నేడు ఎంఎంటీఎస్ ట్రైన్స్ తాత్కాలికంగా రద్దు

ఇవాళ నగరంలో ఎంఎంటీఎస్ రైళ్లు తాత్కాలికంగా రద్దు చేశారు. బేగంపేట-సనత్‌నగర్ మధ్య బ్రిడ్జ్జి నిర్మాణ పనులు జరుగుతున్న దృష్ట్యా నగరంలో ఆదివారం తిరిగే 14 ఎంఎంటీఎస్ రైళ్లను రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో రాకేశ్ తెలిపారు. ఫలక్‌నుమా-లింగంపల్లి, లింగంపల్లి-ఫలక్‌నుమా, లింగంపల్లి -హైదరాబాద్, హైదరాబాద్-లింగంపల్లి మార్గంలో నడిచే రైళ్లను తాత్కాలికంగా ఒక రోజు రద్దు చేసినట్లు వివరించారు. కాగా, కర్నూల్ సిటీ నుంచి కాచిగూడ ప్యాసింజర్ రైలును రాత్రి 12.30 గంటల తర్వాత పునరుద్ధరిస్తామని సీపీఆర్వో […]

నేడు ఎంఎంటీఎస్ ట్రైన్స్ తాత్కాలికంగా రద్దు
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: May 12, 2019 | 8:23 AM

ఇవాళ నగరంలో ఎంఎంటీఎస్ రైళ్లు తాత్కాలికంగా రద్దు చేశారు. బేగంపేట-సనత్‌నగర్ మధ్య బ్రిడ్జ్జి నిర్మాణ పనులు జరుగుతున్న దృష్ట్యా నగరంలో ఆదివారం తిరిగే 14 ఎంఎంటీఎస్ రైళ్లను రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో రాకేశ్ తెలిపారు. ఫలక్‌నుమా-లింగంపల్లి, లింగంపల్లి-ఫలక్‌నుమా, లింగంపల్లి -హైదరాబాద్, హైదరాబాద్-లింగంపల్లి మార్గంలో నడిచే రైళ్లను తాత్కాలికంగా ఒక రోజు రద్దు చేసినట్లు వివరించారు. కాగా, కర్నూల్ సిటీ నుంచి కాచిగూడ ప్యాసింజర్ రైలును రాత్రి 12.30 గంటల తర్వాత పునరుద్ధరిస్తామని సీపీఆర్వో రాకేశ్ వెల్లడించారు.