వీరుడి జీవిత కథలో నటించనున్న రాజకీయ నాయకుడు. ఇంతకీ ఎవరా నేత..? ఏంటా సినిమా.? ఏంటా కథ..?
ఇప్పటి వరకు ఆఫ్ స్క్రీన్‌పై తనదైన దూకుడును ప్రదర్శించిన రాజాసింగ్ ఇప్పుడు ఆన్ స్క్రీన్‌పై కనిపించనున్నారు. అవును మీరు చదివింది నిజమే.. రాజిసింగ్ సినిమాలో నటించనున్నారు. ఈ విషయాన్ని ఆయనే..
Raja Singh Turns As Hero: తెలంగాణ రాజకీయాల్లో నిత్యం వార్తల్లో నిలుస్తు ఉండే నాయకుల్లో గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ ఒకరు. మొన్నటి వరకు అసెంబ్లీలో ఒక్కడే అధికార పక్షంపై తనదైన మాటల తూటాలతో దాడి చేశారు రాజాసింగ్. ప్రస్తుతం ఆయనకు రాఘునందన్ రావు రూపంలో మరో ఎమ్మెల్యే తోడయ్యారు. ఇదిలా ఉంటే రాజకీయాల్లో బిజీగా ఉంటూనే గోరరక్షకుడిగా గోవుల అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపుతుంటారు రాజా సింగ్.
గతంలో ఆవుల అక్రమ రవాణాను వీరోచితంగా అడ్డుకున్న వీడియోలు మీడియాలో పలుమార్లు చక్కర్లు కొట్టిన విషయం తెలిసిందే. ఇక ఇప్పటి వరకు ఆఫ్ స్క్రీన్‌పై తనదైన దూకుడును ప్రదర్శించిన రాజాసింగ్ ఇప్పుడు ఆన్ స్క్రీన్‌పై కనిపించనున్నారు. అవును మీరు చదివింది నిజమే.. రాజిసింగ్ సినిమాలో నటించనున్నారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ప్రకటించారు. శంభాజీ మహారాజ్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతోన్న ఓ సినిమాలో రాజాసింగ్ శంభాజీ పాత్రలో కనిపించనున్నారు. అంతేకాదు ఈ సినిమా కోసం ఇప్పటి నుంచే వర్కవుట్లు కూడా మొదలు పెట్టారు రాజాసింగ్. ఇందుకోసం ఏకంగా 80 కిలోల బరువు తగ్గారు. తెలుగు, హిందీ, మరాఠీ భాషల్లో ఈ సినిమాను తెరకెక్కించనున్నట్లు రాజాసింగ్ చెప్పుకొచ్చారు. ఇక శంభాజీ మహారాజ్ ఎవరనేగా మీ సందేహం. ఆ మహారాజ్‌కు సంబంధించిన చరిత్ర ఎమ్మెల్యే రాజాసింగ్ మాటల్లోనే.. ‘ఛత్రపతి శివాజీ మహారాజ్ గురించి అందరికీ తెలుసు కానీ ఆయన కుమారుడు శంభాజీ గురించి మాత్రం ఎవరికీ తెలియదు. శివాజీ దేశం, ధర్మం కోసం ఏ విధంగా అయితే పోరాడారో.. శంభాజీ మహారాజ్ కూడా అంతకంటే ఎక్కువగా పోరాడారు. ప్రతీ వర్గానికి చెందిన వారిని తన సైన్యంలో చేర్చుకొని బౌరంగజేబు సామ్రాజ్యంపై దాడి చేశారు. ఈ క్రమంలో 120 కోటలను స్వాధీనం చేసుకున్నారు. శంభాజీ జీవిత చరిత్ర చాలా గొప్పది. ఆయన జీవిత గాధపై సినిమా చేయాలని.. అందులో నేనే నటించాలని అనుకున్నాను’ అంటూ చెప్పుకొచ్చారు. ఈ సినిమా గురించి రాజా సింగ్ టీవీ9తో మరిన్ని ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ఆ విశేషాలను కింది వీడియోలో చూడండి.
Also Read: తెలంగాణ పండుగల ప్రాశస్త్యం పెంచిన ఘనత సీఎం కేసీఆర్‌దే.. పెద్దగట్టు జాతరలో మంత్రులు