AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఇకపై నో ‘ఇంపాక్ట్‌ ప్లేయర్‌’.. ఫ్రాంచైజీలకు దిమ్మతిరిగే షాకివ్వనున్న బీసీసీఐ..!

IPL Impact Player Rule: ఐపీఎల్ 2027 (IPL 2027)లోనూ ఇంపాక్ట్‌ ప్లేయర్‌ నిబంధన కొనసాగుతుందా? దీనిపై BCCI పది ఫ్రాంచైజీల అభిప్రాయాలను కోరినట్లు సమాచారం. దీంతో ఈ రూల్‌పై మరోసారి చర్చ మొదలైంది. వీటితోపాటు అంపైరింగ్‌, ప్రాక్టీస్‌ సెషన్లు తదితర అంశాలపైనా బీసీసీఐ అభిప్రాయాలను కోరినట్లు సమాచారం. వచ్చే ఏడాదికి ముందే వీటిపై కీలక నిర్ణయాలు తీసుకునే దిశగా బీసీసీఐ అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది.

ఇకపై నో 'ఇంపాక్ట్‌ ప్లేయర్‌'.. ఫ్రాంచైజీలకు దిమ్మతిరిగే షాకివ్వనున్న బీసీసీఐ..!
Ipl Impact Player Rule
Venkata Chari
|

Updated on: Aug 31, 2026 | 1:10 PM

Share

IPL Impact Player Rule: ఐపీఎల్‌లో కీలకమైన ఇంపాక్ట్‌ ప్లేయర్‌ నిబంధనపై భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (BCCI) మరోసారి దృష్టి సారించింది. వచ్చే ఐపీఎల్‌ సీజన్‌లో ఈ విధానాన్ని కొనసాగించాలా? వద్దా? అనే అంశంపై 10 ఫ్రాంచైజీల నుంచి బీసీసీఐ ఫీడ్‌బ్యాక్‌ కోరినట్లు తెలుస్తోంది. ఇంపాక్ట్‌ ప్లేయర్‌ రూల్‌ ప్రవేశపెట్టినప్పటి నుంచి దీనిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నిబంధనతో జట్లకు వ్యూహాలను మార్చుకునే అవకాశం పెరిగిందని కొందరు భావిస్తుండగా.. ఇది ఆటలో ఆల్‌రౌండర్ల ప్రాధాన్యాన్ని తగ్గిస్తోందని మరికొందరు విమర్శిస్తున్నారు.

ఫ్రాంచైజీల అభిప్రాయమే కీలకం..!

ఈ నేపథ్యంలోనే బీసీసీఐ అన్ని ఐపీఎల్‌ ఫ్రాంచైజీల అభిప్రాయాలను తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నట్లు సమాచారం. వచ్చే సీజన్‌లో ఇంపాక్ట్‌ ప్లేయర్‌ విధానాన్ని కొనసాగించాలా? దానిలో ఏమైనా మార్పులు చేయాలా? అనే అంశాలపై జట్ల నుంచి సూచనలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.

ఎక్కువమంది చదివినది: Video: 6 ఫోర్లు, 7 సిక్సర్లతో విధ్వంసం.. 26 బంతుల్లో 296 స్ట్రైక్ రేట్‌తో కాటేరమ్మ కొడుకు ఊచకోత చూశారా..?

ఇవి కూడా చదవండి

ఇదే సమయంలో అంపైరింగ్‌, ప్రాక్టీస్‌ సెషన్లు తదితర అంశాలపైనా బీసీసీఐ అభిప్రాయాలను కోరినట్లు సమాచారం. దీంతో రాబోయే సీజన్‌కు సంబంధించి పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం కనిపిస్తోంది.

కొనసాగిస్తారా.. మారుస్తారా?

ఇంపాక్ట్‌ ప్లేయర్‌ నిబంధన కొనసాగింపుపై బీసీసీఐ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఫ్రాంచైజీల నుంచి వచ్చే ఫీడ్‌బ్యాక్‌ ఆధారంగా ఈ రూల్‌పై తుది నిర్ణయం తీసుకునే అవకాశముంది.

ఎక్కువమంది చదివినది: Team India: ఇకపై నో బాల్స్ వేస్తే జేబుకు చిల్లే.. ఫైన్‌తోపాటు టీంమేట్స్‌కు డిన్నర్ పార్టీ..!

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us