Crocodile Attack Human: సంగారెడ్డి జిల్లాలో విషాదం.. పశువులను కడగడానికి వెళ్లిన వ్యక్తిని నీళ్లలోకి ఈడ్చుకెళ్లిన మొసలి..
Crocodile Attack Human: సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండలం ఇసోజిపేటలో విషాదం చోటు చేసుకుంది. పశువులను కడగడానికి నదికి..
Crocodile Attack Human: సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండలం ఇసోజిపేటలో విషాదం చోటు చేసుకుంది. పశువులను కడగడానికి నదికి వెళ్లిన ఓ వ్యక్తిని మొసలి నీళ్లలోకి ఈడ్చుకెళ్లింది. పూర్తి వివరాల్లోకెళితే.. సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండలం ఇసోజిపేటలోకు చెందిన గొల్ల రాములుకు పశువులు ఉన్నాయి. అయితే, వాటిని కడగడానికి రాములు మంజీర నదికి తీసుకెళ్లాడు. పశువులను కడుగుతున్న సందర్భంగా రాములుపై మొసలి దాడి చేసింది. అతన్ని నీళ్లలోకి ఈడ్చుకెళ్లింది. ఇది గమనించిన చుట్టుపక్కన ఉన్న వారు గొల్ల రాములుని కాపాడేందుకు తీవ్ర ప్రయత్నం చేశారు. అయినప్పటికీ ప్రయోజనం లేకుండాపోయింది. మొసలి దాడిలో పశువుల కాపరి గొల్ల రాములు మృతి చెందాడు. చివరికి మొసలి అతన్ని విడిచిపెట్టడంతో గ్రామస్తులు రాములు మృతదేహాన్ని బయటకు తీశారు. కాగా, ఈ ఘటనలో ఇసోజిపేట గ్రామస్తులు తీవ్ర భయాందోళనలో ఉన్నారు. నదీ పరిసరాల్లోకి వెళ్లాలంటేనే హడలిపోతున్నారు.
Also read: