AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ప్రోటీన్ పుష్కలంగా ఉండే పవర్‌ఫుల్‌ బ్రేక్‌ఫాస్ట్‌.. శనగ పప్పుతో ఇలా చేస్తే ఒకటికి రెండు ఎక్కువ తింటారు..!

మీరు బహుశా బియ్యం దోసెను చాలాసార్లు తిని ఉంటారు. కానీ, ఈసారి బ్రేక్‌ఫాస్ట్‌ కోసం ఆరోగ్యకరమైన, రుచికరమైనది ప్రయత్నించండి. శనగ పప్పు, బొంబాయి రవ్వతో తయారు చేసిన ఈ దోసెలో ప్రోటీన్ పుష్కలంగా ఉంటుంది. నానబెట్టకుండా, పులియబెట్టకుండా రుచికరమైన, కరకరలాడే, ప్రోటీన్ అధికంగా ఉండే దోసెలు తయారు చేయాలనుకుంటే, శనగపప్పు, బొంబాయి రవ్వ దోసె ఒక అద్భుతమైన ఎంపిక. కొబ్బరి చట్నీ లేదా సాంబార్‌తో వేడిగా వడ్డించారంటే.. రుచికరమైన, కడుపు నింపే పవర్‌ఫుల్‌ బ్రేక్‌ఫాస్ట్‌ అవుతుంది.

ప్రోటీన్ పుష్కలంగా ఉండే పవర్‌ఫుల్‌ బ్రేక్‌ఫాస్ట్‌.. శనగ పప్పుతో ఇలా చేస్తే ఒకటికి రెండు ఎక్కువ తింటారు..!
Protein Rich Breakfast
Jyothi Gadda
|

Updated on: Aug 31, 2026 | 8:07 AM

Share

రోజూ తినే టిఫిన్లకు భిన్నంగా, ఆరోగ్యకరమైన, క్రిస్పీగా ఉండే టిఫిన్ ఏదైనా చేయాలని ఆలోచిస్తున్నారా? అయితే శనగపప్పు దోసె సరైన ఎంపిక. ఇది కేవలం నోరూరించే రుచినే కాకుండా, శరీరానికి అవసరమైన పోషకాలను కూడా అందిస్తుంది. ముఖ్యంగా బరువు తగ్గాలనుకునే వారికి, ప్రోటీన్ ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవానుకునే వారికి ఇది సరైన బ్రేక్‌ఫాస్ట్.

కావలసిన పదార్థాలు:

శనగపప్పు: 1 కప్పు

బియ్యం: 1/2 కప్పు

ఇవి కూడా చదవండి

పచ్చిమిర్చి: 2-3

అల్లం ముక్క: 1 అంగుళం

జీలకర్ర: 1 టీస్పూన్

ఇంగువ: చిటికెడు

ఉప్పు: రుచికి సరిపడా

నూనె లేదా నెయ్యి: దోసెలు కాల్చడానికి సరిపడా

కొత్తిమీర: సన్నగా తరిగినది మీ మోతాదుకు సరిపడా

తయారీ విధానం:

ముందుగా శనగపప్పు, బియ్యాన్ని శుభ్రంగా కడిగి, సరిపడా నీరు పోసి కనీసం 3 నుండి 4 గంటల పాటు నానబెట్టుకోవాలి. నానిన శనగపప్పు, బియ్యంలో ఉన్న నీటిని వడకట్టి, మిక్సీ జార్‌లో వేయాలి. అందులో పచ్చిమిర్చి, అల్లం ముక్కలు, జీలకర్ర, రుచికి సరిపడా ఉప్పు చేర్చి మెత్తటి పిండిలా రుబ్బుకోవాలి. అవసరమైతే కొద్దిగా నీరు కలపవచ్చు. పిండి మరీ పల్చగా లేదా గట్టిగా ఉండకూడదు. రుబ్బిన పిండిని ఒక గిన్నెలోకి తీసుకుని అందులో ఇంగువ, సన్నగా తరిగిన కొత్తిమీర కలిపి 10 నిమిషాలు పక్కన ఉంచాలి. దీనికి పులియబెట్టాల్సిన అవసరం లేదు.

