నేపాల్ వరదల్లో అద్భుతం.. దేవదూతల మారిన దున్నపోతు! నదిలో కొట్టుకుపోతున్న వ్యక్తిని ఇలా..
నేపాల్‌లో ఇటీవల సంభవించిన వినాశకరమైన వరదలు అన్నిచోట్లా తీవ్ర విధ్వంసం సృష్టించాయి. నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. ఆ శక్తివంతమైన ప్రవాహాంలో మనుషులు, పశుపక్షాదుల నుంచి పెద్ద పెద్ద భవనాల వరకు అన్నింటినీ కొట్టుకుపోతున్నాయి.. ఈ విధ్వంసం, గందరగోళం మధ్య, దిగ్భ్రాంతికరమైన, హృదయానికి హత్తుకునే ఒక వీడియో సోషల్ మీడియాలో వెలుగులోకి వచ్చింది. ఆ వీడియోలో, ఉప్పొంగుతున్న నది బలమైన ప్రవాహంలో ఒక యువకుడు చిక్కుకుపోవడం కనిపిస్తుంది. కానీ, అతడిని రక్షించడానికి వచ్చింది మానవ సహాయక బృందం కాదు, ఒక దేవదూత అయిన దున్నపోతు. పూర్తి వివరాల్లోకి వెళితే...

ప్రకృతి కోపానికి ఎదురునిలవడం మనిషికి ఎప్పుడూ కష్టతరమే. ముఖ్యంగా వరదలు, కొండచరియలు విరిగిపడే సమయంలో నిమిషాల వ్యవధిలోనే ప్రాణాలు గాలిలో కలిసిపోతుంటాయి. ఇటీవల నేపాల్‌లో కురిసిన భారీ వర్షాల వల్ల నదులు ఉప్పొంగి ప్రవహిస్తూ బీభత్సం సృష్టించాయి. ఇటువంటి విపత్తు సమయంలో ప్రాణాలను కాపాడుకోవడానికి ఓ వ్యక్తి చేసిన సాహసం, ప్రదర్శించిన సమయస్ఫూర్తి నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది.
ఉధృత ప్రవాహంలో అద్భుత ఘట్టం:
నేపాల్‌లోని ఒక నది వద్ద వరద నీరు మహోగ్రంగా ప్రవహిస్తోంది. ఆ హోరెత్తే ప్రవాహంలో ఒక వ్యక్తి చిక్కుకుపోయాడు. ఒడ్డుకు చేరడం అసాధ్యమని భావించిన సమయంలో, అతడికి ఒక పశువు కనిపించింది. ఏమాత్రం ఆలస్యం చేయకుండా, ప్రాణాలపై ఆశతో అతడు ఆ దున్నపోతు వీపుపైకి ఎక్కి గట్టిగా పట్టుకున్నాడు. నదిలోని సుడిగుండాలు, వేగవంతమైన ప్రవాహాన్ని ఎదుర్కొంటూ ఆ జంతువు ఈదుకుంటూ ముందుకు సాగింది.
ఈ ఉత్కంఠభరిత దృశ్యాన్ని ఒడ్డున ఉన్న స్థానికులు వీడియో తీశారు. నీటి ఉధృతికి కొట్టుకుపోకుండా ఆ మూగజీవి తన బలాన్నంతా ఉపయోగించి సురక్షితంగా అతడిని ఒడ్డుకు చేర్చింది. ఒడ్డుకు రాగానే ఆ వ్యక్తి ఉపశమనంతో ఊపిరి పీల్చుకున్నాడు.
వీడియో ఇక్కడ చూడండి..
भैंस बनी जीवन रक्षक, जी हां, भैंस ने बचाई युवक की जान pic.twitter.com/iLRBRjjT47
— आजाद भारत का आजाद नागरिक (@AnathNagrik) August 30, 2026
సోషల్ మీడియాలో వైరల్:
ఈ వీడియో నెట్‌లో ప్రత్యక్షమవ్వగానే శరవేగంగా వైరల్ అయింది. క్లిష్టమైన పరిస్థితుల్లో భయపడకుండా ఆ వ్యక్తి చూపించిన సమయస్ఫూర్తిని, అలాగే ఆపద సమయంలో సాయపడిన ఆ మూగజీవి పట్టుదలను నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. ఆపదలో ధైర్యమే నిజమైన ఆయుధం, దున్నపోతు రూపంలో ఆ వ్యక్తికి దేవుడే సహాయం చేశాడు అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.
ఇదిలా ఉంటే.. అసలు సంగతి ఏంటంటే.. ఈ వీడియో ఏఐ ద్వారా క్రియేట్ చేసినట్టుగా తెలుస్తోంది. విపత్తుల సమయంలో కొందరు ఇలాంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా రకరకాల వీడియోలను తయారు చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. వ్యూస్, లైకుల కోసం చేసే ఇలాంటి వీడియోస్ నెట్టింట విపరీతంగా వైరల్ అవుతున్నాయి.




