తెలంగాణ వ్యాప్తంగా వైద్యసేవలు బంద్..

తెలంగాణ వ్యాప్తంగా ప్రైవేట్ ఆస్పత్రులన్నీ మూతపడ్డాయి. కేంద్ర ప్రభుత్వం లోక్ సభలో ప్రవేశపెట్టిన నేషనల్ మెడికల్ కమిషన్ బిల్లును వ్యతిరేకిస్తూ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ పిలుపు మేరకు డాక్టర్లంతా ఒకరోజు బంద్ పాటిస్తున్నారు. అత్యవసర సేవలకు మాత్రమే హాజరవుతామని జూడాలు ప్రకటించారు. అయితే ముందే ఎంపిక చేసుకున్న శస్త్రచికిత్సలకు హాజరుకాబోమని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నేషనల్ మెడికల్ కమిషన్ బిల్లు పేదలకు వైద్యాన్ని దూరం చేస్తుందని డాక్టర్‌ ఆలూరి భాస్కరరావు అన్నారు. తాము ప్రైవేటు వైద్యులమే […]

తెలంగాణ వ్యాప్తంగా వైద్యసేవలు బంద్..
Follow us

| Edited By:

Updated on: Jul 31, 2019 | 7:13 AM

తెలంగాణ వ్యాప్తంగా ప్రైవేట్ ఆస్పత్రులన్నీ మూతపడ్డాయి. కేంద్ర ప్రభుత్వం లోక్ సభలో ప్రవేశపెట్టిన నేషనల్ మెడికల్ కమిషన్ బిల్లును వ్యతిరేకిస్తూ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ పిలుపు మేరకు డాక్టర్లంతా ఒకరోజు బంద్ పాటిస్తున్నారు. అత్యవసర సేవలకు మాత్రమే హాజరవుతామని జూడాలు ప్రకటించారు. అయితే ముందే ఎంపిక చేసుకున్న శస్త్రచికిత్సలకు హాజరుకాబోమని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నేషనల్ మెడికల్ కమిషన్ బిల్లు పేదలకు వైద్యాన్ని దూరం చేస్తుందని డాక్టర్‌ ఆలూరి భాస్కరరావు అన్నారు. తాము ప్రైవేటు వైద్యులమే అయినప్పటికీ ప్రభుత్వ వైద్యాన్ని పూర్తిగా ప్రైవేటీకరించడాన్ని వ్యతిరేకిస్తున్నామని చెప్పారు. మెడికల్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా స్థానంలో నేషనల్‌ మెడికల్‌ కమిషన్‌ను ఏర్పాటు చేయటం వెనుక అలోపతి వైద్యాన్ని దెబ్బతీసి యునాని, ఆయుర్వేదాన్ని ప్రోత్సహించే కుట్ర దాగుందని ఆయన విమర్శించారు. ఎంబీబీఎస్‌ పూర్తి చేసిన విద్యార్థులు రిజిస్టర్‌ చేసుకోవాలన్నా, వారు పీజీ చదువులకు వెళ్లాలన్నా నేషనల్‌ ఎగ్జిట్‌ టెస్ట్‌ పరీక్ష రాయాలన్న నిబంధన కూడా విద్యార్థులకు చెంప పెట్టులాంటిదన్నారు. కార్పొరేట్ సంస్థను పెంచి పోషించే ఈ బిల్లును రద్దు చేసే వరకు ఆందోళన కార్యక్రమాలు కొనసాగుతాయని ఆయన స్పష్టం చేశారు.