Hyderabad: అనుమానాస్పద స్థితిలో హైదరాబాద్‌ సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ మృతి!

సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన మణికొండ మున్సిపాలిటీ అల్కాపూర్‌ కాలనీలో చోటుచేసుకుంది..

Hyderabad: అనుమానాస్పద స్థితిలో హైదరాబాద్‌ సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ మృతి!
Software Engineer
Follow us
Srilakshmi C

|

Updated on: Aug 17, 2022 | 8:41 PM

Software Engineer Died suspicious in Hyderabad: సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన మణికొండ మున్సిపాలిటీ అల్కాపూర్‌ కాలనీలో చోటుచేసుకుంది.  నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్న ఈ సంఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. ఎస్‌ఐ సమరంరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం…

కృష్ణాజిల్లా గన్నవరం మండలం, నున్న గ్రామానికి చెందిన వై భార్గవ రెడ్డి (31) ఐసీఐసీఐలో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా పనిచేస్తున్నాడు. భార్గవ రెడ్డి అతని స్నేహితులైన పూర్ణ సాయిసందీప్‌, జశ్వంత్‌లతో కలిసి పుప్పాలగూడ అల్కాపూర్‌లోని ఓ అపార్టుమెంట్‌లో నివసిస్తున్నాడు. సందీప్, జస్వంత్ కొద్ది రోజుల క్రితం స్వగ్రామానికి వెళ్లారు. సందీప్ మంగళవారం (ఆగస్టు 16) హైదరాబాద్‌కు తిరిగి వచ్చాడు. అపార్ట్‌మెంటుకు చేరుకున్న సందీప్‌ తలుపు తట్టినా ఎంతసేపటికీ భార్గవ రెడ్డి తలుపుతీయలేదు. దీంతో అపార్ట్‌మెంట్‌ వాచ్‌మెన్ సహాయంతో చిమ్నీ ద్వారా ఫ్లాట్‌లోకి ప్రవేశించి చూడగా, బెడ్‌ రూంలో నేలపై భార్గవరెడ్డి శవమై పడి ఉన్నాడు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాదీనం చేసుకుని శవపరీక్షల నిమిత్తం తరలించారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసు అధికారి ఒకరు మీడియాకు తెలిపారు.