Hyderabad Police: రాచకొండ పోలీస్ కమిషనేరట్ పరిధిలో పలువురు పోలీసు అధికారుల బదిలీ.. ఉత్తర్వులు జారీ చేసిన సీపీ..
Hyderabad Police: రాచకొండ పోలీస్ కమిషనేరట్ పరిధిలో పలువురు ఇన్స్‌పెక్టర్స్‌ని బదిలీ చేశారు పోలీస్ కమిషనర్ మహేష్ భగవత్. దాదాపు 10 మంది ఇన్స్‌పెక్టర్‌ను కమిషనరేట్ పరిధిలోని
Hyderabad Police: రాచకొండ పోలీస్ కమిషనేరట్ పరిధిలో పలువురు ఇన్స్‌పెక్టర్స్‌ని బదిలీ చేశారు పోలీస్ కమిషనర్ మహేష్ భగవత్. దాదాపు 10 మంది ఇన్స్‌పెక్టర్‌ను కమిషనరేట్ పరిధిలోని వివిధ పోస్టులకు బదిలీ చేశారు. రాచకొండ పీసీఆర్ గా ఉన్న పి. రఘువీర్ రెడ్డి ని కీసర పోలీస్ స్టేషన్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ (ఎస్ హెచ్ వో) గా బదిలీ చేశారు. అక్కడి ఎస్‌హెచ్‌వో నరేందర్ గౌడ్ ని సైబర్ క్రైమ్ కి బదిలీ చేశారు. ఇక ఉప్పల్ ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ కాశీ విశ్వనాధ్‌ని పహాడీ షరీఫ్ డిటెక్టివ్ ఇన్స్‌పెక్టర్‌గా బదిలీ చేశారు. ఆ స్థానంలో ఉన్న అర్జునయ్యని సిసిఎస్ ఎల్‌బి నగర్ కి మార్చారు. సీసీఎస్ భువనగిరి ఇన్స్‌పెక్టర్‌గా ఉన్న పార్థసారథిని ఉప్పల్ ట్రాఫిక్ ఎస్‌హెచ్‌ఓ గా పంపారు.
స్పెషల్ బ్రాంచ్ ఇన్స్‌పెక్టర్ కే. చంద్రశేఖర్ ని జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ ఎస్‌హెచ్‌ఓగా నియమించగా.. ఆ స్థానంలో ఉన్న పి. బిక్షపతి రాముని స్పెషల్ బ్రాంచ్ కి మార్చడం జరిగింది. మల్కాజ్‌గిరి డిటెక్టివ్ ఇన్స్‌పెక్టర్ హెచ్. వెంకటేశ్వర్లు భువనగిరి జోన్ ఎస్‌ఓటి గా.. ఆ స్థానంలోని పి.వెంకటేశ్వర్లుని రాచకొండ సిపిఓ గా బదిలీ చేశారు. ఇక ఇన్స్పెక్టర్ ఎం. ముని ని రాచకొండ పోలీస్ కంట్రోల్ రూమ్ కి బదిలీ చేశారు. ఈ బదిలీ ఉత్తర్వులు వెంటనే అమల్లోకి వస్తాయని, బదిలీ అయిన ఆఫీసర్స్ కొత్త స్టేషన్లలో వెంటనే రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది అని సీపీ తన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
Also read:
WhatsApp Groups: వాట్సాప్ గ్రూప్ అడ్మిన్లకు అదిరిపోయే ఫీచర్.. ఇక నుంచి ఆ మెసేజ్‌లకు చెక్..!