AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: పాతబస్తీలో దారుణం.. భార్యతో గొడవ.. చివరకు ఏం జరిగిందంటే..

అతను ఆటో డ్రైవర్.. ఇష్టంగా ఆమెను పెళ్లి చేసుకున్నాడు.. అయితే.. చిన్నపాటి గొడవలకే తట్టుకోలేకపోయాడు... కోపంతో భార్యపై రగిలిపోయాడు.. రాత్రి భార్యాభర్తల మధ్య మళ్లీ గొడవైంది.. కోపంతో ఆమెపై చేయిచేసుకున్నాడు.. ఆ తర్వాత ఆమె గొంతు కోసి..

Hyderabad: పాతబస్తీలో దారుణం.. భార్యతో గొడవ.. చివరకు ఏం జరిగిందంటే..
Crime News
Noor Mohammed Shaik
| Edited By: |

Updated on: Nov 12, 2024 | 7:34 PM

Share

అతను ఆటో డ్రైవర్.. ఇష్టంగా ఆమెను పెళ్లి చేసుకున్నాడు.. అయితే.. చిన్నపాటి గొడవలకే తట్టుకోలేకపోయాడు… కోపంతో భార్యపై రగిలిపోయాడు.. రాత్రి భార్యాభర్తల మధ్య మళ్లీ గొడవైంది.. కోపంతో ఆమెపై చేయిచేసుకున్నాడు.. ఆ తర్వాత ఆమె గొంతు కోసి చంపాడు.. చివరకు ఆమె మృతదేహాన్ని ఇంట్లోనే తగులబెట్టాడు.. ఈ షాకింగ్ ఘటన హైదరాబాద్ లోని పాత బస్తీలో చోటుచేసుకుంది.. కట్టుకున్న భార్యను అతి కిరాతకంగా చంపిన ఘటన పాతబస్తీ బండ్లగూడ పోలీస్ స్టేషన్ పరిధిలోని హస్మాబాద్ ఖాద్రియా మసీదు ప్రాంతంలో చోటుచేసుకుంది.. భార్య గొంతు కోసి ఆ తర్వాత తగులబెట్టాడు ఆటో డ్రైవర్..

స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బండ్లగూడలో నివాసం ఉంటున్న ఫైజ్‌ ఖురేషి(28) వృత్తిరీత్యా ఆటో డ్రైవర్.. పిసల్ బండకు చెందిన ఖమర్ బేగం అనే యువతితో ఆరేళ్ల క్రితం పెళ్లి జరిగింది. అయితే.. వీరికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. అందరి జీవితం లాగే వీరి సంసారంలో కూడా చిన్న చిన్న గొడవలు వస్తూ ఉండేవి.. ఇరువురు కుటుంబసభ్యులు ఇద్దరిని సముదాయించి చెప్పేవారు..

ఈ క్రమంలో గత సోమవారం అర్ధరాత్రి కూడా దంపతుల మధ్య ఓ చిన్నపాటి గొడవ వచ్చింది. ఏదో విషయమై ఇద్దరి మధ్య మాటామాటా పెరిగి ఘర్షణకు దారితీసింది. దీంతో భర్త ఖురేషి తీవ్రస్థాయిలో కోపోద్రిక్తుడయ్యాడు.. భార్య ఖమర్ పై కత్తితో దాడి చేసి ఆమె గొంతు కోశాడు. అంతటితో ఆగకుండా ఆమె మృతదేహాన్ని తగులబెట్టాడు.

ఇంతటి దారుణానికి పాల్పడిన అనంతరం ఖురేషి పోలీస్ స్టేషన్ కు వెళ్లి లొంగిపోయడు. ఘటనా స్థలికి వెళ్లిన పోలీసులు మంటల్లో కాలిపోయిన ఖమర్ మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని.. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని బండ్లగూడ పోలీసులు తెలిపారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్