విషాదంగా ముగిసిన సిద్ధార్ధ మిస్సింగ్ కేసు.. మృతదేహం లభ్యం

ప్రముఖ పారిశ్రామిక వేత్త, కెఫే కాఫీ డే అధినేత సిద్ధార్ధ మిస్సింగ్ కేసు విషాదంగా ముగిసింది. నేత్రావతి నదిలో ఆయన మృతదేహాన్ని గుర్తించారు పోలీసులు. కాగా సోమవారం సాయంత్రం నేత్రావతి నది బ్రిడ్జి మీదకు డ్రైవర్‌తో వెళ్లిన సిద్ధార్థ.. ఆ తరువాత కాసేపటికి కనిపించకుండా పోయారు. దీంతో ఆయన ఆత్మహత్య చేసుకొని ఉండొచ్చునని పోలీసులు భావించారు. దానికి తోడు ఓ వ్యక్తి నేత్రానది నుంచి కిందికి దూకి ఆత్మహత్య చేసుకున్నట్లు ప్రత్యక్ష సాక్ష్యులు వెల్లడించారు. ఈ నేపథ్యంలో […]

విషాదంగా ముగిసిన సిద్ధార్ధ మిస్సింగ్ కేసు.. మృతదేహం లభ్యం
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Jul 31, 2019 | 9:32 AM

ప్రముఖ పారిశ్రామిక వేత్త, కెఫే కాఫీ డే అధినేత సిద్ధార్ధ మిస్సింగ్ కేసు విషాదంగా ముగిసింది. నేత్రావతి నదిలో ఆయన మృతదేహాన్ని గుర్తించారు పోలీసులు. కాగా సోమవారం సాయంత్రం నేత్రావతి నది బ్రిడ్జి మీదకు డ్రైవర్‌తో వెళ్లిన సిద్ధార్థ.. ఆ తరువాత కాసేపటికి కనిపించకుండా పోయారు. దీంతో ఆయన ఆత్మహత్య చేసుకొని ఉండొచ్చునని పోలీసులు భావించారు. దానికి తోడు ఓ వ్యక్తి నేత్రానది నుంచి కిందికి దూకి ఆత్మహత్య చేసుకున్నట్లు ప్రత్యక్ష సాక్ష్యులు వెల్లడించారు. ఈ నేపథ్యంలో 25మంది గజఈతగాళ్లతో మంగళవారం నుంచి గాలింపు చర్యలను కొనసాగించారు. ఈ క్రమంలో తాజాగా ఆయన మృతదేహం బయటపడింది. అయితే ఆత్మహత్యకు ముందు ఐటీ అధికారులు, పీఈ ఇన్వెస్టర్‌ వేధించారంటూ సిద్ధార్థ లేఖ రాసిన విషయం తెలిసిందే.