కాళ్లతో తొక్కి.. గోళ్లతో గిచ్చిన… సైకో పోలీస్

చార్మినార్‌లోని యూనానీ ఆస్పత్రి తరలింపును వ్యతిరేకిస్తూ.. విద్యార్ధులు చేపట్టిన నిరసనలో ఓ కానిస్టేబుల్ తీరు వివాదాస్పదంగా మారింది. ఆయుర్వేద భవన్‌ను ఎర్రగడ్డకు తరలించడాన్ని నిరసిస్తూ.. యునానీ విద్యార్ధులు ఆందోళనకు దిగారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు.. విద్యార్ధులను అరెస్ట్ చేసి బలవంతంగా పోలీసుల వాహనాల్లోకి ఎక్కించారు. అయితే ఈ సమయంలో మఫ్టీలో ఉన్న ఓ కానిస్టేబుల్.. ఓ యువతి పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. మహిళా పోలీసులు విద్యార్ధులను లాగుతుండగా.. మఫ్టీలో ఉన్న ఓ కానిస్టేబుల్ ఓ యువతిని […]

  • Publish Date - 5:34 pm, Wed, 31 July 19 Edited By:
కాళ్లతో తొక్కి.. గోళ్లతో గిచ్చిన… సైకో పోలీస్


చార్మినార్‌లోని యూనానీ ఆస్పత్రి తరలింపును వ్యతిరేకిస్తూ.. విద్యార్ధులు చేపట్టిన నిరసనలో ఓ కానిస్టేబుల్ తీరు వివాదాస్పదంగా మారింది. ఆయుర్వేద భవన్‌ను ఎర్రగడ్డకు తరలించడాన్ని నిరసిస్తూ.. యునానీ విద్యార్ధులు ఆందోళనకు దిగారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు.. విద్యార్ధులను అరెస్ట్ చేసి బలవంతంగా పోలీసుల వాహనాల్లోకి ఎక్కించారు. అయితే ఈ సమయంలో మఫ్టీలో ఉన్న ఓ కానిస్టేబుల్.. ఓ యువతి పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. మహిళా పోలీసులు విద్యార్ధులను లాగుతుండగా.. మఫ్టీలో ఉన్న ఓ కానిస్టేబుల్ ఓ యువతిని కాలితో తన్నుతూ.. వీపుపై గిల్లాడు. దీంతో ఆ విద్యార్ధిని నొప్పితో కేకలు పెట్టింది. ఈ ఘటన మొత్తం కెమెరాల్లో రికార్డయ్యింది. కానిస్టేబుల్‌ వ్యవహరించిన తీరుపై మహిళా సంఘాలు, విద్యార్ధి సంఘాలు మండిపడుతున్నాయి. మరోవైపు, పోలీసు ఉన్నతాధికారులు ఈ ఘటనపై ఆరా తీస్తున్నారు. బాధ్యులెవరైనా కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.