AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rain Alert: దూసుకొస్తున్న వాయుగుండం.. ఈ ప్రాంతాల్లో నాన్‌స్టాప్ భారీ వర్షాలు.. లేటెస్ట్ వెదర్ రిపోర్ట్ ఇదిగో..

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారింది.. గడిచిన 6 గంటల్లో, గంటకు 10కిమీ వేగంతో కదిలిన వాయుగుండం.. ప్రస్తుతానికి పూరికి 60 కి.మీ. గోపాల్‌పూర్(ఒడిశా)కి 70కి.మీ.,కళింగపట్నం(ఏపీ)కి 180 కి.మీ దూరంలో కేంద్రీకృతం అయింది.. మరికాసేపట్లో వాయుగుండం.. గోపాల్‌పూర్‌కు దగ్గరగా దక్షిణ ఒడిశా -ఉత్తరాంధ్ర తీరాలలో దాటనుంది.

Rain Alert: దూసుకొస్తున్న వాయుగుండం.. ఈ ప్రాంతాల్లో నాన్‌స్టాప్ భారీ వర్షాలు.. లేటెస్ట్ వెదర్ రిపోర్ట్ ఇదిగో..
Rain Alert
Shaik Madar Saheb
|

Updated on: Sep 27, 2025 | 7:15 AM

Share

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారింది.. ప్రస్తుతం వాయుగుండం.. వాయువ్య, పశ్చిమమధ్య బంగాళాఖాతంలో దక్షిణ ఒడిశా-ఉత్తరాంధ్ర తీరాల్లో కొనసాగుతోంది.. గడిచిన 6 గంటల్లో, గంటకు 10కిమీ వేగంతో కదిలిన వాయుగుండం.. ప్రస్తుతానికి పూరికి 60 కి.మీ. గోపాల్‌పూర్(ఒడిశా)కి 70కి.మీ.,కళింగపట్నం(ఏపీ)కి 180 కి.మీ దూరంలో కేంద్రీకృతం అయింది.. మరికాసేపట్లో వాయుగుండం.. గోపాల్‌పూర్‌కు దగ్గరగా దక్షిణ ఒడిశా -ఉత్తరాంధ్ర తీరాలలో దాటనుంది. దీనికి తోడు తెలంగాణ ఉత్తర అంతర్గత కర్ణాటక మీదుగా దక్షిణ మహారాష్ట్ర వరకు సగటు సముద్ర మట్టం నుండి 7.6 కి మీ మధ్యలో ద్రోణి కొనసాగుతోంది.. వాయుగుండం, ద్రోణి ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో భారీ.. నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు అలర్ట్ జారీ చేసింది.

తెలంగాణ వెదర్ రిపోర్ట్..

వాయుగుండం, ద్రోణి ప్రభావంతో శనివారం, ఆదివారం తెలంగాణలోని అన్ని జిల్లాలలో ఉరుములు, మెరుపులతో మోస్తారు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ రోజు తెలంగాణలోని హనుమకొండ, జనగాం, జోగుళాంబ గద్వాల, కామారెడ్డి, మహబూబాబాద్, మహబూబ్ నగర్, మెదక్, నాగర్ కర్నూల్, నారాయణపేట, నిజామాబాద్, నిర్మల్, సంగారెడ్డి, సిద్దిపేట, వికారాబాద్, వనపర్తి, వరంగల్, యాదాద్రి భువనగిరి జిల్లాలలో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.. ఈ మేరకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.

ఆదిలాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, హైదరాబాద్, జగిత్యాల, జయశంకర్ భూపాలపల్లి, కరీంనగర్, ఖమ్మం, కొమరం భీమ్, మంచిర్యాల, మేడ్చల్ మల్కాజ్‌గిరి, ములుగు, నల్లగొండ, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల, సంగారెడ్డి, సూర్యాపేట జిల్లాలలో అక్కడక్కడ మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది.. ఈరోజు, రేపు తెలంగాణలోని అన్ని జిల్లాలలో ఉరుములు, మెరుపులతో గంటకు 40 నుండి 60 కిలోమీటర్ల మేర ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది.

ఏపీలో భారీ వర్షాలు..

కాగా.. వాయుగుండం ప్రభావతో ఆంధప్రదేశ్ లో కూడా భారీ వర్సాలు కురుస్తాయని ఏపీ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ప్రకటించింది. ఇవాళ కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ప్రకాశం, కర్నూలు, నంద్యాల జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. మిగతా జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది. తీరం వెంబడి 40-60 కిమీ వేగంతో ఈదురుగాలులు వీస్తాయని.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని..విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ సూచించారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
తులం బంగారం ధర కేవలం రూ.90 మాత్రమే.. పాలు, చక్కెర ధరలు వింటే షాక్
తులం బంగారం ధర కేవలం రూ.90 మాత్రమే.. పాలు, చక్కెర ధరలు వింటే షాక్
సహజంగా ఇమ్యూనిటీ బూస్ట్ చేసుకోండి.. అద్భుతమైన భారతీయ హోం రెమెడీస్
సహజంగా ఇమ్యూనిటీ బూస్ట్ చేసుకోండి.. అద్భుతమైన భారతీయ హోం రెమెడీస్
విజయ్‌కి తల్లిగా, భార్యగా నటించిన ఏకైక టాలీవుడ్ హీరోయిన్ ఎవరంటే?
విజయ్‌కి తల్లిగా, భార్యగా నటించిన ఏకైక టాలీవుడ్ హీరోయిన్ ఎవరంటే?
మామిడి ఆకుల తోరణం ఎండిపోయిందా? ఇలా చేస్తేనే శుభ ఫలితాలు పొందుతారు
మామిడి ఆకుల తోరణం ఎండిపోయిందా? ఇలా చేస్తేనే శుభ ఫలితాలు పొందుతారు
వీరు మాములోళ్లు కాదు.. A అక్షరంతో పేరు ఉన్నవారి వ్యక్తిత్వం ఇదే
వీరు మాములోళ్లు కాదు.. A అక్షరంతో పేరు ఉన్నవారి వ్యక్తిత్వం ఇదే
Garuda Purana: మరణం తర్వాత స్వర్గానికి వెళ్లాలంటే ఏం చేయాలి?
Garuda Purana: మరణం తర్వాత స్వర్గానికి వెళ్లాలంటే ఏం చేయాలి?
నెలకు రూ.10,000 పెట్టుబడి.. 10 ఏళ్లలో రూ. 34 లక్షల లాభం..
నెలకు రూ.10,000 పెట్టుబడి.. 10 ఏళ్లలో రూ. 34 లక్షల లాభం..
ఇది చెంచాడు ఇస్తే చాలు.. మల్లెమొక్క గుత్తులు గుత్తులుగా..
ఇది చెంచాడు ఇస్తే చాలు.. మల్లెమొక్క గుత్తులు గుత్తులుగా..
NDAకు మద్దతు ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు- ప్రధాని మోదీ
NDAకు మద్దతు ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు- ప్రధాని మోదీ
ఉప్పు కొనుగోలుపై వాస్తు ఏమంటుంది? నిజం vs నమ్మకం
ఉప్పు కొనుగోలుపై వాస్తు ఏమంటుంది? నిజం vs నమ్మకం