పార్కింగ్ కోసం.. ఘోరంగా కత్తులతో దాడులు..
హైదరాబాద్ గోల్కొండ నదీమ్ కాలనీలో ఇరు కుటుంబాల మధ్య ఘర్షణ స్థానికంగా ఉద్రిక్తతకు దారి తీసింది. ఇంటి ముందు పార్కింగ్ విషయంలో తలెత్తిన గొడవ.. ఒకరిపై ఒకరు కత్తులతో దాడి చేసుకునేంత వరకూ వెళ్లింది. గోల్కొండ పోలీస్ పరిధిలోని నదీమ్ కాలనీలో.. పార్కింగ్ విషయంలో రెండు కుటుంబాల మధ్య ఘర్షణ తలెత్తింది. అబ్దుల్ రెహమాన్, అయాన్, దానిష్ అనే ముగ్గురు వ్యక్తులపై జావెద్ ఆలమ్, జావెద్ ఇర్ఫాన్, ఖాలేద్ అనే ముగ్గురు వ్యక్తులు కత్తులతో దాడి చేసుకున్నారు. […]
హైదరాబాద్ గోల్కొండ నదీమ్ కాలనీలో ఇరు కుటుంబాల మధ్య ఘర్షణ స్థానికంగా ఉద్రిక్తతకు దారి తీసింది. ఇంటి ముందు పార్కింగ్ విషయంలో తలెత్తిన గొడవ.. ఒకరిపై ఒకరు కత్తులతో దాడి చేసుకునేంత వరకూ వెళ్లింది.
గోల్కొండ పోలీస్ పరిధిలోని నదీమ్ కాలనీలో.. పార్కింగ్ విషయంలో రెండు కుటుంబాల మధ్య ఘర్షణ తలెత్తింది. అబ్దుల్ రెహమాన్, అయాన్, దానిష్ అనే ముగ్గురు వ్యక్తులపై జావెద్ ఆలమ్, జావెద్ ఇర్ఫాన్, ఖాలేద్ అనే ముగ్గురు వ్యక్తులు కత్తులతో దాడి చేసుకున్నారు. నడిరోడ్డుపై.. అందరూ చూస్తుండగానే కత్తులతో తీవ్రంగా గాయపర్చుకున్నారు. ఈ ఘర్షణలో ముగ్గురికి తీవ్రంగా గాయాలయ్యాయి.
స్థానికంగా కలకలం రేపిన ఈ ఘటనతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. యువకులపై కత్తులతో దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఇంటి ముందు వాహనాల పార్కింగ్ విషయంలో గొడవ జరిగిందని అంటున్నారు గాయపడిన వారి కుటుంబసభ్యులు.