AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: డబ్బులు డ్రా చేస్తుండగా ఏటీఎంలోకి దూరారు.. ఆ మహిళ ఎవరు మీరని అడగ్గా

మీరు ఏటీఎం సెంటర్‌లో డబ్బు డ్రా చేయడానికి వెళ్తున్నారా? డబ్బు తీస్తున్నప్పుడు మీతో ఎవరైనా మాటలు కలిపితే జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే సిటీలో అటెన్షన్‌ డైవర్షన్‌ గ్యాంగ్ ఆగడాలు పెరిగిపోయాయి. ఏమాత్రం ఏమరపాటుగా ఉన్నా మీ డబ్బు, కార్డు రెండూ మాయమవుతాయి?

Hyderabad: డబ్బులు డ్రా చేస్తుండగా ఏటీఎంలోకి దూరారు.. ఆ మహిళ ఎవరు మీరని అడగ్గా
Representative Image
Noor Mohammed Shaik
| Edited By: |

Updated on: Jan 21, 2025 | 9:30 AM

Share

అకౌంట్‌లో ఉన్న డబ్బును ఓ పక్క సైబర్ ముఠాలు దోచేస్తుంటే.. మరోపక్క అటెన్షన్ డైవర్షన్‌ గ్యాంగ్ ఏటీఎం కార్డులను కొట్టేస్తోంది. ఏటీఎం సెంటర్‌ల దగ్గర డబ్బులు డ్రా చేసేవారిని అటెన్షన్ డైవర్షన్ ముఠా టార్గెట్ చేస్తోంది. డబ్బు డ్రా చేస్తున్నవారిని ఇద్దరు వ్యక్తులు మాటల్లో పెడతారు. వారి దగ్గరి నుంచి ఏటీఎంను దొంగిలించి ఖాతాలో ఉన్న డబ్బును మొత్తం డ్రా చేస్తారు. డిసెంబర్ 23న ఎన్ఎం గూడాకు చెందిన అతీఖా ఖాన్ ఏటీఎంను ఇద్దరు వ్యక్తులు చోరీ చేశారు. ఆమె ఖాతా నుంచి 2లక్షలు దోచేశారు.

బాధితురాల ఫిర్యాదుతో అంతరాష్ట్ర డైవర్షన్ ముఠా ఆగడాలపై బహదూర్ పురా సౌత్ ఈస్ట్ టాస్క్ ఫోర్స్ పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. సీసీ టీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితులను గుర్తించారు. ఏటీఎం సెంటర్లలో చోరీలకు పాల్పడుతున్న వకీల్ అలీ, ఫర్మాన్, ఒబేద్ ఆరీఫ్‌ను అరెస్ట్ చేశారు. ఉత్తరప్రదేశ్‌, హర్యానాకు చెందిన వ్యక్తులు పాతబస్తీ బ్యాచ్‌తో కలిసి చోరీలకు పాల్పడుతున్న పోలీసులు గుర్తించారు. వీరి దగ్గరి నుంచి 106 ఏటీఎం కార్డులు, 8లక్షల నగదు, కారు, బైక్‌ను సీజ్‌ చేశారు పోలీసులు. ఈ ముఠా తెలంగాణతో పాటు ఏపీ, కర్ణాటకలో మోసాలకు పాల్పడ్డు గుర్తించారు పోలీసులు.

మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి