AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad Airport: ప్రయాణికుల రాకపోకల్లో రికార్డ్ సృష్టించిన హైదరాబాద్‌ విమానాశ్రయం

హైదరాబాద్‌ నుంచి అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా, యూకే.. వంటి దేశాలకు ఉన్నత చదువుల కోసం వెళ్లే విద్యార్థుల సంఖ్య పెరుగుతోంది. వ్యాపార కార్యకలాపాల నిమిత్తం ఇతర దేశాలకు వెళ్లే వారి సంఖ్యా ఎక్కువగా ఉన్నట్లు సంబంధిత వర్గాలు వివరిస్తున్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి 10 నెలల్లో ఇప్పటి వరకు అంటే 2023 ఏప్రిల్‌ నుంచి 2024 జనవరి నెలాఖరు వరకు ఈ ఎయిర్‌పోర్ట్‌ నుంచి రాకపోకలు సాగించిన ప్రయాణికుల..

Hyderabad Airport: ప్రయాణికుల రాకపోకల్లో రికార్డ్ సృష్టించిన హైదరాబాద్‌ విమానాశ్రయం
Hyderabad Airport
Subhash Goud
|

Updated on: Feb 17, 2024 | 1:15 PM

Share

హైదరాబాద్‌ శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ప్రయాణికుల రాకపోకలు అంతకంతకు పెరిగిపోతున్నాయి. ఎయిర్‌ పోర్ట్‌ మీదుగా ప్రయాణికుల పెరుగుదల ఇతర విమానాశ్రయాలతో పోల్చినట్లయితే అధికంగా ఉన్నట్లు నివేదికలు చెబుతున్నాయి. 2024 జనవరిలో హైదరాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి 21.8 లక్షల మంది ప్రయాణికులు రాకపోకలు సాగించినట్లు తెలుస్తోంది. అయితే గత ఏడాది ఇదే నెలతో పోల్చితే ప్రయాణికుల సంఖ్యలో 14% వృద్ధి నమోదైనట్లు నివేదికలు వెల్లవుతున్నాయి. కాగా, హైదరాబాద్‌ నుంచి వివిధ దేశాలైన అమెరికా, ఆస్ట్రేలియా, కెనడా, యూకే వంటి దేశాలకు ఉన్నత చదువుల నిమిత్తం వెళ్లే విద్యార్థుల సంఖ్య కూడా భారీగానే పెరిగింది. అయితే ఇటీవల నుంచి హైదరాబాద్‌ నుంచి ఇతర దేశాలకు విమానా సర్వీసులు పెరిగినే నేపథ్యంలో ప్రయాణికుల రాకపోకలు పెరిగాయి.

హైదరాబాద్‌ నుంచి అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా, యూకే.. వంటి దేశాలకు ఉన్నత చదువుల కోసం వెళ్లే విద్యార్థుల సంఖ్య పెరుగుతోంది. వ్యాపార కార్యకలాపాల నిమిత్తం ఇతర దేశాలకు వెళ్లే వారి సంఖ్యా ఎక్కువగా ఉన్నట్లు సంబంధిత వర్గాలు వివరిస్తున్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి 10 నెలల్లో ఇప్పటి వరకు అంటే 2023 ఏప్రిల్‌ నుంచి 2024 జనవరి నెలాఖరు వరకు ఈ ఎయిర్‌పోర్ట్‌ నుంచి రాకపోకలు సాగించిన ప్రయాణికుల సంఖ్య 2.07 కోట్లకు పైగా ఉంది. ఈ సంఖ్య గత ఆర్థిక సంవత్సరం ఇదే కాలంతో పోల్చితే 21% అధికమే.

ఢిల్లీ విమానాశ్రయం నుంచి..

ఇవి కూడా చదవండి

ఇక ఢిల్లీ విమానాశ్రయం నుంచి గత నెలలో 62.94 లక్షల మంది ఉండగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు 6.07 కోట్ల మంది ప్రయాణికుల రాకపోకలు సాగించారు. అలాగే గత ఏడాది జనవరితో పోల్చితే ఈ సంవత్సరం జనవరిలో ప్రయాణికుల సంఖ్య 8% వృద్ధి నమోదైంది. కాగా, ఆర్థిక సంవత్సరం మొదటి పది నెలల ప్రయాణికుల రాకపోకలు14 శాతం వరకు పెరిగినట్లు నివేదికలు చెబుతున్నాయి. అయితే ఢిల్లీ విమానాశ్రయంలో ప్రయాణికుల రాకపోకలతో పోలిస్తే హైదరాబాద్‌ విమానాశ్రయంలో ఎక్కువగా ఉంది.

కాగా, ఎజీఆర్‌ గ్రూప్‌ నేతృత్వంలో హైదరాబాద్‌, ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లతో పాటు గోవా, ఇండోనేషియా, ఫిలిప్సీన్స్‌ విమానాశ్రయాలు ఉన్నాయి. ఈ విమానాశ్రయాలలో ప్రయాణికుల రాకపోకల లెక్కలు చూస్తే ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు ప్రయాణికుల రాకపోకల్లో వృద్ధి ఉంది. ఇక విమానాల రాకపోకలు చూస్తే 13 శాతం వృద్ధి నమోదైంది. సంవత్సరం కిందట ప్రారంభమైన మోపా (గోవా) ఎయిర్పోర్ట్‌ నుంచి ప్రయాణికుల రాకపోకలు సాగించే ప్రయాణికుల సంఖ్య నెమ్మదిగా పెరుగుతున్నట్లు తెలుస్తోంది.

ఇదే తొలిసారి

ఇక హైదరాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి గత నెల 30న అత్యధికంగా 536 విమానాలు రాకపోకలు కొనసాగినట్లు ఎంజీఆర్‌ గ్రూప్‌ వెల్లడించింది. అయితే ఒక్క రోజులోనే ఇన్ని విమానాలు రాకపోకలు కొనసాగించడం ఇదే మొదటిసారి. అయితే హైదరాబాద్‌ విమానాశ్రయం నుంచి జాతీయ, అంతర్జాతీయ నగరాలకు కొత్త విమానాలు సైతం ప్రారంభం కావడంతో ప్రయాణికుల సంఖ్య కూడా భారీగా పెరిగినట్లు ఎంజీఆర్‌ గ్రూప్‌ పేర్కొంది. ఇక కొత్తగా హైదరాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌ నుంచి ఫ్రాంక్‌ఫర్ట్‌కు లుఫ్తాన్సా ఎయిర్‌లైన్స్‌ విమాన సర్వీసులను సైతం ప్రారంభించింది.

మరిన్ని  తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

అసలే అమావాస్య అర్ధరాత్రి.. కల్లాపి కోసం ఇంటి వరండాలోకి..
అసలే అమావాస్య అర్ధరాత్రి.. కల్లాపి కోసం ఇంటి వరండాలోకి..
3 ఏళ్ల తర్వాత రీఎంట్రీ.. కట్‌చేస్తే.. గంభీర్, సూర్య స్కెచ్‌కు బలి
3 ఏళ్ల తర్వాత రీఎంట్రీ.. కట్‌చేస్తే.. గంభీర్, సూర్య స్కెచ్‌కు బలి
రేషన్ కార్డులేనివారికి బంపర్ ఛాన్స్.. ప్రభుత్వం మళ్లీ అవకాశం
రేషన్ కార్డులేనివారికి బంపర్ ఛాన్స్.. ప్రభుత్వం మళ్లీ అవకాశం
స్పీ బాలు చెప్పిన మాటలు.. మరోసారి మీ ముందుకు..
స్పీ బాలు చెప్పిన మాటలు.. మరోసారి మీ ముందుకు..
ఘోర ప్రమాదం.. ట్రాక్ తప్పిన రైళ్లు.. చెల్లాచెదురైన బతుకులు..
ఘోర ప్రమాదం.. ట్రాక్ తప్పిన రైళ్లు.. చెల్లాచెదురైన బతుకులు..
నో రూల్స్ అంటున్న సమంత, నయన్, రష్మిక..కాన్సట్రేషన్ అంతా దాని మీదే
నో రూల్స్ అంటున్న సమంత, నయన్, రష్మిక..కాన్సట్రేషన్ అంతా దాని మీదే
హెచ్ఐవీ భయంతో మరణించిన మానవత్వం..! తల్లి శవంతో పదేళ్ల బాలుడు..
హెచ్ఐవీ భయంతో మరణించిన మానవత్వం..! తల్లి శవంతో పదేళ్ల బాలుడు..
శివుడికి ఇష్టమైన 5 రాశులు ఇవే.. వీరికి ఏ లోటూ రానివ్వడు!
శివుడికి ఇష్టమైన 5 రాశులు ఇవే.. వీరికి ఏ లోటూ రానివ్వడు!
మేడారం జాతరకు వెళ్లే మహిళలకు తీపికబురు.. ఆ బస్సుల్లోనూ ఫ్రీ జర్నీ
మేడారం జాతరకు వెళ్లే మహిళలకు తీపికబురు.. ఆ బస్సుల్లోనూ ఫ్రీ జర్నీ
21 మెయిడిన్లు, వరుస 131 డాట్ బాల్స్..! టెస్టుల్లో తోపులకు..
21 మెయిడిన్లు, వరుస 131 డాట్ బాల్స్..! టెస్టుల్లో తోపులకు..