Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

TG Junior Linemen Jobs: జూనియర్‌ లైన్‌మెన్‌ ఖాళీ పోస్టులను ఆ అభ్యర్థులతోనే భర్తీ చేయండి.. TGSPDCLకి హైకోర్టు ఆదేశం

తెలంగాణలో 2,500 లైన్‌మెన్‌ పోస్టుల భర్తీకి టీజీఎస్పీడీసీఎల్‌ 2019లో నోటిఫికేషన్‌ జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ పోస్టుల భర్తీలో మెరిట్‌ అభ్యర్థులకు 5 శాతం, స్థానికులకు 95 శాతం కేటాయించడంపై కొందరు అభ్యర్ధులు హైకోర్టును ఆశ్రయించారు. వాదనలు విన్న కోర్టు కోర్టును ఆశ్రయించిన అభ్యర్థులకు వెంటనే పోస్టులను కేటాయించాలని టీజీఎస్పీడీసీఎల్‌ని ఆదేశించింది..

TG Junior Linemen Jobs: జూనియర్‌ లైన్‌మెన్‌ ఖాళీ పోస్టులను ఆ అభ్యర్థులతోనే భర్తీ చేయండి.. TGSPDCLకి హైకోర్టు ఆదేశం
Junior Linemen Jobs
Follow us
Srilakshmi C

|

Updated on: Jan 21, 2025 | 9:19 AM

హైదరాబాద్‌, జనవరి 21: తెలంగాణ రాష్ట్రంలో ఖాళీగా ఉంచిన జూనియర్‌ లైన్‌మెన్‌ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని తెలంగాణ విద్యుత్తు పంపిణీ సంస్థ (టీఎస్‌ఎస్పీడీసీఎల్‌) హైకోర్టు ఆదేశించింది. ఈ పోస్టులకు సంబంధించి హైకోర్టును ఆశ్రయించిన అభ్యర్థులకు వెంటనే పోస్టులను కేటాయించాలని టీజీఎస్పీడీసీఎల్‌కి ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో త్వరలో వీరందరికీ జూనియర్ లైన్‌మెన్‌ పోస్టులను విద్యుత్తు పంపిణీ సంస్థ కేటాయించనుంది.

కాగా 2,500 లైన్‌మెన్‌ పోస్టుల భర్తీ కోసం టీజీఎస్పీడీసీఎల్‌ 2019లో నోటిఫికేషన్‌ జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ పోస్టులకు గతేడాది ఏప్రిల్‌ 30వ తేదీన రాత పరీక్ష నిర్వహించారు. ఆ తర్వాత విడుదలైన ఫలితాల్లో మొత్తం పోస్టుల్లో మెరిట్‌ అభ్యర్థులకు 5 శాతం, స్థానికులకు 95 శాతం కేటాయించారు. వీటిపై గతంలో విచారణ జరిపిన సింగిల్‌ బెంచ్‌ జడ్జి.. లైన్‌మెన్‌ పోస్టులకు రాష్ట్రపతి ఉత్తర్వులను వర్తింపజేయడం చెల్లదని తీర్పు చెప్పారు. కోర్టు ఉత్తర్వుల మేరకు కొన్ని పోస్టులు భర్తీ చేయకుండా ఖాళీగా ఉంచారు. అయితే 5% మెరిట్, 95% స్థానికులకు కేటాయించడాన్ని సవాల్‌ చేస్తూ హైకోర్టులో 25 పిటిషన్లు దాఖలయ్యాయి.

అయితే ఆ నోటిఫికేషన్‌లోని పార్ట్‌ 2లో పేర్కొన్న కొన్ని నిబంధనలను కొట్టివేశారు. దీన్ని సవాలు చేస్తూ కొందరు అభ్యర్ధులులు టీజీఎస్పీడీసీఎల్‌పై 25 పిటిషన్లు దాఖలు చేసింది. వాటిపై తాజాగా జస్టిస్‌ అభినంద్‌ కుమార్‌ షావిలి, జస్టిస్‌ అలిశెట్టి లక్ష్మీనారాయణతో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది. ఈ సందర్‌భంగా టీఎస్‌ఎస్‌పీడీసీఎల్‌ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. లైన్‌మెన్‌లకు స్థానిక పరిస్థితులపై అవగాహన ఉండాలని జిల్లాకు చెందిన వారికి ప్రాధాన్యం ఇచ్చామన్నారు. రాష్ట్రపతి ఉత్తర్వులు మాకు వర్తించవని, అందుకే వాటిని అమలు చేయలేదన్నారు. దీనిని దరఖాస్తుదారులు తప్పుగా అర్థం చేసుకున్నట్లు పేర్కొన్నారు. ఒకే మెరిట్‌ ఉన్నవారు ఇద్దరు ఉన్నప్పుడు వారిలో స్థానిక జిల్లావాసికి ప్రాధాన్యం ఉంటుందన్నదాన్ని న్యాయమూర్తి తప్పుగా అర్థం చేసుకున్నారని పేర్కొన్నారు. ఇక దరఖాస్తుదారుల తరఫు న్యాయవాదులు వాదనలు వినిపిస్తూ రిజర్వేషన్ల ద్వారా పక్క జిల్లా వారికి కూడా అవకాశం లేకుండా పోయిందని, సింగిల్‌ జడ్జి తీర్పు సరైనదేనన్నారు. కోర్టు పిటిషన్లు దాఖలు చేసిన సమయంలో కోర్టుకు వచ్చినవారందరికీ సరిపడా ఖాళీలు ఉంచాలని సింగిల్‌ జడ్జి మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారన్నారు. అలా భర్తీ చేయకుండా ఉంచిన ఖాళీలను.. న్యాయస్థానాన్ని ఆశ్రయించిన అభ్యర్థులతో భర్తీ చేయాలని కోర్టును కోరారు. ఇందుకు అమోదం తెలిపిన కోర్టు పిటిషన్లు వేసిన అభ్యర్థులకు వెంటనే పోస్టులను కేటాయించాలని టీజీఎస్పీడీసీఎల్‌ను ఆదేశించింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్‌ చేయండి.