AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

హైదరాబాద్ మహిళలకు గుడ్ న్యూస్.. 7వ తరగతి, ఇంటర్ అర్హతతో ఉద్యోగాలు..

చిన్నారులకు ప్రాథమిక దశ నుంచే నాణ్యమైన విద్య అందించాలన్న లక్ష్యంతో హైదరాబాద్ జిల్లాలోని 275 ప్రభుత్వ పాఠశాలల్లో 2026-27 విద్యా సంవత్సరం నుంచి ప్రీ-ప్రైమరీ తరగతులు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో ఇన్‌స్ట్రక్టర్లు, ఆయాల నియామకానికి జిల్లా విద్యాశాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది.

హైదరాబాద్ మహిళలకు గుడ్ న్యూస్.. 7వ తరగతి, ఇంటర్ అర్హతతో ఉద్యోగాలు..
Women
Ashok Bheemanapalli
| Edited By: |

Updated on: Jun 10, 2026 | 9:56 AM

Share

చిన్నారులకు ప్రాథమిక దశ నుంచే నాణ్యమైన విద్య అందించాలన్న లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 2026-27 అకడమిక్ ఇయర్ నుంచి హైదరాబాద్ జిల్లాలోని 275 ప్రభుత్వ ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల్లో ప్రీ-ప్రైమరీ తరగతులను ప్రారంభించనుంది. ఈ నేపథ్యంలో ఆయా పాఠశాలల్లో ఇన్‌స్ట్రక్టర్లు, ఆయాల నియామకానికి జిల్లా విద్యాశాఖ అధికారులు నోటిఫికేషన్ విడుదల చేశారు.

జిల్లా విద్యాశాఖ అధికారి (డీఈఓ), సమగ్ర శిక్ష జిల్లా ప్రాజెక్టు అధికారి సంయుక్తంగా విడుదల చేసిన ప్రకటన ప్రకారం, ఈ నియామకాలు పూర్తిగా తాత్కాలిక ప్రాతిపదికన, గౌరవ వేతనం ఆధారంగా చేపట్టనున్నారు. పాఠశాల విద్యాశాఖ మే 26, 2026న జారీ చేసిన ఉత్తర్వుల మేరకు ఈ ప్రక్రియ నిర్వహించబడుతోంది. ఇన్‌స్ట్రక్టర్లకు నెలకు రూ.8,000, ఆయాలకు రూ.6,000 గౌరవ వేతనం అందజేయనున్నారు. ఇన్‌స్ట్రక్టర్ పోస్టులకు కనీసం ఇంటర్మీడియట్ ఉత్తీర్ణత తప్పనిసరి. చిన్నారుల సంరక్షణ, ప్రీ-ప్రైమరీ విద్యకు సంబంధించిన ఎర్లీ చైల్డ్‌హుడ్ కేర్ లేదా నర్సరీ ట్రైనింగ్ పొందిన అభ్యర్థులకు ప్రాధాన్యం ఇవ్వనున్నారు.

ఆయా పోస్టులకు కనీసం 7వ తరగతి ఉత్తీర్ణత అర్హతగా నిర్ణయించారు. స్థానిక మహిళా అభ్యర్థులకు ప్రాధాన్యం కల్పించనున్నారు. కేవలం మహిళలు మాత్రమే దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు. అభ్యర్థుల వయస్సు 18 నుంచి 44 సంవత్సరాల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, మాజీ సైనికులకు 3 సంవత్సరాలు, దివ్యాంగులకు 10 సంవత్సరాల వయో పరిమితి సడలింపు వర్తిస్తుంది. అభ్యర్థుల ఎంపికలో ముందుగా అదే గ్రామం లేదా ప్రాంతానికి చెందిన వారికి, ఆ తర్వాత అదే మండలానికి చెందిన వారికి, చివరిగా జిల్లా స్థాయి అభ్యర్థులకు ప్రాధాన్యం ఇవ్వనున్నారు.

ఆసక్తి గల అభ్యర్థులు నిర్ణీత దరఖాస్తు ఫారంతో పాటు విద్యార్హతల ధ్రువపత్రాలు, నివాస ధ్రువీకరణ పత్రాలు, గుర్తింపు కార్డులు తదితర అవసరమైన పత్రాలను జతచేసి సంబంధిత మండల విద్యాధికారి (ఎంఈఓ) కార్యాలయంలో సమర్పించాలి. దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ జూన్ 9 నుంచి జూన్ 15, 2026 వరకు ప్రతిరోజూ ఉదయం 10.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కొనసాగుతుంది. అసంపూర్ణ దరఖాస్తులు లేదా గడువు తర్వాత అందిన దరఖాస్తులను పరిగణనలోకి తీసుకోబోమని అధికారులు స్పష్టం చేశారు. నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలు, పాఠశాలల జాబితా కోసం అభ్యర్థులు జిల్లా విద్యాశాఖ అధికారిక వెబ్‌సైట్‌(http://deohyderabad.org/)ను సందర్శించాలని సూచించారు.

మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Follow Us