AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

హైదరాబాద్‌ కూకట్‌పల్లిలో కల్తీ కల్లు కలకలం.. 13 మందికి అస్వస్థత.. నిమ్స్‌కి తరలింపు..

మెరుగైన చికిత్స నిమిత్తం ప్రోహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ అధికారులు బాధిత కుటుంబ సభ్యులతో మాట్లాడి వారిని 108 అంబులెన్స్ లలో నిమ్స్ ఆసుపత్రికి తరలించారు. అంతకు ముందు తమ బాధిత కుటుంబ సభ్యులు తరలింపునకు నిరాకరించడంతో కాసేపు గందరగోళ వాతావరణం నెలకొంది. అధికారులు వారితో మాట్లాడి ఒప్పించారు. నిమ్స్ ఆసుపత్రిలో ఇక్కడ లభిస్తున్న దానికన్నా మెరుగైన చికిత్స అందేలా చూసే బాధ్యత తమదని హామీ ఇవ్వటంతో వారు..

హైదరాబాద్‌ కూకట్‌పల్లిలో కల్తీ కల్లు కలకలం.. 13 మందికి అస్వస్థత.. నిమ్స్‌కి తరలింపు..
Adulterated
Noor Mohammed Shaik
| Edited By: |

Updated on: Jul 09, 2025 | 11:57 AM

Share

హైదరాబాద్‌లో కల్తీ కల్లు కలకలం సృష్టించింది. కూకట్‌పల్లి పరిధిలో కల్తీ కల్లు తాగిన కొందరు పరిస్థితి అర్థరాత్రి విషమించింది. కల్తీ కల్లు తాగి అస్వస్థతకు గురై కూకట్‌పల్లి రాందేవ్ రావు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న 12 మందిని మెరుగైన చికిత్స నిమిత్తం ప్రోహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ అధికారులు, నిమ్స్ ఆసుపత్రికి తరలించారు. కూకట్‌పల్లి సర్దార్ పటేల్ నగర్, ఇంద్రహిల్స్, కె.పి.హెచ్.బి ఉషాముళ్ళపూడి రోడ్డులోని కల్లు కాంపౌండ్ లలో శనివారం కల్లు తాగిన సుమారు 13 మంది విరోచనాలు, వాంతులతో ఆసుపత్రిలో చేరటం జరిగింది. సమాచారం అందుకున్న పీఏసీ ఛైర్మన్ అరికెపూడి గాంధీ, బాధితులను పరామర్శించారు. మెరుగైన చికిత్స నిమిత్తం నిమ్స్ ఆసుపత్రికి తరలించాలని అధికారులను ఆదేశించారు.

మెరుగైన చికిత్స నిమిత్తం ప్రోహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ అధికారులు బాధిత కుటుంబ సభ్యులతో మాట్లాడి వారిని 108 అంబులెన్స్ లలో నిమ్స్ ఆసుపత్రికి తరలించారు. అంతకు ముందు తమ బాధిత కుటుంబ సభ్యులు తరలింపునకు నిరాకరించడంతో కాసేపు గందరగోళ వాతావరణం నెలకొంది. అధికారులు వారితో మాట్లాడి ఒప్పించారు. నిమ్స్ ఆసుపత్రిలో ఇక్కడ లభిస్తున్న దానికన్నా మెరుగైన చికిత్స అందేలా చూసే బాధ్యత తమదని హామీ ఇవ్వటంతో వారు బాధితులను నిమ్స్ ఆసుపత్రికి తరలించేందుకు అంగీకరించారు.

అస్వస్థతకు గురైన వారిలో పెంటేష్, మాధవి, యాదగిరి,మోనప్ప, పోచమ్మ, కోటేశ్వర రావు, రాములు, దేవదాసు, లక్ష్మీ, గోవిందమ్మ, నరసింహ, యోబు, సత్యనారాయణలు ఉన్నారు. కాగా సత్యనారాయణ కుటుంబ సభ్యులు తరలింపునకు నిరాకరించడంతో, ప్రస్తుతం అతడికి రాందేవ్ రావు ఆసుపత్రిలోనే చికిత్స అందిస్తున్నారు. వీరిలో మోనప్ప పరిస్థితి విషమంగా ఉండటంతో, అతడిని వెంటిలేటర్ పై చికిత్స అందిస్తున్నారు. ఇదిలా ఉండగా, కల్తీ కల్లు తాగిన మరో ముగ్గురు చికిత్స నిమిత్తం కూకట్‌పల్లి ప్రతిమ ఆస్పత్రిలో చేరగా, మెరుగైన చికిత్స నిమిత్తం ఇద్దరిని గాంధీ ఆసుపత్రికి తరలించగా, మరొకరి అదే ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్నితెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి…

కిలో లక్షల్లోనే.. భారత్‌లోనే అత్యంత ఖరీదైన కూరగాయ.. ఎలా..
కిలో లక్షల్లోనే.. భారత్‌లోనే అత్యంత ఖరీదైన కూరగాయ.. ఎలా..
ఏపీ టెట్‌ 2025 ఆన్సర్‌ కీ విడుదల.. ఫలితాలు ఎప్పుడంటే?
ఏపీ టెట్‌ 2025 ఆన్సర్‌ కీ విడుదల.. ఫలితాలు ఎప్పుడంటే?
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఉత్తర్వులు జారీ!
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఉత్తర్వులు జారీ!
ఆ ప్రొడ్యూసర్ రూమ్ కు పిలిచి.. బాంబ్ పేల్చిన బిగ్ బాస్ బ్యూటీ
ఆ ప్రొడ్యూసర్ రూమ్ కు పిలిచి.. బాంబ్ పేల్చిన బిగ్ బాస్ బ్యూటీ
నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. జనవరిలో జాబ్ క్యాలెండర్ 2026 విడుదల
నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. జనవరిలో జాబ్ క్యాలెండర్ 2026 విడుదల
ఏపీ vs తెలంగాణ: మళ్లీ మొదలైన నీళ్ల లొల్లి.. తగ్గేదే లేదంటున్న..
ఏపీ vs తెలంగాణ: మళ్లీ మొదలైన నీళ్ల లొల్లి.. తగ్గేదే లేదంటున్న..
తనూజ కంటే బెటర్.. అసలైన అర్హులు వేరే ఉన్నారు..
తనూజ కంటే బెటర్.. అసలైన అర్హులు వేరే ఉన్నారు..
ఈ చెట్ల పెంపకంతో కోట్లల్లో లాభం..సాగు విధానం గురించి మీకు తెలుసా?
ఈ చెట్ల పెంపకంతో కోట్లల్లో లాభం..సాగు విధానం గురించి మీకు తెలుసా?
ఒక కిలోమీటరు నడవడానికి ఎన్ని అడుగులు వేయాలి..? 99శాతం మందికి..
ఒక కిలోమీటరు నడవడానికి ఎన్ని అడుగులు వేయాలి..? 99శాతం మందికి..
ఇంటర్‌ పబ్లిక్ పరీక్షల టైం టేబుల్ 2026 మారిందోచ్.. కొత్త షెడ్యూల్
ఇంటర్‌ పబ్లిక్ పరీక్షల టైం టేబుల్ 2026 మారిందోచ్.. కొత్త షెడ్యూల్