ఆళ్లగడ్డ పోలీసులను ఆశ్రయించిన టీడీపీ నేత.. మాజీ మంత్రి భూమా అఖిలప్రియ, బెదిరింపులకు పాల్పడుతున్నారని ఫిర్యాదు

Bhuma Akhilapriya complains : కర్నూలు జిల్లా ఆళ్లగడ్డలో తమ అభ్యర్థులను బెదిరిస్తున్నారని పోలీసులకు ఫిర్యాదు చేశారు మాజీ మంత్రి అఖిలప్రియ. టీడీపీ అభ్యర్థుల నామినేషన్లు విత్ డ్రా చేసుకున్నట్లు ఫోర్జరీ సంతకాలు చేసి బెదిరిస్తున్నారని,..

  • Venkata Narayana
  • Publish Date - 11:42 am, Mon, 1 March 21
ఆళ్లగడ్డ పోలీసులను ఆశ్రయించిన టీడీపీ నేత..  మాజీ మంత్రి భూమా అఖిలప్రియ, బెదిరింపులకు పాల్పడుతున్నారని ఫిర్యాదు

Bhuma Akhilapriya complains : కర్నూలు జిల్లా  ఆళ్లగడ్డ టీడీపీ అభ్యర్దులను వైసీపీ నాయకులు బెదిరింపులకు గురిచేస్తున్నారంటూ కర్నూలు జిల్లా రెండవ జాయింట్ కలెక్టర్ రామసుందర్ రెడ్డికి మాజీమంత్రి భూమా అఖిల ఫిర్యాదు చేశారు. వైసీపీ నాయకులు తెలుగుదేశం పార్టీ అభ్యర్దుల నామినేషన్లపై ఫోర్జరీ సంతకాలు చేసి టీడీపీ అభ్యర్దులు నామినేషన్లు విత్ డ్రా చేసుకున్నట్లు అధికారులు బెదిరిస్తున్నారని ఆమె తన ఫిర్యాదులో పేర్కొన్నారు. తమ అభ్యర్దులు ఎక్కడా సంతకాలు చేయలేదని, నామినేషన్ల విత్ డ్రాలపై స్పష్టత ఇవ్వాలని జేసి టూ ను కోరానని అఖిల ప్రియ స్పష్టం చేశారు. వైసీపీ వాళ్ల మాటలు విని పోలీసులు అక్రమ కేసులు పెడితే, మేము కూడా ఎదురు కేసులు పెడతామని అఖిల ప్రియ హెచ్చరించారు. ఓట్లు వేయకపోతే పింఛన్లు, ఇళ్లు ఇవ్వమని ఆళ్లగడ్డలో వైసీపీ నాయకులు నీచరాజకీయాలు చేస్తున్నారని అఖిల ప్రియ విమర్శించారు.

Read also : AP Temple attacks : కర్నూలు జిల్లా వెంకటనాయునిపల్లెలో సీతారాముల ఆలయ రాతి స్తంభాలు ధ్వంసం కేసులో కొత్త కోణాలు