Hyderabad Metro: మరోసారి వివాదంలో హైదరాబాద్ మెట్రో.. ఎస్కలేటర్ లో ప్రయాణికుడి కాలు ఇరుక్కుని..
ప్రయాణీకులకు మెరుగైన సేవలు అందించాల్సిన మెట్రో.. ప్రమాదాలకు గురి చేస్తున్నాయి. నిర్వహణ లోపంతో ప్యాసింజర్లను ఆస్పత్రి పాలు చేస్తున్నాయి. సరైన సూచనలు చేయకపోవడం, హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయకపోవడంతో...

ప్రయాణీకులకు మెరుగైన సేవలు అందించాల్సిన మెట్రో.. ప్రమాదాలకు గురి చేస్తున్నాయి. నిర్వహణ లోపంతో ప్యాసింజర్లను ఆస్పత్రి పాలు చేస్తున్నాయి. సరైన సూచనలు చేయకపోవడం, హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయకపోవడంతో మెట్రోలో ప్రమాదాలు నిత్యకృత్యంగా మారాయి. తాజాగా హైదరాబాద్ నగరంలోని హైటెక్ సిటీ మెట్రో స్టేషన్‌లో ఇలాంటి ఘటనే జరిగింది. గురువారం సాయంత్రం మెట్రో రైలు దిగి ఎస్కలేటర్ ద్వారా కిందకు వస్తుండగా ప్రమాదవశాత్తు అందులో కుడికాలు ఇరుక్కుపోయింది. ఈ ఘటనలో అతనికి తీవ్ర రక్త స్రావమైంది. సిబ్బంది నిర్లక్ష్యం, ఆలసత్వంతో ఫస్ట్ ఎయిడ్ కిట్ తీసుకురాలేదు. దీంతో బాధితుడు అపస్మారక స్థితికి చేరుకున్నాడు. తోటి ప్రయాణికులు గట్టిగా కేకలు వేయడంతో కొందరు ప్రాథమిక చికిత్స చేసి సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై నిర్లక్ష్యంగా వ్యవహరించిన మెట్రో సిబ్బందిపై నెటిజన్లు మండిపడుతున్నారు.
మరోవైపు.. హైదరాబాద్ మెట్రోలో మరోసారి సాంకేతిక లోపం ఏర్పడింది. టెక్నికల్ ఇష్యూతో పంజాగుట్ట మెట్రో స్టేషన్‌లో రైలు చాలా సమయం ఆగిపోయింది. దీంతో ప్రయాణికులు తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. కాగా సాంకేతిక కారణాలతో మెట్రో రైలు ఆగిపోవడం ఇటీవల తరచూ జరుగుతోంది. నాంపల్లి, ముసారాంబాగ్ స్టేషన్లలోనూ సాంకేతిక కారణాలతో మెట్రో సర్వీసులు ఆగిపోయాయి. ఈ నెల 4 తేదీన రైళ్లు ఉదయం చాలా సమయం పాటు మెట్రో సర్వీసులు కదల్లేదు. సిగ్నలింగ్ వ్యవస్థలో ఏర్పడిన లోపమంటూ చాలా సేపు రైళ్లను ఆపేశారు. మెట్రో రైలు సేవలకు అంతరాయం కలగడంపై సోషల్ మీడియా వేదికగా ప్రయాణీకులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.




మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..