Hyderabad: అందరు చూస్తుండగానే పేలిన గ్యాస్‌ సిలిండర్‌.. షాకింగ్‌ వీడియో.

ఇదిలా ఉంటే ప్రమాదానికి కారణం ఫ్రిజ్‌గా తెలిసింది. మొదట ఇంట్లోని ఫ్రిజ్‌లో ఏదో లోపం కారణంగా మంట అంటుకుంది. అనంతరం మంట క్రమంగా వ్యాపించడం ప్రారంభమైంది. దీంతో పక్కనే ఉన్న గ్యాస్‌ సిలిండర్‌కు సైతం మంటలు అంటుకున్నాయి. దీంతో గ్యాస్‌ సిలిండర్‌ ఒక్కసారిగా పేలింది. ఇదంతా బయట ఉన్న ప్రజలు...

Hyderabad: అందరు చూస్తుండగానే పేలిన గ్యాస్‌ సిలిండర్‌.. షాకింగ్‌ వీడియో.
Fire Accident Video
Follow us
Narender Vaitla

|

Updated on: Feb 13, 2024 | 9:14 AM

హైదరాబాద్‌ శివారు ప్రాంతంలో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. అందరూ చూస్తుండగానే ఇంట్లో గ్యాస్‌ సిలిండర్ ఒక్కసారిగా పేలింది. ఈ సంఘటన హైదరాబాద్‌ శివారు ప్రాంతమైన అబ్దుల్లాపూర్‌ మెట్‌లో చోటు చేసుకుంది. సోమవారం మధ్యాహ్నం ఓ ఇంట్లో జరిగిన అగ్ని ప్రమాదంలో గ్యాస్‌ ఒక్కసారిగా పేలింది.

ప్రమాద తీవ్రత ఎక్కువగానే జరిగినా, అప్పటికే ఇంట్లోని వారు అలర్ట్‌ కావడంతో ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేవని తెలుస్తోంది. ప్రమాదం అనంతరం పోలీసులు రంగంలోకి దిగి ప్రమాదానికి గల కారణాన్ని గుర్తించారు. ఇక ప్రమాద విషయం తెలుసుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది చేరుకొని మంటలను ఆర్పేసింది.

ప్రమాదానికి సంబంధించిన వీడియో..

ఇదిలా ఉంటే ప్రమాదానికి కారణం ఫ్రిజ్‌గా తెలిసింది. మొదట ఇంట్లోని ఫ్రిజ్‌లో ఏదో లోపం కారణంగా మంట అంటుకుంది. అనంతరం మంట క్రమంగా వ్యాపించడం ప్రారంభమైంది. దీంతో పక్కనే ఉన్న గ్యాస్‌ సిలిండర్‌కు సైతం మంటలు అంటుకున్నాయి. దీంతో గ్యాస్‌ సిలిండర్‌ ఒక్కసారిగా పేలింది. ఇదంతా బయట ఉన్న ప్రజలు తమ స్మార్ట్‌ఫోన్స్‌లో రికార్డ్‌ చేశారు. గ్యాస్‌ సిలిండర్‌ పేలిన ధాటికి మంటలు ఒక్కసారిగా భయటకు వచ్చాయి. ఈ షాకింగ్‌ ఘటనకు స్థానిక ప్రజలంతా భయాందోళనకు గురయ్యారు. ప్రమాదానికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌ అవుతోంది.

మరిన్ని హైదరాబాద్ వార్తల కోసం క్లిక్ చేయండి..