AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: ఓరి నీ పాసుగాలా.. సాధారణ ప్రభుత్వ ఉద్యోగే.. కానీ ఆస్తుల విలువ తెలిస్తే కళ్లు తేలేస్తారు..!

లంచం ఇస్తే చాలు మీ పని ఐపోతుంది.. ఎక్కడ కావాలంటే అక్కడ భవనాలు నిర్మించుకునేందుకు అనుమతి లభిస్తుంది. అది బఫర్‌జోన్‌ అయినా.. ఎఫ్‌టీఎల్ అయినా లంచం ఇస్తే చాలు మీ పనైపోయినట్టే.. నిబంధనలకు పాతరేసి పర్మిషన్‌ ఇచ్చేస్తారు. ఇలా ఆమ్యామ్యాలకు అలవాటు పడి ఏకంగా వంద కోట్లకు పైగా అక్రమాస్తులు సంపాదించాడు ఓ అధికారి.

Hyderabad: ఓరి నీ పాసుగాలా.. సాధారణ ప్రభుత్వ ఉద్యోగే.. కానీ ఆస్తుల విలువ తెలిస్తే కళ్లు తేలేస్తారు..!
Acb Raids
Shaik Madar Saheb
|

Updated on: Nov 30, 2024 | 7:28 PM

Share

లంచం ఇస్తే చాలు మీ పని ఐపోతుంది.. ఎక్కడ కావాలంటే అక్కడ భవనాలు నిర్మించుకునేందుకు అనుమతి లభిస్తుంది. అది బఫర్‌జోన్‌ అయినా.. ఎఫ్‌టీఎల్ అయినా లంచం ఇస్తే చాలు మీ పనైపోయినట్టే.. నిబంధనలకు పాతరేసి పర్మిషన్‌ ఇచ్చేస్తారు. ఇలా ఆమ్యామ్యాలకు అలవాటు పడి ఏకంగా వంద కోట్లకు పైగా అక్రమాస్తులు సంపాదించాడు ఓ అధికారి. తాజాగా ఏసీబీ వలకు చిక్కాడు. హైదరాబాద్‌లో ఇరిగేషన్‌ మాజీ AEE నిఖేష్‌ ఇంటిపై ఏసీబీ దాడులు మెరుపు దాడులు చేశారు. ఏకకాలంలో హైదరాబాద్‌తో పాటు మెదక్‌, సంగారెడ్డి జిల్లాల్లో 20 చోట్ల సోదాలు నిర్వహించారు. నిఖేష్‌ బంధువుల ఇళ్లలోనూ ఏసీబీ అధికారులు తనిఖీలు చేపట్టారు. నిఖేష్‌ 150 కోట్లకు పైగా అక్రమాస్తులు సంపాదించినట్టు గుర్తించారు. నిఖేష్‌ పేరుతో మూడు ఫామ్‌హౌస్‌లు, మూడు విల్లాలు ఉన్నట్టు గుర్తించారు ఏసీబీ అధికారులు. మూడు ఫామ్‌హౌస్‌ల విలువ 80 కోట్లు ఉంటుందని అంచనా వేస్తున్నారు. వీటితోపాటు.. చాలా ప్రాంతాల్లో ఆస్తులు ఉన్నట్లు అధికారులు గుర్తించారు.

ప్రస్తుతం సస్పెన్షన్‌లో ఉన్నాడు నిఖేష్‌. గతంలో కూడా లంచం తీసుకుంటూ ఏసీబీకి దొరికిపోయాడు. ఆరు నెలల క్రితం లక్ష రూపాయల లంచం తీసుకుంటూ అడ్డంగా దొరికిపోయాడు. గండిపేట బఫర్‌జోన్‌లో నిబంధనలకు విరుద్ధంగా అనుమతులు మంజూరు చేసినట్టు ఏసీబీ అధికారులు గుర్తించారు. పూర్తి స్థాయి సోదాల తర్వాత నిఖేష్‌ అక్రమాస్తులు భారీగా బయటపడే అవకాశం ఉంది.

ఆదాయానికి మించిన కేస్తుల కేస్ లో నిఖేష్‌పై కేస్ నమోదు చేశామని ఏసీబీ అధికారులు తెలిపారు. మొత్తం 19 ప్రాంతాల్లో సోదాలు నిర్వహించామని, అతడి బందువుల ఇళ్ళలోను సోదాలు చేశామన్నారు. 5 ప్లాట్లు, 6.5 ఎకరాల వ్యవసాయ భూమి ,2 కమర్షియల్ కాంప్లెక్స్ లకు చెందిన పత్రాలు స్వాధీనం చేసుకున్నామని ఏసీబీ అధికారులు తెలిపారు. ఇప్పటి వరకు 17.73 కోట్లు రూపాయలు ఆస్తులు గుర్తించామన్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..