TG TET 2025 Answer Key: తెలంగాణ టెట్ 2025 ఆన్సర్ కీ విడుదల.. అభ్యంతరాలు స్వీకరణ తుది గడువు ఇదే
రాష్ట్రంలో గత నెలలో టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (టెట్ జూన్ సెషన్) 2025 పరీక్ష నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ పరీక్షలకు సంబంధించిన ప్రాథమిక ఆన్సర్ కీ తాజాగా విడుదలైంది. ఆన్సర్ కీతోపాటు రెస్పాన్స్‌షీట్లను కూడా వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచినట్లు టెట్ కన్వినర్ నవీన్ నికోలస్ ఒక ప్రకటనలో తెలిపారు..

హైదరాబాద్, జులై 6: తెలంగాణ రాష్ట్రంలో గత నెలలో టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (టెట్ జూన్ సెషన్) 2025 పరీక్ష నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ పరీక్షలకు సంబంధించిన ప్రాథమిక ఆన్సర్ కీ తాజాగా విడుదలైంది. ఆన్సర్ కీతోపాటు రెస్పాన్స్‌షీట్లను కూడా వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచినట్లు టెట్ కన్వినర్ నవీన్ నికోలస్ ఒక ప్రకటనలో తెలిపారు. టెట్ పరీక్షలు రాసిన అభ్యర్ధులు అధికారిక వెబ్‌సైట్‌లో తమ వివరాలు నమోదు చేసి వీటిని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఆన్సర్ కీపై అభ్యంతరాలను జులై 8వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు ఆన్‌లైన్ పంపించడానికి అవకాశం ఉంటుందని టెట్ కన్వినర్ నవీన్ నికోలస్ సూచించారు.
తెలంగాణ టెట్-2025 ప్రాథమిక కీ, రెస్పాన్స్‌షీట్ల డౌన్‌లోడ్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కాగా టెట్ పరీక్షలు జూన్ 18 నుంచి 30వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా పలు పరీక్ష కేంద్రాల్లో ఆన్‌లైన్ విధానంలో 9 రోజుల పాటు 16 సెషన్లలో నిర్వహించిన సంగతి తెలిసిందే. పేపర్ 1కు 63,261 మంది దరఖాస్తు చేసుకోగా ఇందులో 47,224 మంది అంటే 74.65 శాతం పరీక్షలకు హాజరయ్యారు. అలాగే పేపర్ 2 మ్యాథ్స్ అండ్ సైన్స్ పేపర్‌కు 66,686 మంది దరఖాస్తు చేసుకుంటే 48,998 మంది అంటే 73.48 శాతం మంది పరీక్షకు హాజరయ్యారు.
ఇక పేపర్ 2 సోషల్ స్టడీస్ పేపర్‌కు 53,706 మంది దరఖాస్తు చేసుకోగా.. వారిలో 41,207 మంది అంటే 76.73 శాతం మంది పరీక్షకు హాజరయ్యారు. ఆన్సర్ కీపై అభ్యంతరాలు స్వీకరించిన అనంతరం తుది కీ రూపొందించి, ఫలితాలు వెల్లడించేందుకు విద్యాశాఖ కసరత్తులు చేస్తుంది. ఇతర వివరాలు అధికారిక వెబ్‌సైట్‌లో చెక్ చేసుకోవచ్చు.
మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి.