Hyderabad: తీవ్ర విషాదం.. పదో తరగతి పరీక్ష రాసేందుకు వెళ్లి ప్రాణాలు విడిచిన విద్యార్థి
గచ్చిబౌలి నుంచి లింగపల్లి వైపు వెళ్తుండగా.. ఫ్లై ఓవర్ పై ప్రమాదవశాత్తు ఆర్టీసీ డబుల్ డెక్కర్ బస్ కింద పడిపోయారు. ఆ సమయంలో ప్రభాతి ఛత్రియ మీది నుంచి ఆర్టీసీ డబుల్ డెక్కర్ బస్సు వెళ్లింది. దీంతో విద్యార్థిని ప్రభాతి అక్కడికక్కడే తుదిశ్వాస విడిచింది. కాగా.. విద్యార్థిని సోదరుడు సుమన్‌కు తీవ్ర గాయాలయ్యాయి. ఇది గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు.

హైదరాబాద్ నగరంలో తీవ్ర విషాద ఘటన చోటుచేసుకుంది. టెన్త్ క్లాస్ ఎగ్జామ్ రాసి ఇంటికి వెళ్తున్న విద్యార్థిని బస్సు చక్రాల కింద పడి స్పాట్‌లోనే దుర్మరణం పాలైంది. గచ్చిబౌలి ఫ్లైఓవర్ మీద ఈ ఘటన జరిగింది. తెలంగాణలో మార్చి 21వ తేదీ నుంచి టెన్త్ ఎగ్జామ్స్ మొదలయ్యాయి. మార్చి 22, శనివారం సెకండ్ లాంగ్వేజ్ పరీక్ష షెడ్యూల్ ఉంది. TNGO కాలనీలో నివాసం ఉంటున్న ప్రభాతి ఛత్రియ అనే పదో తరగతి విద్యార్థిని ఎగ్జామ్ ముగిసిన అనంతరం.. తన అన్న సుమన్ ఛత్రియతో కలిసి బైక్ ఇంటికి బయలుదేరింది.
గచ్చిబౌలి నుంచి లింగపల్లి వైపు వెళ్తుండగా.. ఫ్లై ఓవర్ పై ప్రమాదవశాత్తు ఆర్టీసీ డబుల్ డెక్కర్ బస్ కింద పడిపోయారు. ఆ సమయంలో ప్రభాతి ఛత్రియ మీది నుంచి ఆర్టీసీ డబుల్ డెక్కర్ బస్సు వెళ్లింది. దీంతో విద్యార్థిని ప్రభాతి అక్కడికక్కడే తుదిశ్వాస విడిచింది. కాగా.. విద్యార్థిని సోదరుడు సుమన్‌కు తీవ్ర గాయాలయ్యాయి. ఇది గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. విద్యార్థిని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించిన పోలీసులు, గాయపడ్డ సుమన్‌ను సమీప ఆసుపత్రికి తరలించారు.
ఈ ప్రమాదంతో అక్కడ భారీగా ట్రాపిక్ జామ్ అయ్యింది. సమాచారం తెలుసుకున్న పోలీసులు ట్రాఫిక్ క్లియర్ చేశారు. గాయపడిన సుమన్ ఛత్రియ పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. కళ్ల ముందే కూతురు మరణాన్ని తట్టుకోలేక కుటుంబ సభ్యుల తీవ్రంగా రోదిస్తున్నారు. ప్రభాతి ఛత్రియ డెడ్ బాడీని అక్కడి నుంచి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు రాయదుర్గం పోలీసులు. ఈ ప్రమాదానికి గల కారణాలు పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు పోలీసులు.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..