైరీ చేస్తున్నట్లు అధికారులు బదులిచ్చారు. వెంటనే ఘటన స్థలానికి చేరుకున్న జీహెచ్ఎంసీ అధికారులు పక్కన ఉన్న నర్సరీ నిర్వాహకలను సైతం ప్రశ్నించారు. వారి నుండి కూడా ఎలాంటి సమాచారం లభించలేదు. దీంతో ఎవరో దుండగులు కావాలని  బస్ స్టాప్‌కి ఉన్న ఇనుమును దొంగలించే ప్రయత్నం చేశారని అధికారులు అనుమానిస్తున్నారు. ఇనుము కోసం బస్ స్టాప్‌కు ఉన్న రాడ్లను ఎత్తుకెళ్లినట్లు అధికారులు భావిస్తున్నారు.

వీడియో ఇదిగో:

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

మీకేకాదు ఓలా, ఉబర్ మాకు ఉంది!ఆటోలో ఆవుదూడ చక్కర్లు చూస్తే అవాక్కే
మీకేకాదు ఓలా, ఉబర్ మాకు ఉంది!ఆటోలో ఆవుదూడ చక్కర్లు చూస్తే అవాక్కే
రాత్రిపూట నీళ్లు దగ్గర పెట్టుకుని పడుకుంటున్నారా.. మీరు ఈ ప్రమాదం
రాత్రిపూట నీళ్లు దగ్గర పెట్టుకుని పడుకుంటున్నారా.. మీరు ఈ ప్రమాదం
ఛీ..చిలిపి.. కులదీప్‎ను లాగి మరీ డ్యాన్స్ స్టెప్పులేసిన విరాట్
ఛీ..చిలిపి.. కులదీప్‎ను లాగి మరీ డ్యాన్స్ స్టెప్పులేసిన విరాట్
కుజ గ్రహ సంచారం.. వీరికి ఊహించని ధన లాభం!
కుజ గ్రహ సంచారం.. వీరికి ఊహించని ధన లాభం!
బంపర్ ఆఫర్ అంటే ఇదే..2026లో లక్ష్యాధికారులయ్యే రాశులు వీరే!
బంపర్ ఆఫర్ అంటే ఇదే..2026లో లక్ష్యాధికారులయ్యే రాశులు వీరే!
భద్ర మూవీ భామ ఇప్పుడు ఎలా ఉందంటే
భద్ర మూవీ భామ ఇప్పుడు ఎలా ఉందంటే
అభిషేక్ విధ్వంసం..34 బంతుల్లో 62 రన్స్..26 సిక్సర్లతో రికార్డ్
అభిషేక్ విధ్వంసం..34 బంతుల్లో 62 రన్స్..26 సిక్సర్లతో రికార్డ్
చలికాలం ఉదయాన్నే వాకింగ్‌ చేస్తున్నారా..? తస్మాత్‌ జాగ్రత్త!
చలికాలం ఉదయాన్నే వాకింగ్‌ చేస్తున్నారా..? తస్మాత్‌ జాగ్రత్త!
ఈ చెక్క సాగుతో కోట్లల్లో లాభం.. కాసుల వర్షం కురిపించే వ్యాపారం
ఈ చెక్క సాగుతో కోట్లల్లో లాభం.. కాసుల వర్షం కురిపించే వ్యాపారం
మీ గోళ్లలోనే మీ ఊపిరితిత్తుల ఆరోగ్య రహస్యం.. ఈ లక్షణాలు..
మీ గోళ్లలోనే మీ ఊపిరితిత్తుల ఆరోగ్య రహస్యం.. ఈ లక్షణాలు..