Churnika: కూచిపూడి ప్రదర్శనతో గిన్నిస్ రికార్డ్.. పదేళ్ల చిన్నారి అసాధారణ ప్రతిభ!
పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది అన్నట్లుగా ఓ పదేళ్ల చిన్నారి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్‌లో స్థానం సంపాదించి రికార్డ్ క్రియేట్ చేసింది. 4000 మందితో కలిసి కూచిపూడి నాట్య ప్రదర్శనలో పాల్గొన్న ఖమ్మం జిల్లాకు చెందిన చూర్ణిక గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్‌లో చోటు దక్కించుకుంది. పదేళ్లకే తల్లితండ్రుల కలలను సాకారం చేసి అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. గిన్నిస్ రికార్డు రావడం ఆ చిన్నారితో పాటు తన గ్రామానికే పేరు తెచ్చిపెట్టింది.

పదేళ్ల వయస్సులోనే ఓ చిన్నారి గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు దక్కించుకొని రికార్డ్ క్రియేట్ చేసింది. 4000 మందితో కలిసి కూచిపుడి నాట్యప్రదర్శనలో పాల్గొన్న ఖమ్మం జిల్లా వేంసూరు మండలం సత్యనారాయణపురం గ్రామానికి చెందిన చల్ల రమేష్ రెడ్డి మంజీరా దంపతుల కుమార్తె చూర్ణిక గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్‌లో చోటు సాధించింది. చూర్ణికకు చిన్నప్పట్నుంచి నాట్యమంటే ఇష్టం. రమేష్ రెడ్డి కుటుంబం ఉద్యోగరీత్యా హైదరాబాదులో ఉంటున్నారు. చూర్ణిక ప్రస్తుతం అక్కడే ఐదవ తరగతి చదువుతుంది. చిన్నారి చూర్ణికకు తల్లిదండ్రులు మూడేళ్ల నుంచి కూచిపూడి నాట్యం నేర్పిస్తున్నారు. 2023 డిసెంబర్‌లో భారత్ ఆర్ట్స్ అకాడమీ ఆధ్వర్యంలో 4219 మంది నృత్య కారులతో నిర్వహించిన భారీ ప్రదర్శనలో చూర్ణిక కూడా పాల్గొంది.
వీడియో చూడండి..
అయితే చూర్ణిక పాల్గొన్న ఈ ప్రదర్శన గిన్నిస్ బుక్ రికార్డ్స్‌లో చోటు దక్కించుకుంది. ఇందులో భాగంగానే గత జూన్ 29న గచ్చిబౌలి స్టేడియంలో గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ సర్టిఫికెట్‌ను చూర్ణిక అందుకుంది. చిన్న వయసులోనే గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు అందుకోవటంతో చూర్ణికకు గ్రామస్థులు అభినందనలు తెలియజేశారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.