Hyderabad: బార్స్‌లో కూడా డ్రగ్స్ తనిఖీలు.. తెలంగాణ పోలీసులు తగ్గడం లేదుగా

హైదరాబాద్‌లో మరోసారి డ్రగ్స్ కలకలం రేపింది. డ్రగ్స్ టెస్ట్‌లో నలుగురికి పాజిటివ్ వచ్చింది. 33 మందికి డ్రగ్స్‌ టెస్ట్‌ చేశారు. అందులో ఎంత మందికి పాజిటివ్ వచ్చింది... వారిని ఎక్కడికి తరలించారు.. ఆ డీటేల్స్ తెలుసుకుందాం పదండి..

Hyderabad: బార్స్‌లో కూడా డ్రగ్స్ తనిఖీలు.. తెలంగాణ పోలీసులు తగ్గడం లేదుగా
Drug Test
Follow us
Ram Naramaneni

|

Updated on: Sep 07, 2024 | 6:40 PM

పండుగపూట కూడా పబ్‌ల్లో డ్రగ్స్‌ గబ్బు కొడుతోంది. హైదరాబాద్‌లోని ఐదు పబ్‌లో మత్తుబాబులు పట్టుబడ్డారు. టీజీ న్యాబ్‌, ఎక్సైజ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ టీమ్స్‌ ఆధ్వర్యంలో ఐదు పబ్‌ల్లో తనిఖీలు చేపట్టి.. 33 మందికి డ్రగ్స్‌ టెస్ట్‌ చేశారు. నలుగురికి పాజిటివ్‌ రావడంతో వారిని అదుపులోకి తీసుకున్నారు. నగరంలో డ్రగ్స్ వాడకంపై ఉక్కుపాదం మోపుతున్నా.. మత్తు బ్యాచ్‌ల తోలు మందం యవ్వారం తగ్గడంలేదు. మత్తు మరకలు పడుతున్నా సరే పబ్‌ యాజమాన్యాల వైఖరి మారడంలేదు. తాజాగా ఎక్సైజ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టర్‌ కమలాసన్‌ రెడ్డి ఆదేశాలతో ఐదు పబ్‌ల్లో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఇక శేరిలింగంపల్లి నాలెడ్జ్‌ సిటీలోని కోరం కబ్‌లో ఏడుగురిలో ఇద్దరికి పాజిటివ్‌ వచ్చింది. జూబ్లిహిల్స్‌లోని బేబీలోన్‌ బార్‌లో 12 మందిలో ఇద్దరు డ్రగ్స్‌ వాడినట్టు టెస్టుల్లో దొరికిపోయారు. డ్రగ్స్ టెస్ట్‌లో పాజిటివ్‌ వచ్చినవాళ్లలో వరంగల్‌కు చెందిన చిన్న నిగేష్‌, శ్రీకాకుళంకు చెందిన నార్త్‌ రవికుమార్‌, మూసాపేట వాసి కేశవరావు, చార్మినార్‌కు చెందిన అబ్దుల్‌ రహీమ్‌లు వున్నారు.

ఎక్సైజ్‌ జాయింట్‌ కమిషనర్‌ ఖురేషీ, హైదరాబాద్‌ రంగారెడ్డి ఏసీపీలు కిషన్‌,అనిల్‌కుమార్‌రెడ్డి సహా టీజీ న్యాబ్‌, ఎక్సైజ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు సిబ్బంది తనిఖీల్లో పాల్గొన్నారు. డ్రగ్స్‌తో పట్టుబడితే వినియోగదారులపై కూడా కేసులు పెడతామని హెచ్చరిస్తున్నారు అధికారులు. డ్రింక్స్‌లో డ్రగ్స్‌ కలిపి అలవాటు చేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చినట్లు చెప్పారు అధికారులు. డ్రగ్స్‌ అలవాటు చేసేవారిపై కూడా కేసులు పెడతామన్నారు. పిల్లల విషయంలో తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని పోలీస్ అధికారులు సూచిస్తున్నారు. డ్రగ్స్ సప్లై చేస్తూ పట్టుబడిన పాత నేరస్థులపై నిఘా పెంచింది ఎక్సైజ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌. పీడీ యాక్ట్ కింద కేసులు నమోదు చేసి జైలుకు పంపుతోంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.  

ఆరు బంతుల్లో ఆరు ఫోర్లు: ఐపీఎల్ జట్లకు నారాయణ్ జగదీశన్ పంచ్!
ఆరు బంతుల్లో ఆరు ఫోర్లు: ఐపీఎల్ జట్లకు నారాయణ్ జగదీశన్ పంచ్!
టాటా గ్రూప్‌లో పెను మార్పులు.. నోయల్ టాటా కూతుళ్లకు కీలక బాధ్యతలు
టాటా గ్రూప్‌లో పెను మార్పులు.. నోయల్ టాటా కూతుళ్లకు కీలక బాధ్యతలు
సినిమా సెట్ లోనే పరీక్షలకు ప్రిపేరవుతోన్న రవీనా కూతురు.. వీడియో
సినిమా సెట్ లోనే పరీక్షలకు ప్రిపేరవుతోన్న రవీనా కూతురు.. వీడియో
నవాబుల నగరంలోని నల్ల క్యారెట్ హల్వా.. స్పెషాలిటీ ఏమిటంటే..
నవాబుల నగరంలోని నల్ల క్యారెట్ హల్వా.. స్పెషాలిటీ ఏమిటంటే..
జియో రూ.175కే ఎంటర్‌టైన్‌మెంట్‌ ప్లాన్‌.. ఉచితంగా 12 ఓటీటీ యాప్స్
జియో రూ.175కే ఎంటర్‌టైన్‌మెంట్‌ ప్లాన్‌.. ఉచితంగా 12 ఓటీటీ యాప్స్
పన్నెండేళ్ల బాలిక బౌలింగ్‌కి ఇంటర్నెట్ ఫిదా!
పన్నెండేళ్ల బాలిక బౌలింగ్‌కి ఇంటర్నెట్ ఫిదా!
టికెట్ ఏదైనా యాప్ ఒక్కటే..!
టికెట్ ఏదైనా యాప్ ఒక్కటే..!
కొత్త బడ్జెట్ లో ఆదాయపు పన్ను మినహాయింపును పెంచుతారా..?
కొత్త బడ్జెట్ లో ఆదాయపు పన్ను మినహాయింపును పెంచుతారా..?
అమ్మా నీకు హ్యాట్సాఫ్..ఆ తల్లి ఐడియాకు ఆశ్చర్యపోతున్న నెటిజన్లు..
అమ్మా నీకు హ్యాట్సాఫ్..ఆ తల్లి ఐడియాకు ఆశ్చర్యపోతున్న నెటిజన్లు..
విదురుడు చెప్పిన ఈ ఐదు విషయాలు పాటించండి.. జీవితం సుఖ సంతోషాలతో..
విదురుడు చెప్పిన ఈ ఐదు విషయాలు పాటించండి.. జీవితం సుఖ సంతోషాలతో..