రసాబాసగా విపక్షాల ధర్నా.. కుర్చీ కోసం కాంగ్రెస్ నేతల తన్నులాట
ఇందిరా పార్క్ వద్ద నిర్వహించిన విపక్షాల నిరసన దీక్ష రసాబాసగా మారింది. ధర్నా వేదికపై ఉన్న కుర్చీ కోసం.. కాంగ్రెస్ నేతలు కొట్టుకున్నారు. దీంతో ధర్నాలో గందరగోళం నెలకొంది. ఇంటర్ విద్యార్ధుల ఆత్మహత్యలపై అఖిలపక్షం ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్‌తో పాటు టీడీపీ, సీపీఎం, సీపీఐ, టీజేఎస్ తదితర పక్షాలు పాల్గొన్నాయి. అయితే ముందుగా టీడీపీ, సీపీఐ, సీపీఎం నేతలు ప్రసంగించారు. ఆ తర్వాత కాంగ్రెస్ నేత వి.హన్మంతరావు మాట్లాడుతుండగా.. మధ్యలో కాంగ్రెస్ రాష్ట్ర […]
ఇందిరా పార్క్ వద్ద నిర్వహించిన విపక్షాల నిరసన దీక్ష రసాబాసగా మారింది. ధర్నా వేదికపై ఉన్న కుర్చీ కోసం.. కాంగ్రెస్ నేతలు కొట్టుకున్నారు. దీంతో ధర్నాలో గందరగోళం నెలకొంది. ఇంటర్ విద్యార్ధుల ఆత్మహత్యలపై అఖిలపక్షం ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్‌తో పాటు టీడీపీ, సీపీఎం, సీపీఐ, టీజేఎస్ తదితర పక్షాలు పాల్గొన్నాయి. అయితే ముందుగా టీడీపీ, సీపీఐ, సీపీఎం నేతలు ప్రసంగించారు. ఆ తర్వాత కాంగ్రెస్ నేత వి.హన్మంతరావు మాట్లాడుతుండగా.. మధ్యలో కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల శాఖ ఇంచార్జ్ కుంతియా అక్కడికి చేరుకున్నారు. దీన్ని గమనించిన కాంగ్రెస్ నేత నగేష్.. వీహెచ్ కుర్చీ కుంతియాకు ఇచ్చారు. అయితే ఇది చూసిన వీహెచ్.. నగేష్‌తో వాగ్వాదానికి దిగారు. అంతటితో ఆగకుండా వీహెచ్.. నగేష్‌పై చెయ్యి చేసుకున్నారు. దీంతో కిందపడిపోయిన నగషే.. వీహెచ్‌పై దాడికి దిగాడు. రెండు వర్గాలుగా విడిపోయిన నేతలు.. ఒకరినోకరు తోసుకున్నారు. ఈ తోపులాటలో వీహెచ్ కూడా కింద పడిపోయారు. అక్కడే ఉన్నవారు వీహెచ్‌ను లేపి.. నగేష్‌ను అక్కడి నుంచి పంపించేశారు.