AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఇంటి ముందు వేప చెట్టు ఉంటే ఏం జరుగుతుంది..? వాస్తు శాస్త్రం ఏం చెబుతుందో తెలిస్తే..

వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో లేదా ఇంటి ప్రాంగణంలో వేప చెట్టును పెంచడం ఎంతో శ్రేయస్కరంగా భావిస్తారు. అయితే దీనిని సరైన దిశలో నాటడం చాలా ముఖ్యం. దీనివల్ల ఇంట్లోని ప్రతికూల శక్తులు తొలగిపోయి, ధన ప్రవాహం, సానుకూల వాతావరణం ఏర్పడుతుంది. అంతేకాకుండా, వేప చెట్టు గాలిని శుద్ధి చేసి, ఆరోగ్యకరమైన వాతావరణాన్ని అందిస్తుంది. అయితే, ఇంటికి ఏ దిశలో వేప చెట్టును పెంచుకోవచ్చు.. వాస్తు నిపుణులు ఏం చెబుతున్నారో ఇప్పుడు చూద్దాం..

ఇంటి ముందు వేప చెట్టు ఉంటే ఏం జరుగుతుంది..? వాస్తు శాస్త్రం ఏం చెబుతుందో తెలిస్తే..
Neem Tree VastuImage Credit source: tv9 telugu
Jyothi Gadda
|

Updated on: Aug 31, 2026 | 12:47 PM

Share

సనాతన ధర్మంలోనూ, ఆయుర్వేదంలోనూ వేప చెట్టుకు చాలా ప్రత్యేకమైన స్థానం ఉంది. వేప చెట్టును లక్ష్మీదేవి, దుర్గామాత స్వరూపంగా భావిస్తారు. ఇంట్లో వేప చెట్టు ఉండటం వల్ల లభించే ఆరోగ్య ప్రయోజనాలతో పాటు వాస్తు పరంగా కూడా అనేక ఉపయోగాలు ఉన్నాయి. అయితే వాస్తు నిబంధనల ప్రకారం వేప చెట్టును ఏ దిశలో నాటాలి, దానివల్ల కలిగే శుభ ఫలితాలు ఏమిటో తెలుసుకోవడం అవసరం.

వేప చెట్టు నాటడానికి ఉత్తమమైన దిశలు:

వాయువ్యం, పశ్చిమ దిశ: వాస్తు శాస్త్ర ప్రకారం ఇంటికి వాయువ్యంలో లేదా పశ్చిమ దిశలో వేప చెట్టును పెంచడం అత్యంత శుభకరం. ఇది ఇంట్లోని వాస్తు దోషాలను తొలగించి, కుటుంబ సభ్యుల మధ్య ఐక్యతను పెంచుతుంది.

దక్షిణ దిశ:

ఇవి కూడా చదవండి

దక్షిణ దిశలో వేప చెట్టు నాటడం వల్ల జాతకంలో ఉన్న అంగారక దోషాలు (కుజ దోషం) పితృదోషాల ప్రభావం తగ్గుతుందని విశ్వసిస్తారు.

వేప చెట్టు వల్ల కలిగే వాస్తు ప్రయోజనాలు:

ప్రతికూల శక్తి నివారణ: వేప చెట్టు ఇంట్లోకి ప్రవేశించే చెడు శక్తులను నిరోధించి, ఇల్లంతా సానుకూల శక్తి నింపడానికి తోడ్పడుతుంది.

ఆరోగ్య సంరక్షణ: వేప ఆకుల ద్వారా వచ్చే గాలి క్రిమిసంహారకంగా పనిచేస్తుంది. గాలిలోని హానికర బాక్టీరియాను నశింపజేసి ఇల్లు ఎప్పుడూ పరిశుభ్రంగా ఉండేలా చేస్తుంది.

శనిదేవుడు, కేతు గ్రహ శాంతి: ఇంట్లో వేప చెట్టు ఉండి, రోజూ దానిని సంరక్షించడం వల్ల శని మరియు కేతు గ్రహాల ప్రతికూల ప్రభావాలు తగ్గుతాయని జ్యోతిష్య నిపుణులు చెబుతారు.

పాటించాల్సిన ప్రధాన జాగ్రత్తలు:

వేప చెట్టును ఎల్లప్పుడూ ఇంటి కాంపౌండ్ వాల్‌కు కాస్త దూరంగా నాటాలి. చెట్టు వేర్లు ఇంటి పునాదులకు నష్టం కలిగించకుండా చూడాలి.

