AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

HYD Metro Extension: ఓల్డ్ సిటీలో మెట్రో వద్దు! మెట్రో రైల్‌ విస్తరణ ఆపాలంటూ హైకోర్టులో పిల్ దాఖాలు

హైదరాబాద్‌ ఓల్డ్‌ సిటీలో మెట్రో రైలు విస్తరణ పనులను ఆపాలని హైకోర్టులో పిల్ దాఖలైంది. పబ్లిక్ వెల్ఫేర్ ఫౌండేషన్ దాఖలు చేసిన ఈ పిల్‌కు ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేయడానికి మూడు వారాల సమయం కోరింది. ఎంజీబీఎస్ నుంచి చాంద్రాయణగుట్ట వరకు 7.5 కి.మీ మెట్రో లైన్ నిర్మాణం కోసం 1100 ఆస్తుల భూసేకరణ జరుగుతోంది. భూ సేకరణలోని సమస్యల నేపథ్యంలోనే ఈ పిల్ దాఖలైంది.

HYD Metro Extension: ఓల్డ్ సిటీలో మెట్రో వద్దు! మెట్రో రైల్‌ విస్తరణ ఆపాలంటూ హైకోర్టులో పిల్ దాఖాలు
SN Pasha
|

Updated on: Feb 28, 2025 | 7:19 AM

Share

హైదరాబాద్‌ మెట్రో రైలు విస్తరించాలని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. దీనికి సంబంధించి పనులు కూడా మొదలుపెట్టింది. అయితే తాజాగా హైదరాబాద్‌లోని ఓల్డ్‌ సిటీలో మెట్రో పనులు ఆపాలంటూ హైకోర్టులో తాజాగా పిల్‌(పబ్లిక్‌ ఇంట్రెస్ట్‌ లిటిగేషన్‌) దాఖలైంది. ఈ ప్రజా ప్రయోజన వాజ్యాన్ని పబ్లిక్ వెల్ఫేర్ ఫౌండేషన్ స్వచ్ఛంద సంస్థ దాఖలు చేసింది. దీనికి కౌంటర్ దాఖలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం మూడు వారాల సమయం కోరింది. ఈ కేసుపై తదుపరి విచారణను ఏప్రిల్ 3కు వాయిదా వేసింది హైకోర్టు. కాగా ఎంజీ బస్‌ స్టేషన్‌ నుంచి ఓల్డ్‌ సిటీలోని చాం ద్రాయణ గుట్ట వరకు మెట్రోని విస్తరించేలా పనులు చేపట్టింది ప్రభుత్వం.

ఇప్పటికే మెట్రో విస్తరణలో కీలకమైన భూసేకరణ పై అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. 7.5 కిలోమీటర్ల పొడవైన మెట్రోను ఎంజీబీఎస్‌ నుంచి చాంద్రాయణగుట్ట వరకు నిర్మించనున్నారు. ఫేస్‌-2లో ఇదీ మొదటి కారిడార్‌ కానుండగా ప్రాజెక్టు కోసం 1100 ఆస్తులను సేకరించేందుకు ప్రిలిమినరీ నోటిఫికేషన్‌ జారీ చేశారు. ఇందులో 800 ఆస్తులకు ప్రిలిమినరీ నోటిఫికేషన్‌ను పలు దఫాలుగా జిల్లా రెవెన్యూ అధికారులు చేపట్టారు. మొదటి దశ ప్రైవేట్‌ ఆస్తులకు పరిహారాన్ని చెల్లించడం మొదలైంది. అదే సమయంలో కొన్నిచోట్ల కూల్చివేతలు ప్రారంభించారు. ప్రాజెక్టుకు భూములు స్వచ్ఛందంగా ఇచ్చే యజమానులతో సంప్రదింపులు చేస్తూనే, సమస్యాత్మక ఆస్తుల సేకరణపై అధికారులు ఆచితూచి అడుగులు వేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే పనులు ఆపాలంటూ పిల్‌ దాఖాలు కావడం చర్చనీయాంశంగా మారింది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.