Hyderabad: టు లెట్ బోర్డు కనిపిస్తే చాలు వాడికి పండగే.. హైదరాబాద్‌లో వెలుగు చూసిన నయా మోసం..

ఎక్కువ అద్దె వస్తుందని ఆశ చూపుతూ ప్రజలను మోసం చేస్తున్న ఘరానా మాయగాడిని హుస్సేని హాలం పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

Hyderabad: టు లెట్ బోర్డు కనిపిస్తే చాలు వాడికి పండగే.. హైదరాబాద్‌లో వెలుగు చూసిన నయా మోసం..
Hyderabad Cheater
Follow us

|

Updated on: Mar 05, 2023 | 1:50 PM

ఎక్కువ అద్దె వస్తుందని ఆశ చూపుతూ ప్రజలను మోసం చేస్తున్న ఘరానా మాయగాడిని హుస్సేని హాలం పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. పాతబస్తీలో టు లెట్​బోర్డు కనిపిస్తే అంతే.. గద్దలా వాలిపోతాడు.. చిన్న చిన్న దుకాణాలకు ఇస్తే అద్దె ఏం వస్తుందని యజమానులను బురిడీకొట్టిస్తాడు. పెద్ద పెద్ద బ్యాంక్​ఏటీఎం సెంటర్​లకు ఇస్తే నెలకు అద్దె రూ. 30 వేల వరకు వస్తుందని మాయమాటలతో నమ్మిస్తాడు. యజమాని ఓకే అనగానే కొలతలు తీసుకుందామని, కొలతలు తీసుకున్నట్లు నటిస్తాడు. రెండు కాగితాలు చూపించి మీరు ఇపుడు రూ.20 వేలు చెల్లిస్తే ఈ అమౌంట్​రీఫండబుల్ అవుతుందని నమ్మిస్తాడు. లక్కీ చాన్స్ పోగొట్టుకోవద్దంటూ.. ఒక్కొక్కరివద్ద నుంచి రూ.18వేల నుంచి రూ. 30వేలు వరకు నొక్కేస్తాడు. ఆ తరువాత పత్తా లేకుండా పోతాడు. ఒకవేళ దొరికితే సెటిల్ చేస్తానంటూ వాయిదాల పద్దతిలో తిరిగి చెల్లిస్తాడు. ఈ తరహా నయా మోసానికి పాల్పడుతున్న కేటుగాడిని హుస్సేనిహాలం పోలీసులు అరెస్ట్​ చేశారు.

హుస్సేనిహాలం ఇన్‌స్పెక్టర్​నరేష్​తెలిపిన వివరాల ప్రకారం.. యాకుత్‌పురాకు చెందిన ఎంబీఏ విద్యార్థి, రియల్​ఎస్టేట్ ఏజెంట్​మొహమ్మద్​అబ్దుల్ ఖుద్రూస్ (32) గత కొంత కాలంగా కామాటిపురా, ఫలక్‌నుమా, రెయిన్​బజార్ పోలీస్​స్టేషన్ పరిధిలలో ఖాళీ మల్గీలలో బ్యాంకు సంబంధించిన ఏటీఎం సెంటర్​పెట్టిస్తానని, నెలకు రూ.30వేల వరకు సమయానికి అద్దె వస్తుందని మాయమాటలతో నమ్మించి, రీఫండబుల్​అమౌంట్​పేరిట ఒక్కొక్కరి దగ్గర రూ.18వేల నుంచి రూ.20వేల వరకు నొక్కేశాడు. తాజాగా హుస్సేనిహాలం పోలీస్​స్టేషన్ పరిధిలో కూడా కోకాబజార్​కు చెందిన మీర్జా ఆలీబేగ్(50) వద్ద డబ్బులు నొక్కేశాడు. తాను మోసపోయానని ఆలస్యంగా గ్రహించిన మీర్జా ఆలీబేగ్.. వెంటనే హుస్సేనిహాలం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు అబ్దుల్​ఖుద్రూస్ పై ఐపిసి 419, 420 సెక్షన్​ల కింద కేసులు నమోదు చేసి రిమాండ్​కు తరలించారు. ఈ కేసును హుస్సేని హాలం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..