AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ande Sri Funeral: అందెశ్రీ అంతిమయాత్ర.. పాడె మోసిన సీఎం రేవంత్ రెడ్డి.. భావోద్వేగం.. వీడియో

కవి, రచయిత అందెశ్రీ సోమవారం ఉదయం కన్నుమూసిన విషయం తెలిసిందే.. అందెశ్రీ అంత్యక్రియలకు సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు, టీపీసీసీ చీఫ్‌ మహేష్ గౌడ్ హాజరయ్యారు. ఘట్‌కేసర్ ఎన్ఎఫ్‌సీ నగర్‌లో అంత్యక్రియలు జరిగాయి.. లాలాపేట్‌ నుంచి ఘట్‌కేసర్ వరకు అంతిమయాత్ర కొనసాగింది.. ఈ సందర్భంగా అందెశ్రీకి రేవంత్ రెడ్డి ఘన నివాళులర్పించారు. దీంతోపాటు అంతిమయాత్రలో పాడె మోశారు.

Ande Sri Funeral: అందెశ్రీ అంతిమయాత్ర.. పాడె మోసిన సీఎం రేవంత్ రెడ్డి.. భావోద్వేగం.. వీడియో
Revanth Reddy
Shaik Madar Saheb
|

Updated on: Nov 11, 2025 | 1:53 PM

Share

కవి, రచయిత అందెశ్రీ సోమవారం ఉదయం కన్నుమూసిన విషయం తెలిసిందే.. అందెశ్రీ అంత్యక్రియలకు సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు, టీపీసీసీ చీఫ్‌ మహేష్ గౌడ్ హాజరయ్యారు. ఘట్‌కేసర్ ఎన్ఎఫ్‌సీ నగర్‌లో అంత్యక్రియలు జరిగాయి.. లాలాపేట్‌ నుంచి ఘట్‌కేసర్ వరకు అందెశ్రీ అంతిమయాత్ర కొనసాగింది.. అనంతరం అధికార లాంఛనాలతో అంత్యక్రియలు జరిగాయి. ఈ సందర్భంగా అందెశ్రీకి రేవంత్ రెడ్డి ఘన నివాళులర్పించారు. దీంతోపాటు అంతిమయాత్రలో పాల్గొని పాడె మోశారు. అందెశ్రీతో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ సీఎం రేవంత్ రెడ్డి భావోద్వేగానికి లోనయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అందెశ్రీ అంత్యక్రియలకు కేటాయించిన స్థలంలో స్మృతి వనం ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..

అందేశ్రీ మృతి కవులకు మాత్రమే కాదు వ్యక్తిగతంగా తన తీరని లోటని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. పీసీసీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు అందేశ్రీని కలవాలని ప్రయత్నం చేస్తే తాను రాజకీయ నాయకులను కలవను అన్నారని గుర్తుచేసుకున్నారు. కానీ ఒక్క సారి కలవాలని సమాచారం పంపి కలిసామన్నారు. తెలంగాణ నిర్మాణంలో కలిసి పని చేద్దాం అంటే.. ఒప్పుకున్నారన్నారు. తనతో మాట్లాడిన తరువాత.. పట్టుదలతో పని చేస్తే తెలంగాణ ప్రజలు ఆదరిస్తారు అని చెప్పారని.. అందే శ్రీ కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని తెలిపారు. నిస్వార్ధంగా పని చేసిన అందెశ్రీ ఎన్ని ఆర్ధిక ఇబ్బందుల్లో ఉన్నారో తనకు తెలుసన్నారు.

అందెశ్రీ (64) సోమవారం ఉదయం లాలాపేటలోని ఇంట్లో కుప్పకూలారు. ఆయన్ను గాంధీ ఆస్పత్రికి.. తీసుకెళ్లగా.. అప్పటికే ఆయన కన్నుమూసినట్లు వైద్యులు ప్రకటించారు. అందెశ్రీ ప్రస్తుతం సిద్దిపేట జిల్లాలో ఉన్న రేబర్తి గ్రామంలో జన్మించారు.. ఆయన అసలు పేరు అందె ఎల్లయ్య. అందెశ్రీ రచించిన జయజయహే తెలంగాణ గీతం రచించారు. ఈ ఏడాది జూన్‌ 2న తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సం సందర్భంగా సీఎం రేవంత్‌ రెడ్డి చేతుల మీదుగా కోటి రూపాయల నగదు పురస్కారం అందుకున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us