AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నీట్ ఎగ్జామ్‌కు వచ్చిన విద్యార్థి.. ఒక్కసారిగా గుప్పుమన్న వాసన.. అనుమానంతో చూడగా..

దేశవ్యాప్తంగా NEET PG ప్రవేశ పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. దేశవ్యాప్తంగా 2,73,183 మంది అభ్యర్థులు పరీక్షకు దరఖాస్తు చేసుకోగా సుమారు 1,300 కేంద్రాల్లో పరీక్ష నిర్వహించారు. రంగారెడ్డి జిల్లా శేరిగూడ నీట్ పీజీ కేంద్రానికి మద్యం మత్తులో వచ్చిన విద్యార్థిని సిబ్బంది అడ్డుకున్నారు. పూర్తి వివరాలు తెలుసుకోండి.

నీట్ ఎగ్జామ్‌కు వచ్చిన విద్యార్థి.. ఒక్కసారిగా గుప్పుమన్న వాసన.. అనుమానంతో చూడగా..
Neet Pg Exam
Ranjith Muppidi
| Edited By: |

Updated on: Aug 31, 2026 | 10:52 AM

Share

దేశవ్యాప్తంగా NEET PG ప్రవేశ పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. దేశవ్యాప్తంగా 2,73,183 మంది విద్యార్థులు పరీక్షకు దరఖాస్తు చేసుకోగా.. సుమారు 1,300 పరీక్షా కేంద్రాల్లో ఎగ్జామ్ నిర్వహించారు. తెలంగాణలోనూ పరీక్షకు భారీ సంఖ్యలో అభ్యర్థులు హాజరయ్యారు. రాష్ట్రవ్యాప్తంగా 17,627 మంది దరఖాస్తు చేసుకోగా.. 56 కేంద్రాల్లో పరీక్ష నిర్వహించారు. అయితే రంగారెడ్డి జిల్లాలో మాత్రం ఓ విద్యార్థి వ్యవహారం కాసేపు హాట్‌టాపిక్‌గా మారింది. శేరిగూడలోని పరీక్షా కేంద్రానికి ఓ విద్యార్థి మద్యం తాగి నీట్ పీజీ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసేందుకు వచ్చాడు. అతడిని గమనించిన పరీక్షా సిబ్బంది.. వెంటనే గుర్తించి పరీక్షా కేంద్రంలోకి అనుమతించలేదు. మద్యం మత్తులో ఉన్న అతడిని అక్కడి నుంచి వెనక్కి పంపించారు.

NEET PG పరీక్ష ఆదివారం ఉదయం 9 గంటలకు ప్రారంభమై మధ్యాహ్నం 12.30 గంటల వరకు కొనసాగింది. కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్ట్‌ (CBT) విధానంలో పరీక్ష నిర్వహించారు. దేశవ్యాప్తంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పరీక్షా కేంద్రాల వద్ద కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. తెలంగాణలోనూ అన్ని పరీక్షా కేంద్రాల వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకున్నారు.

మొత్తంగా.. రాష్ట్రవ్యాప్తంగా NEET PG పరీక్ష ప్రశాంతంగా ముగియగా, శేరిగూడలో మాత్రం మద్యం మత్తులో పరీక్ష రాసేందుకు వచ్చిన విద్యార్థి వ్యవహారం చర్చనీయాంశంగా మారింది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
ఉగ్రవాదంపై భారత్ దృఢ సంకల్పం: ప్రధాని మోదీ
ఉగ్రవాదంపై భారత్ దృఢ సంకల్పం: ప్రధాని మోదీ
భారత్‌ వేదికగా 18వ బ్రిక్స్‌ శిఖరాగ్ర సదస్సు.. ప్రత్యేకతలివే..
భారత్‌ వేదికగా 18వ బ్రిక్స్‌ శిఖరాగ్ర సదస్సు.. ప్రత్యేకతలివే..
గుడ్లు, చికెన్, పాల ధరలు ఎందుకు పెరుగుతున్నాయో తెలుసా? కారణం ఇదే!
గుడ్లు, చికెన్, పాల ధరలు ఎందుకు పెరుగుతున్నాయో తెలుసా? కారణం ఇదే!
రోజును బట్టి దీపంలో ఇవి వేయండి.. ఇంట్లో శుభం, ఐశ్వర్యం పెరుగుతాయట
రోజును బట్టి దీపంలో ఇవి వేయండి.. ఇంట్లో శుభం, ఐశ్వర్యం పెరుగుతాయట
ప్రపంచంలోనే అత్యంత సన్నని కారు ఇదే..!
ప్రపంచంలోనే అత్యంత సన్నని కారు ఇదే..!
కుజుడు, గురువు అనుగ్రహం.. ఆ రాశులకు నీచభంగ రాజయోగం!
కుజుడు, గురువు అనుగ్రహం.. ఆ రాశులకు నీచభంగ రాజయోగం!
అక్కడ 600 వసతిగృహాలకు ఒకటే తాళం.. సిబ్బంది, వంటవాళ్లు ఉండరు..!
అక్కడ 600 వసతిగృహాలకు ఒకటే తాళం.. సిబ్బంది, వంటవాళ్లు ఉండరు..!
సికింద్రాబాద్ - విశాఖ వెళ్లే ప్రయాణికులు బిగ్‌ అలర్ట్
సికింద్రాబాద్ - విశాఖ వెళ్లే ప్రయాణికులు బిగ్‌ అలర్ట్
యాక్టర్స్ లైఫ్ అంతేనా.. చివరకు ఆమె చనిపోయినప్పుడు బాడీకి తల లేదు.
యాక్టర్స్ లైఫ్ అంతేనా.. చివరకు ఆమె చనిపోయినప్పుడు బాడీకి తల లేదు.
శని అనుగ్రహం ఉన్న నక్షత్రాలు ఇవే.. ఈ నక్షత్రాల వారికి తిరుగేలేదట
శని అనుగ్రహం ఉన్న నక్షత్రాలు ఇవే.. ఈ నక్షత్రాల వారికి తిరుగేలేదట