Hyderabad: ఆశ్చర్యం, అద్భతం.. శ్రీకృష్ణుడి చుట్టూ రోజూ ప్రదిక్షణలు చేస్తోన్న చూపులేని ఆవుదూడ
చూపులేని లేగదూడ రోజూ శ్రీకృష్ణుడి విగ్రహం చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. హైదరాబాద్ శివారులోని బాటసింగారం వద్ద యుగతులసి ఫౌండేషన్ గోమహాక్షేత్రంలో ఈ దృశ్యం రోజూ సాక్షాత్కారమవుతుంది. అలా చేయాలని దానికి ఎవరూ శిక్షణ ఇవ్వలేదని నిర్వహకులు చెబుతున్నారు. ..

ఆశ్చర్యం.. అద్భుతం.. హైదరాబాద్ నగర శివారులోని బాటసింగారం వద్ద జాఫర్‌గూడలో ఒక ఆశ్చర్యకరమైన సంఘటన అందరినీ ఆకట్టుకుంటోంది. చూపులేని ఒక లేగదూడ ప్రతి రోజు శ్రీకృష్ణుడి విగ్రహం చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ఈ విశేషం ‘యుగతులసి ఫౌండేషన్’ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గోమహాక్షేత్రంలో జరుగుతోంది. సుమారు రెండేళ్ల వయసు ఉన్న ఈ లేగదూడకు ‘సంధ్య’ అని పేరు పెట్టారు. ఫౌండేషన్ సభ్యులే ఈ దృశ్యాన్ని రోజూ అది చేస్తోన్న పని చూసి ఆశ్చర్యపోతున్నారు.
రెండేళ్ల క్రితం కబేళాకు తరలిస్తున్న ఓ గోమాతను మేము రక్షించామని ఫౌండేషన్ ఛైర్మన్, టీటీడీ మాజీ పాలకమండలి సభ్యుడు కొలిశెట్టి శివకుమార్ తెలిపారు. కొన్ని రోజులకే ఆ గోమాత ఈ లేగదూడకు జన్మనిచ్చిందని వివరించారు. దానికి సంధ్య అని పేరు పెట్టారట. చూపులేని ఈ లేగదూడ గోమహాక్షేత్రంలోని శ్రీకృష్ణుడి విగ్రహం చుట్టూ ప్రతి ఉదయం, సాయంత్రం సమయాల్లో దాదాపు 15 నిమిషాల పాటు ప్రదక్షిణలు చేస్తోంది. దానికి అలా చేయడాన్ని ఎవరూ శిక్షణ ఇవ్వలేదని ఆయన వివరించారు.
ఈ దృశ్యాన్ని శివకుమార్ స్వయంగా వీడియోగా చిత్రీకరించి సామాజిక మాధ్యమాల్లో షేర్ చేయగా, అది క్షణాల్లో వైరల్ అయింది. చాలా మంది ఈ దృశ్యాన్ని చూసి.. ఇది భక్తి, దైవానుగ్రహం కలిసిన అరుదైన సంఘటన అని కామెంట్లు చేస్తున్నారు.
‘నందగోకులం’ పేరుతో గోమహాక్షేత్రంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కుటీరంలో ఈ లేగదూడ సంధ్యను సంరక్షిస్తున్నారు. ప్రతిరోజూ భక్తి భావంతో శ్రీకృష్ణుడి విగ్రహం చుట్టూ తిరుగుతున్న ఈ దూడను చూసి.. ఆ ప్రదేశానికి వచ్చే ప్రతి ఒక్కరూ మంత్ర ముగ్ధులవుతున్నారు.
వీడియో దిగువన చూడండి…
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




