Hyderabad: ఛీ.. ఛీ.. దుర్మార్గుడా.. భార్యకు గుండు గీసి, వివస్త్రను చేసి.. ఆపై
దొంగతనం కేసులో దొంగను పట్టుకున్న పోలీసులకు షాకింగ్ నిజం తెలిసింది. దొంగసొమ్ముతో మందు కొట్టి, ఆ మత్తులో భార్యను చంపేసిన ఘటన కలకలం రేపుతోంది. తనకు చెప్పకుండా పుట్టింటికి వెళ్లొచ్చిందని భార్యపై విచక్షణారహితంగా దాడి చేశాడు.. ఆతర్వాత.. ఆమెకు గుండు గీసి.. వివస్త్రను చేసి అత్యంత క్రూరంగా చంపాడు..

దొంగతనం కేసులో దొంగను పట్టుకున్న పోలీసులకు షాకింగ్ నిజం తెలిసింది. దొంగసొమ్ముతో మందు కొట్టి, ఆ మత్తులో భార్యను చంపేసిన ఘటన కలకలం రేపుతోంది. తనకు చెప్పకుండా పుట్టింటికి వెళ్లొచ్చిందని భార్యపై విచక్షణారహితంగా దాడి చేశాడు.. ఆతర్వాత.. ఆమెకు గుండు గీసి.. వివస్త్రను చేసి అత్యంత క్రూరంగా చంపాడు.. ఈ దారుణ ఘటన హైదరాబాద్ బోరబండలోని సాయిబాబా నగర్‌లో చోటుచేసుకుంది. బోరబండ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పోలీస్ స్టేషన్ పరిధిలోని సాయిబాబా నగర్‌లో నరసింహులు.. అతని భార్య సోనీ మూడు సంవత్సరాలుగా అద్దె ఇంట్లో నివసిస్తున్నారు.. వీరిద్దరికీ ఒక బాబు సంతానం.. నరసింహులకు చోరీలు చేయడం అలవాటు.. ఈనెల 1వ తేదీన సాయిబాబా నగర్‌లోని నాగులమ్మ దేవాలయంలో చోరీకి పాల్పడ్డాడు నిందితుడు నరసింహులు.. చోరీ చేసిన డబ్బులతో మద్యం తాగి తిరిగి ఇంటికి వెళ్ళాడు.. ఈ క్రమంలోనే.. ఫతేనగర్‌లోని తన తల్లి ఇంటికి వెళ్లి తిరిగి వచ్చిన సోనీను దుర్భషలాడుతూ దాడి చేశాడు.. తనకు చెప్పకుండా ఏ విధంగా పుట్టింటికి వెళ్తావని ఆమె మీద విచక్షణ రహితంగా దాడికి పాల్పడ్డాడు.. ఆ తర్వాత ఆమెను వివస్త్ర ను చేసి గుండు కొట్టి హత్య చేశాడు. ఆ తర్వాత భార్య దుస్తులను కాల్చివేశాడు. ఇవన్నీ విచారణలో వెల్లయ్యాయి..
సాయిబాబా నగర్‌కు చెందిన నిందితుడు ఓర్సు నర్సింహులు వరుస దొంగతనాలకు పాల్పడుతున్నాడు.. అతడిపై వివిధ పోలీస్ స్టేషన్‌లలో 16 కేసులు నమోదయ్యాయి. అయితే.. మూడు రోజుల క్రితం బోరబండలోని నాగుల ఎల్లమ్మ ఆలయంలోను హుండీ చోరీ చేశాడు. చోరీ చేసిన సొమ్ముతో ఫుల్‌గా మద్యం తాగాడు నరసింహులు.. సీసీటీవీ ఫుటేజ్ పరిశీలించిన పోలీసులు మద్యంమత్తులో ఉన్న నరసింహులుని అదుపులోకి తీసుకొని విచారించారు..
పోలీసుల విచారణలో షాకింగ్ నిజాలు బయటపడ్డాయి.. పోలీసులు నిందితుడి ఇంటికి వెళ్లి చూడగా.. భార్య మృతదేహం కనిపించింది. మృతదేహానికి గుండుగీసి, వివస్త్రంగా ఉన్నట్టు గుర్తించారు. నర్సింహులు మద్యం మత్తులో భార్యపై దాడి చేసి గుండుగీసి, వివస్త్రను చేసి చంపేసినట్టు పోలీసులు గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. వీరిద్దరికీ ఎనిమిదేళ్ల క్రితం వివాహం జరిగిందని.. గంజాయి, మద్యానికి బానిసైన నరసింహులు తరచూ ఆమెపై దాడికి పాల్పడుతుండేవాడని కుటుంబసభ్యులు తెలిపారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..