పొయ్యిపై పెనం పెట్టి వేడెక్కిన తర్వాత, కొద్దిగా నీళ్లు చల్లి శుభ్రమైన గుడ్డతో తుడవాలి. ఇప్పుడు ఒక గరిటె పిండిని పెనం మధ్యలో వేసి వృత్తాకారంలో పల్చగా రుద్దాలి. దోశ చుట్టూ, మధ్యలో కొద్దిగా నూనె లేదా నెయ్యి వేసి, మధ్యస్థ మంటపై దోసె బంగారు రంగు వచ్చి క్రిస్పీగా మారే వరకు కాల్చుకోవాలి. దోశను రెండో వైపు తిప్పాల్సిన అవసరం లేదు.

ఆరోగ్య ప్రయోజనాలు:

శనగపప్పులో ఐరన్, ప్రోటీన్, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది. తక్కువ క్యాలరీలు, ఎక్కువ పోషకాలు ఉండే ఈ క్రిస్పీ శనగపప్పు దోశను వేడివేడిగా కొబ్బరి చట్నీ లేదా కారప్పొడితో తింటే అద్భుతంగా ఉంటుంది.

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Follow Us
ప్రోటీన్ పుష్కలంగా ఉండే పవర్‌ఫుల్‌ బ్రేక్‌ఫాస్ట్‌.. శనగ పప్పు దోశ
ప్రోటీన్ పుష్కలంగా ఉండే పవర్‌ఫుల్‌ బ్రేక్‌ఫాస్ట్‌.. శనగ పప్పు దోశ
టీ20ల్లో ప్రపంచ రికార్డ్‌.. తొలి ప్లేయర్‌గా దీప్తి శర్మ..!
టీ20ల్లో ప్రపంచ రికార్డ్‌.. తొలి ప్లేయర్‌గా దీప్తి శర్మ..!
ఉద్యోగులకు గుడ్ న్యూస్.. ఈపీఎఫ్ఓ కొత్త పథకం..
ఉద్యోగులకు గుడ్ న్యూస్.. ఈపీఎఫ్ఓ కొత్త పథకం..
హైదరాబాద్‌ వాసులకు గుడ్ న్యూస్.. ఆ మార్గంలో అందుబాటులోకి బ్రిడ్జి
హైదరాబాద్‌ వాసులకు గుడ్ న్యూస్.. ఆ మార్గంలో అందుబాటులోకి బ్రిడ్జి
బ్లాక్ బస్టర్ సినిమాను ఆ హీరోకు ఇచ్చేసిన సూపర్ స్టార్ కృష్ణ
బ్లాక్ బస్టర్ సినిమాను ఆ హీరోకు ఇచ్చేసిన సూపర్ స్టార్ కృష్ణ
భారీ గ్రహాల సంచారం.. ఈ రాశులకు డబ్బు, తిరుగులేని విజయం
భారీ గ్రహాల సంచారం.. ఈ రాశులకు డబ్బు, తిరుగులేని విజయం
ఆఫీస్ క్యాంటీన్ టీకి గుడ్‌బై.. ఇంటి రుచిని ఇచ్చే టీ మసాలా ఇదిగో!
ఆఫీస్ క్యాంటీన్ టీకి గుడ్‌బై.. ఇంటి రుచిని ఇచ్చే టీ మసాలా ఇదిగో!
ఇకపై నో బాల్స్ వేస్తే.. ఫైన్‌తోపాటు టీంమేట్స్‌కు డిన్నర్ పార్టీ..
ఇకపై నో బాల్స్ వేస్తే.. ఫైన్‌తోపాటు టీంమేట్స్‌కు డిన్నర్ పార్టీ..
తెలుగు రాష్ట్రాలకు వర్షసూచన.. లేటెస్ట్ వెదర్ రిపోర్ట్
తెలుగు రాష్ట్రాలకు వర్షసూచన.. లేటెస్ట్ వెదర్ రిపోర్ట్
కాల్‌మేట్‌ నుంచి భారీ పవర్​ బ్యాంక్​.. ధర ఎంతంటే
కాల్‌మేట్‌ నుంచి భారీ పవర్​ బ్యాంక్​.. ధర ఎంతంటే