AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Weather Update: తెలంగాణకు మరో ఐదు రోజుల పాటు వర్ష సూచన.. ఆ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్!

రానున్న ఐదు రోజుల పాటు తెలంగాణలో వర్షాలు కొనసాగుతాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. నైరుతి బంగ్లాదేశ్‌, దాన్ని ఆనుకొని ఉన్న పశ్చిమ బెంగాల్‌లోని గంగా తీరప్రాంతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా ఈ వర్షాలు కురువనున్నాయని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. దీని ప్రభావంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో మోస్తరు నుంచి తెలిక పాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.

Weather Update: తెలంగాణకు మరో ఐదు రోజుల పాటు వర్ష సూచన.. ఆ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్!
Rains
Anand T
|

Updated on: Jun 18, 2025 | 12:30 AM

Share

నైరుతి బంగ్లాదేశ్‌, దాన్ని ఆనుకొని ఉన్న పశ్చిమ బెంగాల్‌లోని గంగా తీరప్రాంతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా తెలంగాణ రాష్ట్రంలో రానున్న మరో ఐదు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ శాఖ తెలిపింది. ఈ అల్పపీడనం కారణంతో రాష్ట్రంలోని పలు జిల్లాలో ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షాలతో పాటు గంటలకు 30 నుంచి 40 కిలో మీటలర్ల వేగంతో ఈదురుగాలులు కూడా వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. వర్షాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

కాగా మంగళవారం భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతవరణ శాఖ తెలిపింది. వర్షాలతో పాటు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు కూడా వీచే అవకాశాలున్నాయని పేర్కొంది. ఇక బుధవారం భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్‌ జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని స్పష్టం చేసింది. గురువారం ఆదిలాబాద్‌, ఆసిఫాబాద్‌, మంచిర్యాల, నిర్మల్‌, నిజామాబాద్‌, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్‌, పెద్దపల్లి, భూపాలపల్లి జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.

శుక్రవారం ఆదిలాబాద్‌, ఆసిఫాబాద్‌, మంచిర్యాల, నిర్మల్‌, నిజామాబాద్‌, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్‌, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్‌, వరంగల్‌, హన్మకొండ, జనగాం, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్‌, మల్కాజ్‌గిరి, సంగారెడ్డి, వికారాబాద్‌, మెదక్‌, కామారెడ్డి జిల్లాల్లో మోస్తరు నుంచి తెలికపాటి వర్షాలు కురువడంతో పాటు ఈదురుగాలులు కూడా వీస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.

మరోవైపు శనివారం హైదరాబాద్‌ సమా రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్‌, వరంగల్‌, హన్మకొండ, జనగాం, సిద్దిపేట, భువనగిరి, మేడ్చల్‌ మల్కాజ్‌గిరి, వికారాబాద్‌, సంగారెడ్డి, మెదక్‌, కామారెడ్డి జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ పేర్కొంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
శుక్రవారం ఈ వస్తువులను ఇంట్లో ఉంచుకుంటే లక్ష్మీ దేవి నిలవదు!
శుక్రవారం ఈ వస్తువులను ఇంట్లో ఉంచుకుంటే లక్ష్మీ దేవి నిలవదు!
పండు మాస్టర్‌కు వీడియో కాల్ చేసి మాట్లాడిన యాంకర్ సుమ..
పండు మాస్టర్‌కు వీడియో కాల్ చేసి మాట్లాడిన యాంకర్ సుమ..
సోఫియా గార్డెన్స్‌లో భారత్ రికార్డు ఎలా ఉంది?
సోఫియా గార్డెన్స్‌లో భారత్ రికార్డు ఎలా ఉంది?
తాతగారి 24 ఏళ్ల నాటి SBI పాస్‌బుక్‌లో రూ.1 లక్ష బ్యాలెన్స్!
తాతగారి 24 ఏళ్ల నాటి SBI పాస్‌బుక్‌లో రూ.1 లక్ష బ్యాలెన్స్!
నా మీద 9 కోట్లు పెట్టి సినిమా తీస్తే మొత్తం పోతాయ్..జగపతి బాబు..
నా మీద 9 కోట్లు పెట్టి సినిమా తీస్తే మొత్తం పోతాయ్..జగపతి బాబు..
ఆ ఒక్క బ్యానర్ వల్ల అర్జెంటీనా ఫుట్‌బాల్ జట్టుకు భారీ షాక్?
ఆ ఒక్క బ్యానర్ వల్ల అర్జెంటీనా ఫుట్‌బాల్ జట్టుకు భారీ షాక్?
మీ పార్ట్‌నర్‌తో ఏకాంతంగా ఉన్నప్పుడు ఫోన్‌లో ఈ సెట్టింగ్స్..
మీ పార్ట్‌నర్‌తో ఏకాంతంగా ఉన్నప్పుడు ఫోన్‌లో ఈ సెట్టింగ్స్..
సూర్యోదయం ఫోటోను ఈ గదిలో పెడితే శుభం.. కానీ ఇక్కడ మాత్రం అస్సలు..
సూర్యోదయం ఫోటోను ఈ గదిలో పెడితే శుభం.. కానీ ఇక్కడ మాత్రం అస్సలు..
గురు మూఢమిలో ఆస్తిపాస్తులతో ఆ రాశుల వారు జాగ్రత్త!
గురు మూఢమిలో ఆస్తిపాస్తులతో ఆ రాశుల వారు జాగ్రత్త!
మనుషులు కాదు.. మృగాలు! బాలికపై ముగ్గురు ఆటో డైవర్ల పైశాచికం!
మనుషులు కాదు.. మృగాలు! బాలికపై ముగ్గురు ఆటో డైవర్ల పైశాచికం!