ఇంటికి సరిగ్గా తూర్పు, లేదా ఈశాన్యం వైపున పెద్ద వేప చెట్టు ఉండటం వల్ల సూర్యకాంతి ఇంట్లోకి రాకుండా ఆగిపోతుంది. కాబట్టి ఆ దిశలలో పెద్ద చెట్లను పెంచకపోవడం మంచిది.

వేప చెట్టు ఎండిపోకుండా ఎప్పటికప్పుడు నీరు పోసి పచ్చగా ఉండేలా చూసుకోవాలి. ఎండిపోయిన చెట్టు ఇంట్లో ఉంటే వాస్తు దోషం కలుగుతుంది.

ఈ వాస్తు సూత్రాలను పాటిస్తూ ఇంట్లో వేప చెట్టును పెంచుకోవడం వల్ల సుఖసంతోషాలు, శ్రేయస్సు, మంచి ఆరోగ్యం లభిస్తాయి.

(Disclaimer: ఈ కథనంలోని వివరాలు హిందూ మత సంప్రదాయాలు, విశ్వాసాలు, ఆచారాల ఆధారంగా ఇవ్వబడ్డాయి. వీటిని శాస్త్రీయంగా నిరూపితమైన విషయాలుగా పరిగణించకూడదు. కర్మకాండల విధానం ప్రాంతం, కుటుంబ సంప్రదాయం, ఆచార వ్యవహారాలను బట్టి మారవచ్చు. వ్యక్తిగత నిర్ణయాలు తీసుకునేముందు సంబంధిత నిపుణులను సంప్రదించడం మంచిది.)

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Follow Us
హైదరాబాద్‌లో విషాదం.. ఎండిన చెట్టు రూపంలో మృత్యువు!
హైదరాబాద్‌లో విషాదం.. ఎండిన చెట్టు రూపంలో మృత్యువు!
రీఛార్జ్‌ ప్లాన్స్‌ ఇంత చౌకనా.. బీఎస్ఎన్ఎల్ మరో కొత్త ప్లాన్స్‌!
రీఛార్జ్‌ ప్లాన్స్‌ ఇంత చౌకనా.. బీఎస్ఎన్ఎల్ మరో కొత్త ప్లాన్స్‌!
వయసు పెరిగే కొద్దీ పురుషుల డైట్ మారాలి.. ఏ వయసులో ఏం తినాలంటే
వయసు పెరిగే కొద్దీ పురుషుల డైట్ మారాలి.. ఏ వయసులో ఏం తినాలంటే
డమరుకం డిజైన్‌కు జై షా ఫిదా.. కాశీకి క్రికెట్ కానుక
డమరుకం డిజైన్‌కు జై షా ఫిదా.. కాశీకి క్రికెట్ కానుక
పొలంలో టమాటా ధర తక్కువ.. మార్కెట్‌లో మాత్రం ఎందుకంత ఎక్కువ? 
పొలంలో టమాటా ధర తక్కువ.. మార్కెట్‌లో మాత్రం ఎందుకంత ఎక్కువ? 
Space-Xను వెనక్కి నెట్టిన ఆంత్రోపిక్.. భారతీయులు షేర్లు కొనొచ్చా?
Space-Xను వెనక్కి నెట్టిన ఆంత్రోపిక్.. భారతీయులు షేర్లు కొనొచ్చా?
రాహుల్ గాంధీ నాగ్‌పూర్ టూర్ పేరుతో స్కెచ్.. కట్‌ చేస్తే..!
రాహుల్ గాంధీ నాగ్‌పూర్ టూర్ పేరుతో స్కెచ్.. కట్‌ చేస్తే..!
కార్తీక పౌర్ణమి వ్రత ప్రసాదం.. శివుడికి సమర్పించే నైవేద్యం ఇదే
కార్తీక పౌర్ణమి వ్రత ప్రసాదం.. శివుడికి సమర్పించే నైవేద్యం ఇదే
మరో 15 నెలల్లో మనుషులకు ఉద్యోగాలు ఉండవా? AIపై సంచలన హెచ్చరిక!
మరో 15 నెలల్లో మనుషులకు ఉద్యోగాలు ఉండవా? AIపై సంచలన హెచ్చరిక!
ఉసిరి చెట్టు ఆవిర్భావం వెనుక ఆసక్తికరమైన పురాణ గాథలు!
ఉసిరి చెట్టు ఆవిర్భావం వెనుక ఆసక్తికరమైన పురాణ గాథలు!