AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: వేసవి నేపథ్యంలో TSRTC గుడ్‌న్యూస్.. అందుబాటులోకి ఏసీ బస్సులు

గత వారం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 100 కొత్త బస్సులను ప్రారంభించారు. TSRTC ఈ ఏడాది జూన్ నాటికి దశలవారీగా 1,325 కొత్త బస్సులను అమలులోకి తీసుకురావడానికి ప్రణాళికలు సిద్ధం చేసింది. వీటిలో 712 పల్లె వెలుగు, 400 ఎక్స్‌ప్రెస్, 75 డీలక్స్, 138 లహరి/రాజధాని బస్సులు ఉన్నాయి.

Hyderabad: వేసవి నేపథ్యంలో TSRTC గుడ్‌న్యూస్.. అందుబాటులోకి ఏసీ బస్సులు
AC Bus
Ram Naramaneni
|

Updated on: Feb 17, 2024 | 12:38 PM

Share

ఫిబ్రవరి 17:  గ్రేటర్ హైదరాబాద్‌లో పెరుగుతున్న ఉష్ణోగ్రతల అసౌకర్యాన్ని అధిగమించడానికి, తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TSRTC) ఏప్రిల్ నాటికి 100 ఎలక్ట్రిక్ ఎయిర్ కండిషన్డ్ (AC) బస్సులను ప్రవేశపెట్టనుంది. TSRTC గ్రేటర్ హైదరాబాద్ జోన్‌లో దాదాపు 64 ఎలక్ట్రిక్ AC బస్సులను నడుపుతోంది. ప్రధానంగా విమానాశ్రయ మార్గాల్లో సేవలు అందిస్తోంది. ఇప్పుడు మరిన్ని బస్సులు అందుబాటులోక తెచ్చేందుకు ప్లాన్ చేస్తోంది. ఈ బస్సులకు సాధారణ రోజులలో 60% ఆక్యుపెన్సీ రేటు ఉన్నట్లు చెబుతున్నారు. డిమాండ్ కారణంగా వేసవి నెలల్లో 85%కి ఆక్యుపెన్సీ రేటు పెరుగుతుంది.

గత వారం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 100 కొత్త బస్సులను ప్రారంభించారు. TSRTC ఈ ఏడాది జూన్ నాటికి దశలవారీగా 1,325 కొత్త బస్సులను అమలులోకి తీసుకురావడానికి ప్రణాళికలు సిద్ధం చేసింది. వీటిలో 712 పల్లె వెలుగు, 400 ఎక్స్‌ప్రెస్, 75 డీలక్స్, 138 లహరి/రాజధాని బస్సులు ఉన్నాయి.

సమ్మక్క- సారలమ్మ ప్రసాదం భక్తుల దగ్గరకే

మేడారం సమ్మక్క- సారలమ్మ జాతరకు వెళ్లలేని భక్తుల కోసం TSRTC అద్బుతమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. అమ్మవార్ల ప్రసాదాన్ని భక్తుల ఇంటికి చేర్చే కార్యక్రమాన్ని చేపట్టింది. దేవాదాయ శాఖతో RTC సంస్థ లాజిస్టిక్స్ విభాగం ఇందుకోసం అగ్రిమెంట్ కుదుర్చుకుంది. దేవస్థానం నుంచి అమ్మవారి ప్రసాదంతో పాటు పసుపు, కుంకుమను భక్తులకు సంస్థ అందజేయనుంది. ఈ నెల 14 నుంచి 25 వరకు ఆఫ్​లైన్​, ఆన్​లైన్​లో బుక్​ చేసుకున్న భక్తులను అమ్మవారి ప్రసారం అందిస్తామని టీఎస్​ఆర్టీసీ ఎండీ సజ్జనార్​ తెలిపారు.  ఈ సౌకర్యాన్ని ఆర్టీసీ లాజిస్టిక్స్ కౌంటర్లలో, పేటీఎం ఇన్ సైడర్ యాప్​లో ఆన్​లైన్​ ద్వారా పొందవచన్నారు. లేదా  ఆర్టీసీ కాల్ సెంటర్ 040-69440069, 040-69440000, 040-23450033 నంబర్లను సంప్రదించాలని ఆర్టీసీ తెలిపింది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..