AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Yousufguda: పక్కింటి వ్యక్తిని వీడియో తీశాడని పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లారు – ఆ తర్వాత ఇది సిట్యువేషన్

వీడియో తీశాడని ఓ బాలుడిని పోలీసుల చితకబాదడంతో మంచానికే పరిమతమైన ఘటన యూసుఫ్‌గూడలో జరిగింది. ఎల్‌ఎన్‌నగర్‌లో నివసించే అజిత్‌కుమార్‌ రీల్స్‌ చేస్తుండగా.. ఇంటి పక్కన ఉండే అతను స్నానం చేసి తల తుడుచుకుంటున్న వీడియో అనుకోకుండా ఐదు సెకండ్లు రికార్డ్ అయింది. అప్పటికే భయపడిన బాలుడు వీడియో డిలీట్‌ చేయగా.. అక్కడి వచ్చిన ఆ వ్యక్తి వీడియో తీశాడని బాలుడిని చితకబాది పోలీసులకు అప్పగించారు.. మూడు రోజులపాటు నిర్బంధించి తమ కుమారుడ్ని చితక్కొట్టారని బాలుడి తల్లి వాపోతుంది.

Yousufguda: పక్కింటి వ్యక్తిని వీడియో తీశాడని పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లారు - ఆ తర్వాత ఇది సిట్యువేషన్
Boy Paralyzed
Sridhar Rao
| Edited By: |

Updated on: Jul 03, 2025 | 9:45 PM

Share

పోలీసుల అత్యుత్సాహం వలన ఓ బాలుడు మంచానికే పరిమితం కావలసిన పరిస్థితి ఏర్పడింది.. యూసఫ్ గూడకు చెందిన అజయ్ కుమార్ శర్మ అనే ఎనిమిదో తరగతి చదువుతున్న బాలుడు గత సంవత్సరం డిసెంబర్ 15న సరదాగా రీల్స్ తీస్తున్న సమయంలో ఇంటి పక్కన ఉండే అతను స్నానం చేసి తల తుడుచుకుంటున్న వీడియో అనుకోకుండా ఐదు సెకండ్లు రికార్డ్ అయింది. అది గమనించిన పక్కింటి అతను కుటుంబ సభ్యులతో కలిసివచ్చి ఆ బాలుడ్ని కొట్టుకుంటూ జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌కి తీసుకువెళ్లి అప్పగించారు. బాలుడు తల్లి వారి కాళ్ళ మీద పడి వేడుకున్నా కనికరించలేదు. మాకు పెద్ద పెద్ద వాళ్లు.. తెలుసు వీడి అంతు చూస్తామంటూ పోలీస్ స్టేషన్లో మూడు రోజులు ఉంచారని బాలుడి తల్లి ఆరోపిస్తోంది.

ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తన కుమారుడిని చితక్కొట్టిన జూబ్లీహిల్స్ పోలీసులపై చర్యలు తీసుకోవాలని బాలుడి తండ్రి కోరుతున్నాడు. సూర్యాపేట జిల్లా మటంపల్లి కి చెందిన దగ్గుపాటి రాంబాబు బతుకు దెరువు కోసం యూసఫ్ గూడ ఎల్.ఎన్ నగర్ లో పది సంవత్సరాలుగా కుటుంబంతో సహా ఉంటున్నాడు. రాంబాబు కుమారుడు అజిత్ కుమార్ శర్మ (17) 2024 డిసెంబరు 15న వీడియో తీశాడని పోలీసులు స్టేషన్ కు తీసుకెళ్లారు. మూడు రోజుల పాటు నిర్బంధించి తమ కుమారుడిని విచక్షణారహితంగా కొట్టారని దానితో నడవలేని పరిస్థితిలో మంచానికే పరిమితమయ్యాడన్నారు.

ఆరు నెలలుగా హాస్పిటల్స్ చుట్టూ తిరుగుతున్నామని అయిన కూడా ఆరోగ్యం కుదుట పడడంలేదని కాళ్లు చచ్చుపడి మంచానికే పరిమితమయ్యడని బాలుడి తల్లి దగ్గుపాటి కనకదుర్గ చెబుతోంది. ఉస్మానియా ఆసుపత్రిలో చికిత్సకు తీసుకెళ్లినా నయం కావడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తుంది. తన కొడుకు గతంలో చురుకుగా ఆటలు ఆడేవాడని, NCCలో చురుకుగా పాల్గొనేవాడని.. స్టేషన్‌లో పోలీసులు తన కొడుకు జీవిత నాశనం చేశారని వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతుంది బాలుడి తల్లి.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి