స్థానిక ఎమ్మెల్సీ అభ్యర్థులను ఖరారు చేసిన టీఆర్ఎస్!
టీఆర్ఎస్ పార్టీ తన ఎమ్మెల్సీ అభ్యర్థులను ఖరారు చేసింది. మూడు నియోజకవర్గాల్లో ఎమ్మెల్సీ ఎన్నిక జరగాల్సి ఉండటంతో ఆ అభ్యర్థులను సీఎం కేసీఆర్ ఖరారు చేశారు. రంగారెడ్డి నియోజకవర్గ ఎమ్మల్సీ అభ్యర్థిగా పట్నం మహేందర్ రెడ్డిని ఖరారు చేసిన అధిష్ఠానం, నల్గొండ అభ్యర్థిగా తేరా చిన్నపరెడ్డిని, వరంగల్ నియోజకవర్గ ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోచంపల్లి శ్రీనివాసరెడ్డిని ఖరారు చేసింది. అభ్యర్థుల ఖరారు అనంతరం సీఎం కేసీఆర్ ప్రత్యేక విమానంలో చెన్నై వెళ్లనున్నారు. రేపు డీఎంకే అధినేత స్టాలిన్‌తో ఫెడరల్ […]
టీఆర్ఎస్ పార్టీ తన ఎమ్మెల్సీ అభ్యర్థులను ఖరారు చేసింది. మూడు నియోజకవర్గాల్లో ఎమ్మెల్సీ ఎన్నిక జరగాల్సి ఉండటంతో ఆ అభ్యర్థులను సీఎం కేసీఆర్ ఖరారు చేశారు. రంగారెడ్డి నియోజకవర్గ ఎమ్మల్సీ అభ్యర్థిగా పట్నం మహేందర్ రెడ్డిని ఖరారు చేసిన అధిష్ఠానం, నల్గొండ అభ్యర్థిగా తేరా చిన్నపరెడ్డిని, వరంగల్ నియోజకవర్గ ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోచంపల్లి శ్రీనివాసరెడ్డిని ఖరారు చేసింది. అభ్యర్థుల ఖరారు అనంతరం సీఎం కేసీఆర్ ప్రత్యేక విమానంలో చెన్నై వెళ్లనున్నారు. రేపు డీఎంకే అధినేత స్టాలిన్‌తో ఫెడరల్ ఫ్రంట్ విషయమై భేటీ కానున్నారు.