సైదాబాద్‌లో కలకలం రేపిన పేలుళ్లు..
హైదరాబాద్ పాతబస్తీలో పేలుళ్లు కలకలం రేపాయి. సైదాబాద్‌లోని వీఐపీ పాఠశాల పక్కనున్న ఓ భవన నిర్మాణం పనుల్లో భాగంగా.. జిలెటిన్ స్టిక్స్ ఉపయోగించి పేలుళ్లు చేపట్టారు. దీంతో ఒక్కసారిగా భారీ శబ్ధాలు రావడంతో.. స్థానికులు ఇళ్ల నుంచి బయటకు పరుగులు పెట్టారు.అయితే అకస్మాత్తుగా ఈ పేలుళ్లు సంభవించడంతో.. స్థానికులు, పక్కనే ఉన్న పాఠశాల విద్యార్ధులు భయాందోళనలకు గురయ్యారు. పేలుళ్ల కోసం భారీ జిలెటిన్‌స్టిక్స్‌ను ఉపయోగించడంతో భారీ శబ్ధం వచ్చింది. సమీపంలోని పలువురికి స్వల్ప గాయాలు కూడా అయ్యాయి. […]
హైదరాబాద్ పాతబస్తీలో పేలుళ్లు కలకలం రేపాయి. సైదాబాద్‌లోని వీఐపీ పాఠశాల పక్కనున్న ఓ భవన నిర్మాణం పనుల్లో భాగంగా.. జిలెటిన్ స్టిక్స్ ఉపయోగించి పేలుళ్లు చేపట్టారు. దీంతో ఒక్కసారిగా భారీ శబ్ధాలు రావడంతో.. స్థానికులు ఇళ్ల నుంచి బయటకు పరుగులు పెట్టారు.అయితే అకస్మాత్తుగా ఈ పేలుళ్లు సంభవించడంతో.. స్థానికులు, పక్కనే ఉన్న పాఠశాల విద్యార్ధులు భయాందోళనలకు గురయ్యారు. పేలుళ్ల కోసం భారీ జిలెటిన్‌స్టిక్స్‌ను ఉపయోగించడంతో భారీ శబ్ధం వచ్చింది. సమీపంలోని పలువురికి స్వల్ప గాయాలు కూడా అయ్యాయి. ఘటనపై స్కూల్ యాజమాన్యంతో పాటు.. స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు. అక్కడి నుంచి జిలెటిన్ స్టిక్స్, పేలుళ్ల సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు. నిర్మాణం చేపడుతున్న యజమానితో పాటు కార్మికులను కూడా అదుపులోకి తీసుకున్నారు.