మీ ఇంటిలో సంపద పెరగాలా?.. అయితే గణేశుడి ఈ పేర్లు జపించాల్సిందే!

Samatha

24 December 2025

ఏ ఇంటిలో అయితే నిత్యం గణనాథుడిని పూజిస్తూ,  నిత్యం ఆయన నామాలు జపిస్తారో వారి ఇంట పట్టిందల్లా బంగారమే అవుతుందంట.

వినాయకుడికి పద్నాలుగు పవిత్ర నామాలు ఉన్న విషయం తెలిసిందే. అయితే వీటిని ఎవరైతే భక్తి శ్రద్ధలతో జపిస్తారో వారు కోరిన కోర్కెలు నెరవేరుతాయంట.

ముఖ్యంగా గణేష్ చతుర్థి, బుధవారం లేదా ఇతర శుభ సమయాల్లో ఈ పద్నాలుగు నామాలు జపించడం వలన సంపద, ఆనందం పెరుగుతుంది.

ఆర్థిక స్థిరత్వం కోరుకునే వారు, అలాగే తమ జీవితంలో విజయం సిద్ధించాలి అనుకునే వారు, ప్రశాంత కరమైన జీవితానికి తప్పకుండా ఈ నామాలను జపించాలని చెబుతున్నారు పండితులు.

ఏ వ్యక్తి అయితే హృదయపూర్వకంగా గణేశుడి పద్నాలుగు నామాలు జపిస్తారో, వారికి ప్రత్యేకంగా వినాయకుడి అనుగ్రహం కలిగి,  కోరిన కోర్కెలు నెరవేరుతాయంట.

కాగా, ఇప్పుడు మనం ఇంటిలో సంపద, ఆర్థిక శ్రేయస్సు కోసం జపించాల్సిన వినాయకుడి పద్నాలుగు పేర్లు ఏవో చూద్దాం.

1. వినాయకుడు, 2. గజానన్, 3. లంబోదరుడు, 4 .ఏకదంత, 5. గణేష్, 6 .వక్రతుండ, 7. విఘ్నరాజ, 8. భాలచంద్రుడు, 9. గణధిప, 10. హేరంబ

11. వికట, 12. కృష్ణ పింగాక్ష, 13. అఖురథుడు, 14. గౌరీసుత.. ఎవరైతే భక్తితో ఈ పేర్లు పఠిస్తారో వారికి జీవితంలోని అడ్డంకులు తొలిగిపోయి సంపద పెరుగుతుంది.