Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రౌడీ షీటర్‌ అవ్వాలని హత్య..! రిమాండ్‌కు ముగ్గురు నిందితులు..!

కుక్కట్‌పల్లిలో రౌడీ షీటర్‌గా పేరున్న సయ్యద్ షాహిద్‌ను అతని స్నేహితులు సాజిద్, సమీర్ ఖాన్, మున్నా అనే ముగ్గురు హత్య చేశారు. షాహిద్ స్థానంలో తాము పెత్తనం చేయాలనే ఉద్దేశంతో ఈ హత్య జరిగింది. పోలీసులు ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.

రౌడీ షీటర్‌ అవ్వాలని హత్య..! రిమాండ్‌కు ముగ్గురు నిందితులు..!
Police
Noor Mohammed Shaik
| Edited By: SN Pasha|

Updated on: Jul 03, 2025 | 7:44 PM

Share

తమ ప్రాంతంలో రౌడీ షీటర్‌గా పెత్తనం చెలాయిస్తున్న రౌడీని హతమార్చి ఆ స్థానాన్ని తాము సొంతం చేసుకోవాలని ముగ్గురు కలిసి హత్యకు పాల్పడిన ఘటనలో నిందితులను అరెస్ట్ చేసిన కూకట్‌పల్లి పోలీసులు రిమాండుకు తరలించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బాలానగర్ జోన్ డీసీపీ సురేష్ వివరాలు వెల్లడించారు. బోరబండలో పేరు మోసిన రౌడీ షీటర్ కొడుకు సయ్యద్ షాహిద్ (26) సైతం ఆ ప్రాంతంలో తన తండ్రి స్థానాన్ని భర్తీ చేస్తూ రౌడీ షీటర్‌గా కొనసాగుతున్నాడు. షాహిద్ ను అడ్డు తొలగించి ఆ స్థానంలో తాము నిలవాలని అతని స్నేహితులు ఎండి సాజిద్ (24), ఎండి సమీర్ ఖాన్ (25), వై.హనాక్ (25) అలియాస్ మున్నా లు పన్నాగం పన్నారు.

పథకం ప్రకారం గత నెల 29వ తేదీన పవన్ అనే స్నేహితుడి జన్మదిన వేడుకలకు కూకట్‌పల్లి ప్రకాష్ నగర్ లోని ఓ నిర్మానుష్య ప్రదేశంలో హాజరైన షాహిద్, సాజిద్, మున్నాలు మద్యం సేవించాక.. మత్తులోకి వెళ్లిన షాహిద్ పై సాజిద్, మున్నాలు ముందుగా బీర్ బాటిల్ తో మెడ పై పొడిచి, తరువాత బండ తలతో బాది హత్య చేశారు. ఆ తర్వాత సంఘటన స్థలం నుండి పరారయ్యారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని హత్యకు పాల్పడిన ముగ్గురిని అరెస్ట్ చేసి ఈ రోజు రిమాండుకి తరలించినట్లు డీసీపీ తెలిపారు. కేసు ఛేదనలో ప్రతిభ కనబరిచిన పోలీసు సిబ్బందికి ఆయన అభినందనలు తెలియజేశారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఎవరమ్మా నువ్వు.. మరీ ఇలా ఉన్నావ్..! చిన్నారిని ఎత్తుకెళ్లి..
ఎవరమ్మా నువ్వు.. మరీ ఇలా ఉన్నావ్..! చిన్నారిని ఎత్తుకెళ్లి..
32 సిక్సులు, 97 ఫోర్లు.. ఇంగ్లీషోళ్ల బెండ్ తీసిన యువ సెన్సేషన్స్
32 సిక్సులు, 97 ఫోర్లు.. ఇంగ్లీషోళ్ల బెండ్ తీసిన యువ సెన్సేషన్స్
ప్రభాస్ సినిమాలో చేసి తప్పు చేశా..
ప్రభాస్ సినిమాలో చేసి తప్పు చేశా..
అక్కను స్కూల్‌లో దింపేసి వస్తానంటూ బయటకెళ్లిన తల్లి.. ఆ చిన్నారి
అక్కను స్కూల్‌లో దింపేసి వస్తానంటూ బయటకెళ్లిన తల్లి.. ఆ చిన్నారి
ప్రపంచ ఆయుర్వేద రంగంలో పతంజలి ఒక సంచలనం..టెలిమెడిసిన్ కేంద్రం
ప్రపంచ ఆయుర్వేద రంగంలో పతంజలి ఒక సంచలనం..టెలిమెడిసిన్ కేంద్రం
Virat Kohli: కోహ్లీ టెస్ట్ రిటైర్మెంట్ వెనుక అసలు రీజన్ అదే..
Virat Kohli: కోహ్లీ టెస్ట్ రిటైర్మెంట్ వెనుక అసలు రీజన్ అదే..
అక్కడ రివర్స్‌లో నీటి ప్రవాహం.. కాగితం పడవ వదిలి సంబరపడిన మంత్రి!
అక్కడ రివర్స్‌లో నీటి ప్రవాహం.. కాగితం పడవ వదిలి సంబరపడిన మంత్రి!
హైదరాబాద్‌ కూకట్‌పల్లిలో కల్తీ కల్లు కలకలం.. 13 మందికి అస్వస్థత..
హైదరాబాద్‌ కూకట్‌పల్లిలో కల్తీ కల్లు కలకలం.. 13 మందికి అస్వస్థత..
మూడు ముళ్లు వేసి.. రూ.28 కోట్లు కాజేసిన కేటుగాడు!
మూడు ముళ్లు వేసి.. రూ.28 కోట్లు కాజేసిన కేటుగాడు!
మహీంద్రా నుంచి కొత్త ఎస్‌యూవీ.. ధర చూస్తే క్యూ కట్టేస్తారంతే..
మహీంద్రా నుంచి కొత్త ఎస్‌యూవీ.. ధర చూస్తే క్యూ కట్టేస్తారంతే..