Hyderabad Citizens : నగరవాసులు బోర్ నీరు తాగుతున్నారా..! అయితే చాలా డేంజర్.. ఈ విషయం తెలుసుకోండి లేదంటే

Hyderabad Citizens : హైదరాబాద్ నగర వాసులకు ముఖ్య గమనిక. బోర్ వాటర్ తాగితే మాత్రం వెంటనే మానెయ్యండి. లేదంటే అనారోగ్యాలకు గురయ్యే ప్రమాదం ఉంది.

Hyderabad Citizens : నగరవాసులు బోర్ నీరు తాగుతున్నారా..! అయితే చాలా డేంజర్.. ఈ విషయం తెలుసుకోండి లేదంటే
Drinking Bore Water
Follow us
uppula Raju

|

Updated on: Jul 03, 2021 | 8:19 PM

Hyderabad Citizens : హైదరాబాద్ నగర వాసులకు ముఖ్య గమనిక. బోర్ వాటర్ తాగితే మాత్రం వెంటనే మానెయ్యండి. లేదంటే అనారోగ్యాలకు గురయ్యే ప్రమాదం ఉంది. ఈ నీటిలో మోతాదుకు మించి ఫ్లోరైడ్ శాతం తో పాటు నైట్రేట్ ఇతర హానికర లోహాలు ఉన్నాయని NGRI పరిశోధనల్లో వెల్లడైంది. w.h.o ప్రమాణాలకు మించి ఉన్నట్లు తేలింది. నగరంలో నీటి నాణ్యత, అలాగే బోరు నీరు ఎంత వరకు ఆరోగ్యానికి ప్రమాదమో తెలుసుకునేందుకు ఎన్.జి.ఆర్.ఐ పరిశోధన చేపట్టింది. ఈ పరిశోధన కోసం శామిర్పెట్ ను ఎంపిక చేసుకుంది. శామిర్పెట్ లో ప్రజలు గ్రౌండ్ వాటర్ ని ఇంటి అవసరాలతో పాటు వ్యవసాయానికి ఉపయోగిస్తున్నారు. గ్రౌండ్ వాటర్ కోసం 350 నుంచి 1000 అడుగుల లోతు వరకు బోర్లు వేస్తున్నారని ఎన్.జి.ఆర్.ఐ సైంటిస్ట్ డా. కె. రాం మోహన్ చెప్పారు.

అలాగే…మొల్లగూడెం, గౌడవెల్లి, రావల్కోర్ ప్రాంతాల్లో గృహ, వ్యవసాయ అవసరాల కోసం చాలా ఇబ్బంది పడుతున్నారని గుర్తించారు. ఈ ప్రాంతాలతో పాటు…తూoకుంట, కండ్లకోయ, మేడ్చల్, ఉప్పరిపల్లి, దుండిగల్, పోచంపల్లి, శ్రీరంగవరం, లింగపూర్ తదితర ప్రాంతాల్లో 15 నీటి నమూనాలు సేకరించి నాణ్యతను పరిశీలించారు. వీటిలో నీటి నాణ్యత తక్కువగా ఉందని 53% నీటి నమూనాలు తాగటానికి పనికి రావని పరిశోధనల్లో తేలింది. 47% నమూనాల్లో w.h.o నిర్దేశించిన ప్రమాణాల కంటే నైట్రేట్, ఫ్లోరైడ్ ఎక్కువ ఉన్నట్లు గుర్తించారు.

నీటి కొరతతో అధికంగా గ్రౌండ్ వాటర్ తీస్తున్న ప్రాంతాల్లో నీటి నాణ్యత 60% శాతంగా ఉన్నట్లు గుర్తించారు. ఈ నీటిలో నైట్రేట్ శాతం 47% ఉన్నట్లు పరీక్షల్లో రుజువు అయ్యిందన్నారు డా. కె. రాం మోహన్. ఈ నీళ్లు తాగడం వల్ల ..ముఖ్యంగా పెద్దవారిలో బ్ల్యూ బెర్రీ వ్యాధితో పాటు, ఎన్నో ప్రమాదకర ఆరోగ్య సమస్యలు వస్తాయని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. నైట్రేట్ అధికంగా ఉండటానికి శివారు ప్రాంతాల్లో ఇళ్ల నుంచి వచ్చే మురుగు నీరు, సబ్బు నీరు కలవడం, అలాగే…వ్యవసాయంలో ఉపయోగించే రసాయన ఎరువుల వ్యర్థాలు భూమిలోకి కలవడమే అన్నారు. నీటి కాలుష్యంతో నీటి నాణ్యత తగ్గడమే కాదు, మనుషుల ఆరోగ్యాలు పాడవుతాయని ఎన్. జి. ఆర్. ఐ పరిశోధనల్లో వెల్లడైంది.

భూగర్భ నీటి మట్టాలు తగ్గిపోతున్నాయి. మరింత లోతుగా బోర్లువేసి భూగర్భజలాలను పైకి లాగుతున్నారు. అయితే ఇంత శ్రమించి నీళ్లు పొందుతున్నా…స్వచ్ఛత లేదు. నీటిని రీసైక్లింగ్ చేసే పద్ధతులు ఉన్నా..అవి ఎంతో డబ్బుతో కూడుకున్నవి. ఇప్పటికే శివారు ప్రాంతాల ప్రజలు తీవ్రమైన నీటి ఎద్దడితో…నీరు దొరికితే మహాభాగ్యం అని తాగేస్తున్నారు. భూగర్భ జలాలను పెంచుకోడానికి, రాలే ప్రతి వాన చినుకును భద్రంగా దాచుకోవాలి. డబ్బులను బ్యాంకుల్లో పొదుపు చేసుకున్నట్టే, వాన నీటిని కూడా ఇంకుడు గుంతల్లోకి మళ్లించి పొదుపు చేయాలి. పెరిగిపోతున్న జనాభాకి, భూగర్భ జలాలు తరిగి పోయాయి. ప్రతి మనిషి ఇందుకోసం నడుం బిగించాల్సిన అవసరం వుంది. ఇది ప్రజలందరి బాధ్యత.

Dhoni Son of Sachin : మహేంద్ర సింగ్ ధోని సన్నాఫ్ సచిన్ టెండుల్కర్..! ఛత్తీస్‌గడ్‌లో టీచర్ పోస్ట్ కోసం వింత దరఖాస్తు..

భూమిపైకి పెద్ద పెద్ద గ్రహశకలాలు ఎన్ని వచ్చాయో తెలుసా?శాస్త్రవేత్తల కొత్త అధ్యయనంలో వెల్లడి..:asteroids on Earth video.

Bonalu: ఆంధ్రలో తెలంగాణ బోనాలు.. ఈనెల 18న బెజవాడ కనకదుర్గమ్మకు బంగారు బోనం.. సీఎం జగన్‌కు ఆహ్వానం