నిఘా నీడలో.. ఐపీఎల్ ఫైనల్..

ఆదివారం ఉప్పల్ స్టేడియంలో జరగబోయే ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్‌కి గట్టి భద్రతను ఏర్పాటు చేసినట్టు తెలిపారు హైదరాబాద్ సీపీ మహేష్ భగవత్. ఉప్పల్ స్టేడియంలో సిట్టింగ్ కెపాసిటీ 38,500లు కాబట్టి.. పార్కింగ్‌కు, ట్రాఫిక్‌కు సంబంధించిన ఏర్పాట్లపై మీడియాతో మాట్లాడారు సీపీ. రేపు సాయంత్రం 7.30 నిమిషాలకు ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్  ప్రారంభమవుతుందని.. దీనికి స్టేడియం చుట్టూ.. 300 సీసీ కెమెరాలు ఏర్పాట్లు చేసినట్టు తెలిపారు. అంతేకాకుండా.. స్టేడియం లోపల ప్రత్యేక పోలిస్ కమాండ్ కంట్రోల్ రూపం ఏర్పాటు […]

నిఘా నీడలో.. ఐపీఎల్ ఫైనల్..
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: May 11, 2019 | 5:16 PM

ఆదివారం ఉప్పల్ స్టేడియంలో జరగబోయే ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్‌కి గట్టి భద్రతను ఏర్పాటు చేసినట్టు తెలిపారు హైదరాబాద్ సీపీ మహేష్ భగవత్. ఉప్పల్ స్టేడియంలో సిట్టింగ్ కెపాసిటీ 38,500లు కాబట్టి.. పార్కింగ్‌కు, ట్రాఫిక్‌కు సంబంధించిన ఏర్పాట్లపై మీడియాతో మాట్లాడారు సీపీ. రేపు సాయంత్రం 7.30 నిమిషాలకు ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్  ప్రారంభమవుతుందని.. దీనికి స్టేడియం చుట్టూ.. 300 సీసీ కెమెరాలు ఏర్పాట్లు చేసినట్టు తెలిపారు. అంతేకాకుండా.. స్టేడియం లోపల ప్రత్యేక పోలిస్ కమాండ్ కంట్రోల్ రూపం ఏర్పాటు చేశమన్నారు. మొత్తం 2,850 మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేసినట్టు చెప్పారు. అలాగే.. రాత్రి ఒంటి గంట వరకూ మెట్రో రైల్ సర్వీసులు అందుబాటులో ఉంటాయని పేర్కొన్నారు హైదరాబాద్ సీపీ మహేష్ భగవత్.

కాగా.. మరోవైపు ఐపీఎల్ మ్యాచ్ టిక్కెట్లను బ్లాకుల్లో విక్రయించడం దుమారం రేపుతోంది. టికెట్ బుకింగ్ వెబ్ సైట్స్ ప్రారంభించిన కొద్ది నిమిషాల్లోనే బుకింగ్ క్లోజ్ చేస్తూ క్రికెట్ అభిమానుల్ని నిరాశపరిచారు. క్రికెట్ ఆటను ఓ కార్పోరేట్ ఆటలా మార్చేస్తూ బ్లాకులో టికెట్లు విక్రయిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.